'చిక్కుముడులను పరిష్కరిస్తున్నా'
హైదరాబాద్: రైల్వే, జీహెచ్ ఎంసీ, వాటర్ బోర్డు మధ్య ఉన్న చిక్కుముడులను పరిష్కరిస్తున్నామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. రైల్వే, వాటర్ బోర్డు అధికారులతో సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. కరీంనగర్-పెద్దపల్లి రైల్వేలైనుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఎంఎంటీఎస్ ను శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు పొడిగించే ఆలోచన ఉందని దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ వెల్లడించారు. ఎంఎంటీఎస్ రెండో దశలపై రైల్వే మంత్రి ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. ఆర్వోబీ, ఆర్ యూబీలను త్వరితగతిన పూర్తిచేస్తామన్నారు. జీహెచ్ ఎంసీ నుంచి అనుమతులు రావాల్సివుందన్నారు.