
కూల్‌డ్రింక్స్‌కు ప్రత్యామ్నాయంగా నీరా
కేంద్ర మంత్రి మోహన్‌భాయ్ కుందరియా
న్యూఢిల్లీ: శీతల పానీయాల(కూల్‌డ్రింక్స్)కు ప్రత్యామ్నాయంగా నీరా పానీయం వాడకాన్ని విస్తృత ప్రచారంలోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి మోహన్‌భాయ్ కుందరియా వెల్లడించారు.
ఈ ప్రత్యామ్నాయం కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యల గురించి భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అడిగిన ప్రశ్నకు కుందరియా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు నీరాను మార్కెట్లోకి తెచ్చిందన్నారు. కొల్లం, తిస్సూర్, కోజికోడ్ జిల్లాల్లో 11,500 లీటర్ల మేర ఈ నీరా పానీయాన్ని సేకరిస్తున్నట్టు తెలిపారు.