
రైల్వే స్టేషన్‌లో టికెట్ తీసుకుంటుండగా తమ కుమారుడు జయప్రకాష్ (విక్కీ) కనిపించకుండా పోయాడని అతని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
సాక్షి, హైదరాబాద్ : ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్‌లో ఓ బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌లో టికెట్ తీసుకుంటుండగా తమ కుమారుడు జయప్రకాష్ (విక్కీ) కనిపించకుండా పోయాడని అతని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్ చుట్టు పక్కల అంతా వెతికామని, విక్కీ జాడ తెలియరావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడిని ఎవరో కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.