HYD: రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. 28 రైళ్లు రద్దు | 28 Train Services Cancelled In South Central Railway | Sakshi
Sakshi News home page

HYD: రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. 28 రైళ్లు రద్దు

Published Sun, Jun 18 2023 8:13 PM | Last Updated on Sun, Jun 18 2023 8:13 PM

28 Train Services Cancelled In South Central Railway - Sakshi

సికింద్రాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో రైలు ప్రయాణీకులకు ముఖ్య గమనిక. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 19(సోమవారం) నుంచి 25వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే, హైదరాబాద్‌ జంటనగరాల్లో ప్రజలకు సర్వీసులందించే  23 ఎంఎంటీఎస్‌ రైళ్లను సోమవారం నుంచి వచ్చే ఆదివారం వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటనలో స్పష్టంచేశారు. 

వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాలకు సర్వీసులందించే పలు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఆదివారం ప్రకటించింది. ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్ తెలిపారు. అయితే, 28 రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేయగా.. ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. 

ఇక, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల నిర్వహణకు సంబంధించిన పనుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. గుంతకల్‌-బోధన్‌ రైలు సమయంలో తాత్కాలికంగా మార్పులు చేసినట్టు తెలిపారు. దీంతో పాటు హైదరాబాద్‌ జంటనగరాల్లో 23 ఎంఎంటీఎస్‌ రైళ్లను సోమవారం నుంచి వచ్చే ఆదివారం వరకు రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. రైళ్ల రద్దను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికులు ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకోవాలని సూచించారు. 

ఇది కూడా చదవండి: మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ కవితకు తప్పిన ప్రమాదం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement