![Hyderabad: South Central Railway Cancels 34 MMTS Trains on August 14 - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/12/MMTS_Hyderabad.jpg.webp?itok=Ee3Xenay)
సాక్షి, హైదరాబాద్: ఈ నెల14వ తేదీ ఆదివారం 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు లేకపోవడంవల్ల ఈ మేరకు ఫలక్‌నుమా–లింగంపల్లి, సికింద్రాబాద్–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, ఫలక్‌నుమా–నాంపల్లి, తదితర రూట్‌లలో నడిచే రైళ్లు రద్దు కానున్నాయి.
పలు రైళ్లు రద్దు..
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని తాటిచెర్ల–జంగాలపల్లి డబ్లింగ్ పనుల నేపథ్యంలో పలు రైళ్ల రద్దు, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం ఆంజనేయులు గురువారం తెలిపారు. గుంతకల్–హిందూపూర్ డెమూ రైలు 12 నుంచి 19 వరకు, హిందూపూర్–గుంతకల్ డెమూ రైలును 13 నుంచి 20 వరకు రద్దు చేసినట్లు చెప్పారు.
తిరుపతి–గుంతకల్ రైలు ఈ నెల 12 నుంచి 19వ వరకు ధర్మవరం–గుంతకల్ మీదుగా, గుంతకల్–తిరుపతి రైలు ఈ నెల 12 నుంచి 19 వరకు గుంతకల్–ధర్మవరం మీదుగా తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. (క్లిక్: ఇంజనీరింగ్‌లో సీట్లపై ఉత్కంఠ.. పదివేలు దాటినా సీఎస్సీ పక్కా)
Comments
Please login to add a commentAdd a comment