Rail Budget
-
కాసేపట్లో బడ్జెట్ : రైల్వే స్టాక్స్ ఢమాల్
మరికొద్ది సేపట్లో బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానున్న నేపథ్యంలో రైల్వే స్టాక్స్ పడిపోయాయి. రైల్వేకు సంబంధించిన కంపెనీలన్నీ నేడు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న రైల్వే బడ్జెట్‌పై ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయి. మొదటిసారి రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్లో కలిపి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెడుతున్నారు. ఈ నేపథ్యంలో టెక్స్మాకో రైల్, కాళిందీ రైల్ నిర్మాణ్, కెర్నెక్స్ మైక్రోసిస్టమ్స్ షేర్లు బుధవారం ఇంట్రాడేలో 3 నుంచి 5 శాతం దిగువకు ట్రేడవుతున్నాయి. రైల్వేస్ భద్రతా ఫండ్‌పై ఇన్వెస్టర్లు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు విశ్లేషకులు చెప్పారు. ఇటీవల పలుచోట్ల ఘోర రైల్వేప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే. రైల్వే డెవలప్మెంట్ అథారిటీ అండ్ హై స్పీడ్ రైల్వే అథారిటీని కూడా ఈ బడ్జెట్లోనే ఏర్పాటుచేయనున్నారు. మరోవైపు మార్కెట్లు సైతం ఆందోళనలో లాభనష్టాల ఊగిసలాటలో నడుస్తున్నాయి. -
రైల్వే బడ్జెట్ విలీనం మంచిదికాదు
ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో విలీనం చేస్తూ కేంద్రకేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నాటి రైల్వే మంత్రి, నేటి బిహార్ సీఎం నితీష్ కుమార్ వ్యతిరేకిస్తున్నారు. 92 ఏళ్ల ఆనవాయితీకి చరమగీతం పాడుతూ సాధారణ బడ్జెట్లో ఈ బడ్జెట్‌ను విలీనం చేయడం వల్ల దేశానికి ఎలాంటి మంచి చేకూరదని ఆయన విమర్శించారు. దీనివల్ల రైల్వే తన స్వయంప్రతిపత్తిని కోల్పోతుందని తెలిపారు. ఈ విషయంపై ఎన్డీయే ప్రభుత్వం మరోసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. 1924 నుంచి ప్రత్యేక బడ్జెట్‌గా కొనసాగుతూ వస్తున్న రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్లో విలీనం చేసేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. రైల్వే మంత్రిగా తనకున్న అనుభవం ప్రకారం రైల్వే బడ్జెట్‌కు మంగళం పాడటంతో ఇటు రైల్వేకు, అటు దేశానికి ఎలాంటి మంచి చేకూరదని వివరించారు. దీనివల్ల రైల్వే ఇప్పటివరకు కలిగిఉన్న తన స్వయం ప్రతిపత్తిని కోల్పోతుందని నితీష్ పేర్కొన్నారు. అటల్ బిహార్ వాజ్‌పేయి కాలంలో ఎన్డీయే ప్రభుత్వంలో నితీష్, రైల్వే మంత్రిగా పనిచేశారు. రైల్వే నుంచి ప్రజలు చాలా ఆశిస్తుంటారని ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి, రైల్వే శాఖను సాఫీగా నడిచేలా చేయడానికి రైల్వే బడ్జెట్‌ను వేరుగా ఉండటమే మంచిదని సూచించారు. ప్రభుత్వం ముందస్తు లాగానే ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ను కొనసాగించాలని చెప్పారు. తను రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు, చాలామంది మంత్రులు సాధారణ బడ్జెట్ కంటే రైల్వే బడ్జెట్‌పైనే ఎక్కువగా ఆసక్తిచూపేవారని గుర్తుచేసుకున్నారు. వారి రాష్ట్రాలకు, నియోజకవర్గాలకు కొత్త రైళ్లు మార్గాలు వస్తాయని ఆశించేవారని చెప్పారు. కొన్ని సార్లు రైల్వేమంత్రులు సమస్యలు ఎదుర్కొన్నా, రైల్వే బడ్జెట్ ప్రత్యేకంగా ఉండటమే మంచిదని నితీష్ సూచించారు. -
రెండు బడ్జెట్ల విలీన అధ్యయనం షురూ
92 ఏళ్ల క్రితం నుంచి ఆనవాయితీగా కొనసాగుతూ వస్తున్న ప్రత్యేక రైల్వే బడ్జెట్‌కు చరమగీతం పాడేందుకు.. సాధారణ బడ్జెట్లో విలీనం చేసే ప్రతిపాదన ప్రక్రియను పరిశీలించడం ప్రారంభించామని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ తెలిపింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని.. రైల్వే మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ పరిశీలన ప్రక్రియను ప్రారంభించామని ఆర్థికశాఖ కార్యదర్శి అశోక్ లావాసా తెలిపారు.రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్ లో విలీనం చేయాలని కోరుతూ గత నెలలోనే రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనపై లాభనష్టాలన్నింటినీ బేరీజు వేసిన అనంతరమే తాము ఓ నిర్ణయానికి రాగలుగుతామని అశోక్ లావాసా వెల్లడించారు.ఒకవేళ విలీనానికి గ్రీన్ సిగ్నల్ వస్తే ప్రస్తుతం చెల్లించే వార్షిక డివిడెంట్ నుంచి రైల్వే విమోచనం పొంది ప్రభుత్వం నుంచి స్థూల బడ్జెటరీ సపోర్టును అందకోనుంది. దీంతో కొంతమేర నష్టాలను రైల్వే అధిగమించగలుగుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ చెబుతోంది. 1924 నుంచి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌నుంచి విడదీసి ప్రత్యేకంగా కేటాయింపులు చేయడం జరుగుతూ వస్తోంది. అప్పట్లో మొత్తం బడ్జెట్లో 70 శాతంగా ఉన్న రైల్వే బడ్జెట్ ప్రస్తుతం 15 శాతంగా మాత్రమే ఉంటోంది. దీంతో పాటు ప్రస్తుతం రైల్వే అధిక రెవెన్యూ లోటును భరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో రెండు బడ్జెట్లను విలీనం చేసి, ఈ భారాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖకు బదలాయించాలని సురేష్ ప్రభు ఈ విలీన ప్రతిపాదనను అరుణ్ జైట్లీ ముందుంచారు. రెండు బడ్జెట్ విలీన ప్రతిపాదనతో లేఖ రాసిన సురేష్ ప్రభు,అసలకే నష్టాల్లో ఉన్న రైల్వే, 7వ వేతన సంఘ సిఫారసులు వల్ల ఏర్పడే అదనపు నష్టాన్ని కూడా లేఖలో వివరించారు. -
పాత పట్టాల పరుగే
అందరినీ సంతృప్తి పరచాలనే తాపత్రయం అతి తరచుగా ఎవరినీ సంతృప్తి పరచకుండా ముగుస్తుంటుంది. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రెండవ రైల్వే బడ్జెట్ సరిగ్గా అలాంటిదే. కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్ల ఆశలు చూపని ఈ బడ్జెట్లోని ప్రధాన ఆకర్షణ ప్రయాణికుల, సరుకు రవాణా చార్జీలను పెంచకపోవడమే. 2015-16 రైల్వే బడ్జెట్ రూ. 1.83 కోట్ల రాబడిని లక్ష్యంగా పెట్టుకున్నా, సవరించిన అంచనాల ప్రకారం అది రూ. 1.67 కోట్లకు మించకపోవచ్చు. ఈ రాబడి లోటుకు తోడు ఏడవ పే కమిషన్ సిఫారసుల ప్రకారం వేతనాల పెరుగుదల రూ. 32.000 కోట్ల అదనపు భారాన్ని కూడా మోయాల్సి ఉంటుంది. అయితే ఆర్థిక వ్యవస్థ మంద గమనం వల్ల రవాణా చార్జీలను, ప్రయాణికుల చార్జీలను స్వల్పంగా పెంచినా రాబడిలో చెప్పుకోదగిన మార్పేమీ ఉండబోదనీ, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం శాసనసభ ఎన్నికలు ఈ ఏడాదే జరగాల్సి ఉండగా భారీ చార్జీల పెంపుదల రాజకీయంగా మంచిది కాదనీ ఆ జోలికి పోలేదనిపిస్తుంది. తర్వాత వడ్డింపులకు ఎలాగూ అవకాశం ఉంటుంది. చార్జీలు పెంచకుండానే రైల్వే మంత్రి ఈ ఏడాది కంటే 10 శాతం ఎక్కువ రాబడిని, రూ.1,84,820 కోట్లను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాదిలోనే రాబడి లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైన ైరైల్వేలు వచ్చే ఏడాది రాబడిని ఎలా పెంచుకోగలవో అర్థం కాదు. ఆపరేటింగ్ వ్యయాల నిష్పత్తిని... ప్రతి రూ. 100 రాబడి కోసం ఖర్చు చేయాల్సివచ్చే వ్యయాన్ని... ప్రస్తుత రూ.97.8 నుంచి రూ.92కు తగ్గిస్తా మన్నారు. మన రైల్వేలను పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక రుగ్మతలైన అనవసర, వృథా వ్యయాలు, అసమర్థత, అలసత్వాలను ఒక్క ఏడాదిలో మటుమాయం చేయగల చిట్కా ఏమిటో అంతుపట్టదు. గత ఏడాది దాదాపు లక్ష కోట్లుగా ఉన్న వ్యయాన్ని ఈ బడ్జెట్లో రూ. 1,21,000 కోట్లకు అంటే 21 శాతం పెంచారు. నిధులను జీవిత బీమా సంస్థ వచ్చే ఐదేళ్లలో అందజేయనున్న 1.5 లక్షల కోట్ల సులభ షరతుల రుణం నుంచి, విదేశాలలో బాండ్ల అమ్మకం ద్వారా సమీకరిస్తామన్నారు. భారత రైల్వేల ఆత్మ ప్రజలే అంటూ ప్రభు రైల్వేలను ప్రయాణికులకు అనుకూలమైనవిగా మార్చడానికి పలు చర్యలను ప్రతిపాదించారు. టెలిఫోన్ ద్వారా టికెట్ల రద్దు, ఎస్ఎమ్ఎస్ ద్వారా క్యాటరింగ్, ఉచిత వైఫై సర్వీసులు, పిల్లలున్న తల్లుల కోసం ప్రత్యేక సదుపాయాలు వంటి పలు మెరుపులు మెరిపించారు. ప్రయాణికులకు సదుపాయాలను, స్టేషన్లు, రైళ్లలో పారిశుద్ధ్యం, సమాచార వ్యవస్థలను మెరుగుపర్చడం అవసరమనడం నిస్సం దేహం. తద్వారా ప్రయాణికులను ఆకట్టుకోగలమని భావించడంలోని సహేతుకత అంతుబట్టదు. సరుకుల, ప్రయాణికుల రవాణా రాబడులు పడిపోవడానికి ప్రధాన కారణం పారిశ్రామిక క్షీణత, రెండేళ్లుగా వ్యవసాయ రంగం దె బ్బ మీద దెబ్బతినడం. వినూత్నమైన, సృజనాత్మకమైన ఆలోచనలకు తావిచ్చిందంటున్న ఈ బడ్జెట్ మన సంప్రదాయక ఆలోచనల పరిధి నుంచి బయటపడ లేకపోయింది. స్వల్ప దూరాలకు ప్రయాణ సాధనాలుగా రైల్వేలు అట్టడుగు స్థాయిల్లో ఉండ టంలోని అర్థరాహిత్యాన్ని ఎందుకు గ్రహించలేరో అర్థం కాదు. చిన్న పట్టణాలను, నగరాలను గ్రామీణ ప్రాంతాలతో అనుసంధానించడానికి తక్కువ దూరపు లైన్ల నిర్మాణం, గ్రామీణ, సబర్బన్ రైళ్ల నిర్వహణ చేపట్టడం లాభదాయకమే కాదు, రాబడిని పెద్ద ఎత్తున పెంచుకునే మార్గం కూడా. పాత బాటనే నడిచిన ప్రభు బడ్జెట్ కూడా అటు దృష్టి సారించలేదు. దేశంలోని రైల్వే క్రాసింగులలో 35 శాతం, అంటే 10 వేలకు పైగా కావలి లేనివి. ప్రతి రైల్వే మంత్రీ, ప్రతి రైల్వే బడ్జెట్లోనూ ఈ సమస్యను పరిష్కరిస్తామంటూనే ఉన్నారు. గత ఏడాది ప్రభు కూడా వాగ్దానం చేశారు. గత ఆరు నెలల్లో 156 లెవెల్ క్రాసింగ్‌ల వద్ద మాత్రమే సిబ్బందిని నియమించ గలిగారు. ఈ లెక్కన ఈ సమస్య పరిష్కారానికి మూడు దశాబ్దాలు పడుతుంది. రాబోయే 3-4 ఏళ్లలోనే ఆ పని పూర్తి చేసేస్తామని మంత్రి ఎలా హామీ ఇచ్చారో తెలియదు. ప్రస్తుత సగటు వేగం 30 కిలోమీటర్లను రెట్టింపు చేస్తామనడం, మిషన్ జీరో యాక్సిడెంట్ వంటి ఆశలన్నీ దీర్ఘకాలిక ప్రణాళికలే తప్ప ఏడాది బడ్జెట్లో సాధ్యం కానివి. దేశంలోని 40 శాతానికి పైగా లైన్లు ఇప్పటికే 100 శాతానికిపైగా సామర్థ్యంతో పనిచేయాల్సి వస్తోంది. 