చెన్నై: చెన్నైలోని ఎలక్ట్రిక్, ఎంఆర్‌టీఎస్ రైళ్లలో వీరంగం సృష్టించినా, సాహసాలు ప్రదర్శించినా కటకటాల్లోకి నెడుతామని విద్యార్థులకు పోలీసులు హెచ్చరించారు. రైళ్లలో కొందరు విద్యార్థుల ఆగడాలకు హద్దే లేకుండా పోతోంది. రైలు బయలుదేరే సమయంలో పరుగులు తీయడం, ఫుట్ బోర్డుపై వేలాడుతూ ప్రయాణించడం, రైలు కిటికీలను పట్టుకుని వేలాడటం వంటి సాహసాలు చేసే వాళ్లు ఎక్కువే. అలాగే గ్రూపు తగాదాలకు నెలవుగా కూడా రైల్వే స్టేషన్లు మారాయి.
ఈ క్రమంలో విద్యార్థులకు హెచ్చరికలు చేస్తూ రైల్వే, పోలీసు యంత్రాంగం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఎలక్ట్రిక్, ఎంఆర్‌టీఎస్ రైళ్లల్లో, స్టేషన్లలో అకతాయి తనంతో వ్యవహరించినా, ఇష్టారాజ్యంగా వీరంగం సృష్టించినా, సహసాలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైల్వే స్టేషన్లు, మార్గాల్లో నిఘా ఉంచుతామని తెలిపారు. పట్టుబడితే 3 నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment