ఏపీ సీఎం చంద్రబాబు ఆ పదవిలో కొనసాగడానికి అనర్హుడని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్...
యాదగిరిగుట్ట/ఆలేరు : ఏపీ సీఎం చంద్రబాబు ఆ పదవిలో కొనసాగడానికి అనర్హుడని భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డిలు అన్నారు. గురువారం రాత్రి గుట్టలో, అంతకు ముందు ఆలేరులోని ప్రభుత్వ అతిథి గృహంలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో వారు మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో పట్టుబడి, తమ బాస్ ఆదేశాల మేరకు చేశానని చెప్పారని గుర్తు చేశారు. స్టీఫెన్‌తో ఫోన్‌లో మాట్లాడింది మూమ్మాటికీ బాబేనని అన్నారు.
ఇకనైనా బాబు తన తప్పు ఒప్పుకొని ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్- భూపాలపట్నం 163వ జాతీయ రహదారి విస్తరణ పనులకు ప్రతిఒక్కరూ సహకరించాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కోరారు. ఆలేరులోని ప్రభుత్వ అతిథి గృహంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 1905.23కోట్లు కేటాయిం చడం హర్షణీయమన్నారు. వారి వెంట నాయకులు గొంగిడి మహేందర్‌రెడ్డి, కర్రె వెంకటయ్య, గడ్డమీది రవీందర్‌గౌడ్, బూడిద స్వామి, ఎంపీపీ కాసగల్ల అనసూర్య, వైస్ ఎంపీపీ కొరకొప్పుల కిష్టయ్య, ఉపసర్పంచ్ దాసి సంతోష్, మల్లేశం, బెంజారం రవి, శమంతారెడ్డి, పాల్గొన్నారు.