2011-12 నుంచి కొత్తలైన్ల నిర్మాణం క్షీణిస్తూ వస్తోంది. ఇప్పుడున్న లైన్ల మీదే రిజర్వేషన్లేని ప్రయాణికులకు అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌లను, హమ్‌సఫర్, తేజస్ ఉదయ్, ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెడతామన్నారు. వీటిలో తేజస్ 130 కిలోమీటర్ల లగ్జరీ ఎక్స్‌ప్రెస్. ఇవన్నీ విపరీతమైన రద్దీ భారాన్ని మోస్తున్న లైన్లపై మరింత భారాన్ని మోపుతాయి. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు సహా ప్రభు 44 భాగస్వామ్య ప్రాజెక్టులను, రెండు రైలింజన్ల ఫ్యాక్టరీలను ప్రకటించారు. ఈశాన్యం తదితర ప్రాంతాలలో ఇప్పటికే ఉన్న లైన్లను బ్రాడ్గేజీకి మార్చడం, ఆధునీకరించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం సమంజసమే. అయితే ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులను పరిపూర్తి చేయడం వల్ల ఒక్క ఏడాది కాలంలో తక్కువ వ్యయాలతో ఎక్కువ ఫలితాలను రాబట్టవచ్చని విస్మరించడం విచారకరం. ఆనవాయితీ అన్నట్టుగా ఈ బడ్జెట్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల పట్లా సమాన నిర్లక్ష్యాన్ని చూపింది. తెలంగాణలో కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం ఊసే ఎత్తలేదు. మనోహరాబాద్-కొత్తపల్లి-భద్రాచలం-సత్తుపల్లి లైన్, దశాబ్దిన్నర క్రితమే సగం పూర్తయిన పెద్దపల్లి-కరీంనగ ర్-నిజామాబాద్ మార్గం సహా ఏదీ పూర్తి అయ్యే అవకాశమే లేకుండా అన్ని ప్రాజెక్టులకూ చిల్లర డబ్బులు విదిల్చినట్టు నిధులను కేటాయించడంలోని సహేతుకత ఏమిటో అంతుబట్టదు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల విషయంలోనూ ఇదే వైఖరి చూపిన బడ్జెట్... విశాఖపట్నం రైల్వే జోన్‌ను కొత్తగా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన సమయంలో చేసిన వాగ్దానాన్ని సైతం విస్మరించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీరని అన్యాయంగా భావించడం అసహజం కాదు. జాతీయ ప్రయోజనాల రీత్యానే అత్యంత కీలకమైన శ్రీకాళహస్తి -నడికుడి రైల్వే లైన్‌ను పూర్తి చేయడానికి సిద్ధపడకపోవడంలోని ఔచిత్యం ఏమిటో అర్థం కాదు. పలు ఆకర్షణల మెరుపులతో ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పాత పట్టాల మీద పరుగే. -
రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచాలి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కేంద్ర రైల్వేమంత్రి సురేశ్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు. లోక్‌సభలో రైల్వే నిధుల డిమాండ్ అంశంపై మంగళవారం జరిగిన చర్చలో ఎంపీ బూర మాట్లాడుతూ.. మునిరాబాద్-మహబూబ్‌నగర్, మనోహరాబాద్-కొత్తపల్లి, భద్రాచలం-కొవ్వూరు, మాచర్ల-నల్లగొండ, భద్రాచలం-సత్తుపల్లి, అక్కనపేట-మెదక్, కాజీపేట-బలార్షా, సికింద్రాబాద్-మహబూబ్‌నగర్ ప్రాజెక్టులకు తక్కువ నిధులు కేటాయించారని, ఈ ప్రాజెక్టులకు సాధ్యమైన మేరకు నిధులు పెంచాలని విన్నవించారు. కాజీపేట రైల్వేజోన్ ప్రకటించాలని, కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల రాజధానుల మధ్య హైస్పీడ్ బుల్లెట్ రైలు నడిపించాలన్నారు. -
లోక కళ్యాణమే.. ప్రభుత్వ లక్ష్యం!
-
ఈ రైలూ ఎల్లిపోయె..!
శ్రీకాకుళం సిటీ:బడ్జెట్ రైలులో శ్రీకాకు ళం జిల్లాకు బెర్త్ దొరకలేదు.. ఆసలు ఆ రైలు జిల్లాలో ఎక్కడా ఆగనే లేదు. గత కొన్నేళ్లుగా జిల్లావాసులకు ఇదే అనుభవం ఎదురవుతున్నా.. రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్‌కు ఏదేదో చేసేస్తామని కేంద్ర, రాష్ట్ర పాలకులు చేసిన ఆర్భాటంతో ఈసారి ఎంతోకొంత మేలు జరుగుతుందని జిల్లా ప్రజలు ఆశపడ్డారు. మంగళవారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఈ ఆశలపై నీళ్లు చల్లింది. జిల్లా ప్రజల అవసరాలు తీర్చే ఒక్క లైను గానీ, ఒక్క రైలుగానీ.. చివరికి బెర్తుల కోటా పెంపు, అదనపు హాల్టులు చిన్నపాటి కోర్కెలను సైతం తీర్చేందుకు రైల్వే మంత్రి ప్రయత్నించలేదు. ఈ బడ్జెట్లో జిల్లాకు కొంత సంబంధం ఉన్న అంశం ఒక్కటే కనిపించింది. అదే కొత్తగా ప్రతిపాదించిన విశాఖ-పరదీప్ వీక్లీ రైలు. జిల్లా మీదుగా ఇది ప్రయాణించినా వీక్లీ ఎక్స్‌ప్రెస్ అయినందున జిల్లాలో హాల్టులు ఉంటాయో లేదో తెలియదు. విభజన తర్వాత ఏర్పడిన కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రైల్వే వంటి కీలక రవాణా వ్యవస్థల్లో మరింత మెరుగైన సౌకర్యాలు, కొత్త ప్రాజెక్టులు అత్యావశ్యకం. శ్రీకాకుళం వంటి వెనుకబడిన జిల్లాలో రైల్వే సౌకర్యాలు మెరుగుపడితే పారిశ్రామికం గా అభివృద్ధి చెందే అవకా శం కూడా ఉం టుంది. అయి తే రైల్వే మం త్రి ఈ విష యం పట్టించుకోలేదు. మన జిల్లా, రాష్ట్ర ప్రజాప్రతినిధుల నిర్లిప్తత కూడా ఈ నిర్లక్ష్యానికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నెరవేరని డిమాండ్లు రైల్వేల పరంగా జిల్లా నుంచి ఎన్నో డిమాండ్లు.. మరెన్నో ప్రతిపాదనలు ఏళ్ల తరబడి ఫైళ్లలో మగ్గిపోతున్నాయి. జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న మత్య్సకారులు ఎక్కువగా గుజరాత్ రాష్ట్రానికి ఉపాధి కోసం వెళ్తుంటారు. అలాగే ఒడిశా సరిహద్దులో ఉన్న ఆంధ్ర ప్రాంతాల నుంచి రాయ్‌పూర్, భిలాయ్, తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. జిల్లా నుంచి ఈ ప్రాంతాలకు నేరుగా రైలు సౌకర్యం కల్పించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. శ్రీకాకుళం-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-పలాస ఈఎంయు ఇచ్ఛాపురం వరకు పొడిగింపు, పలాస-రాయగడ రైళ్లు వేయాలన్న డిమాండ్ ఉంది. కోణార్క్, ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ రైళ్లకు నౌపడ జంక్షన్లో హాల్ట్ ఇవ్వాలని స్థానికులు చాలా కాలంగా కోరుతున్నారు. ఇక జిల్లా మీదుగా నడుస్తున్న షిర్డీ-హౌరా, చెన్నై- షాలీమార్, తిరుపతి- సంత్రగచ్చి, చెన్నై- గువహతి, విశాఖ-దిఘా, విల్లుపురం-ఖరగ్‌పూర్, పాండిచ్చేరి- హౌరా, రామేశ్వరం-భువనేశ్వర్, హౌరామైసూర్ తదితర 9 రైళ్ల కు ఎక్కడా హాల్ట్‌లు లేవు. ఈ రైళ్లను ఆమదాలవలస, పలాసల్లో నిలపాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. గత ఏడాది బడ్జెట్లో ప్రకటించిన గుణుపూర్-విశాఖపట్నం పాసింజర్ రైలు ఇంతవరకు ప్రారంభానికే నోచుకోలేదు. కలగానే రాజాం లైను పారిశ్రామిక పట్టణంగా పేరున్న రాజాంకు ప్రధాన రైల్వేలైనుతో కలిపేలా.. పొందూరు నుంచి రైల్వే లైను వేయాలన్న ప్రతిపాదన కలగానే మిగిలిపోతోంది. 