సాక్షి, హైదరాబాద్: జనవరి 1 నుంచి ఎంఎంటీఎస్ కొత్త టైంటేబుల్ అమల్లోకి రానుందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 88 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తున్నాయి. సికింద్రాబాద్– మేడ్చల్, ఫలక్‌నుమా– ఉందానగర్, ఘట్‌కేసర్– లింగంపల్లి మధ్య కొత్తగా ఎంఎంటీఎస్ సేవలు విస్తరించాయి.
ఈ మేరకు వివిధ మార్గాల్లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైళ్ల వేళల్లో మార్పులు, చేర్పులు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ మార్పులకు సంబంధించిన సమాచారం అన్ని ఎంఎంటీఎస్ స్టేషన్లలో అందుబాటులో ఉంటుందన్నారు. నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ ఆధారంగా కూడా తెలుసుకోవచ్చు. సంబంధిత రైల్వే స్టేషన్లలోని స్టేషన్ మేనేజర్, విచారణ కేంద్రాన్ని సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment