చౌటుప్పల్ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైందని, మిగిలిన చోటామోటా నేతలంతా బంగారు తెలంగాణ పునఃనిర్మాణంలో కలిసి రావాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. చౌటుప్పల్‌లోని షాదీఖానాలో సోమవారం స్థానిక సర్పంచ్ బొంగు లావణ్య పలువురు వార్డు సభ్యులు, కార్యకర్తలతో కలిసి ఎంపీ నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరందరికీ ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనేక కుట్రలు పన్నుతున్నారన్నారు. అటు కరెంటు విషయంలో, హైకోర్టు విభజన విషయంలో అడ్డు తగులుతున్నారని ఆరోపించారు.
మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. టీడీపీలో మిగిలిపోయిన రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులకు టీఆర్‌ఎస్‌ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. వచ్చే నాలుగేళ్లలో నిరంతరంగా విద్యుత్‌ను అందించడంతో పాటు మిగులు విద్యుత్ ఉండేలా కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు బండ నరేందర్‌రెడ్డి, సుర్వి మల్లేష్‌గౌడ్, ముటుకుల్లోజు దయాకరాచారి, చిరందాసు ధనుం జయ, కంది భూపాల్‌రెడ్డి, ముత్యాల భూపాల్‌రెడ్డి, చింతల దామోదర్‌రెడ్డి, బొంగు జంగయ్య, గోవర్దన్‌రెడ్డి, మురళి, శ్రీనివాస్, అతహర్‌పాషా పాల్గొన్నారు.
తెలంగాణలో టీడీపీ కనుమరుగు
Published Tue, Apr 7 2015 3:27 AM | Last Updated on Thu, Aug 9 2018 5:32 PM
Advertisement
Advertisement