2011-12 బడ్జెట్లో ఈ లైను ఏర్పాటుపై సర్వే చేస్తామని ప్రస్తావించారు. అయితే ఇంతవరకు ఒక్క పైసా కూడా విదల్చలేదు సరికదా.. కొత్త బడ్జెట్లో ఆ ఊసే లేదు. ఈ లైను నిర్మిస్తే శ్రీకాకుళం, విజ యనగరం జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం స్టేష న్లను ఆదర్శ స్టేషన్లుగా తీర్చిదిద్దుతామని గత బడ్జెట్లో ప్రకటిం చినా.. పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. ప్రత్యేక కమిటీయే తారకమంత్రమా? రెండు రాష్ట్రాలుగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పెండింగు ప్రాజెక్టుల పూర్తికి, కొత్త ప్రాజెక్టుల మంజూరుకు ప్రత్యేక కమిటీ వేశామని చెప్పి రైల్వే మంత్రి చేతులు దులుపుకొన్నారు. అన్నింటికీ అదే తారక మంత్రం అన్న ట్లు ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయా లు తీసుకుంటామని తేల్చేశారు. దీంతో శ్రీకాకుళం జిల్లాకు మేలు చేకూర్చే విశాఖ కేంద్రంగా ప్రత్యేక జోన్ ఏర్పాటు, కొత్త రైళ్లు, ఇతర ప్రాజెక్టుల మంజూరీలన్నీ ఆ కమిటీ దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడ్డాయన్నది స్పష్టమైపోయింది. మొండి చెయ్యి చూపారు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ను ఈ బడ్జెట్లో ప్రకటిస్తారని ఆశించిన ఉత్తరాంధ్ర ప్రజలకు రైల్వే మంత్రి అసంతృప్తి మిగిల్చారు. కొత్త రైళ్లు, ప్రాజెక్టుల విషయంలోనూ మొండి చెయ్యి చూపారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నో కొత్త ప్రాజెక్టులు మంజూరు చేస్తామని నమ్మబలి కి, ఇప్పుడు మోసం చేశారు. ఈ ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రి ఆశోక్‌గజపతిరాజు, విశాఖ, శ్రీకాకుళం ఎంపీలు ఈ విషయంలో విఫలమయ్యారు. విశాఖ రైల్వే జోన్‌తోపాటు పలు రైల్వే ప్రాజెక్టుల సాధనకు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. -ఎం.వి.ఎస్.శర్మ, ఎమ్మెల్సీ -
రైల్వే బడ్జెట్, టిడిపి అరాచకాలపై హెడ్లైన్ షో
-
వెయిటింగ్ లిస్ట్ పాసింజర్లకు ఆటోమేటిక్ ఎస్ఎమ్మెస్!
న్యూఢిల్లీ: రైల్వే రిజర్వేషన్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే పాసింజర్లకు రైల్వేశాఖ కొన్ని సదుపాయాలను కల్పించింది. వెయిటింగ్ లిస్ట్ లో ఉండే పాసింజర్లకు టికెట్ కన్ ఫర్మ్ కాగానే పీఎన్ఆర్ స్టాటస్ తెలిపే విధంగా ఆటోమెటిక్ ఎస్ఎమ్మెస్ ను పంపే ఏర్పాటును రైల్వే శాఖ చేపట్టారు. ఇవియే కాకుండా ఆన్ లైన్ లో భోజనాన్ని బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించే విధంగా పాసింజర్లకు వెసలుబాటును ఈ బడ్జెట్ లో కల్పించారు. అన్ రిజర్వుడు కేటగిరిలో టికెట్లను మొబైల్ ఫోన్ల ద్వారా బుక్ చేసుకునే విధంగా సదుపాయాన్ని, ఆటోమెటిక్ వెండింగ్ మిషన్లలో నగదు ద్వారా టికెట్ కొనుగోలు చేసే సౌకర్యాన్ని రైల్వేశాఖ కల్పించింది. బుధవారం ప్రవేశపెట్టిన రైల్వే శాఖ బడ్జెట్ లో పలు అంశాలను రైల్వే మంత్రి మల్లికార్జున్ ఖార్గే వెల్లడించారు. -
ఆందోళనల మధ్యే ఖర్గే రైల్వే బడ్జెట్