
రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచాలి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కేంద్ర రైల్వేమంత్రి సురేశ్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు. లోక్‌సభలో రైల్వే నిధుల డిమాండ్ అంశంపై మంగళవారం జరిగిన చర్చలో ఎంపీ బూర మాట్లాడుతూ.. మునిరాబాద్-మహబూబ్‌నగర్, మనోహరాబాద్-కొత్తపల్లి, భద్రాచలం-కొవ్వూరు, మాచర్ల-నల్లగొండ, భద్రాచలం-సత్తుపల్లి, అక్కనపేట-మెదక్, కాజీపేట-బలార్షా, సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ ప్రాజెక్టులకు తక్కువ నిధులు కేటాయించారని, ఈ ప్రాజెక్టులకు సాధ్యమైన మేరకు నిధులు పెంచాలని విన్నవించారు. కాజీపేట రైల్వేజోన్ ప్రకటించాలని, కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల రాజధానుల మధ్య హైస్పీడ్ బుల్లెట్ రైలు నడిపించాలన్నారు.