
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ముందస్తుగా పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటించింది. ఈనెల 22 నుంచి వచ్చే నెల 20 వరకు పలు రైళ్లను రద్దు చేసింది. అత్యవసరం కాని ప్రయాణాలను నిరోధించే క్రమంలో భాగంగా యూటీఎస్, పీఆర్‌ఎస్ టిక్కెట్లకు వర్తించే రాయితీలను అన్ని కేటగిరీల్లో విద్యార్థులు, 4 కేటగిరీల దివ్యాంగులు, 11 కేటగిరీలకు చెందిన రోగులకు మినహా, మిగతా కేటగిరీల్లోని ప్రయాణికులకు మార్చి 20 నుంచి తదుపరి సూచనలు వచ్చేంత వరకు తాత్కాలికంగా రద్దు చేసింది. ఇప్పటికే రద్దు చేయబడిన రైళ్లలో రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులకు పూర్తి రీఫండ్ చేస్తామని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment