abducted
-
నిలోఫర్‌లో పసికందు కిడ్నాప్
నాంపల్లి: నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిలోఫర్ ఆస్పత్రి వద్ద ఓ పసికందు కిడ్నాప్‌కు గురైంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..జహీరాబాద్‌కు చెందిన హసీనాబేగం, గఫార్ దంపతులకు నెల రోజుల క్రితం ఒక మగ శిశువు జని్మంచారు. శిశువుకు పచ్చ కామెర్ల వ్యాధి సోకింది. దీంతో బాబును నిలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు. వ్యాధి నుంచి కోలుకున్న శిశువును శనివారం డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయ్యాక శిశువు తల్లి, శిశువు అమ్మమ్మ పైఅంతస్తులోని వార్డు నుంచి కిందకు చేరుకున్నారు. మందులు తీసుకునేందుకు తల్లి కౌంటర్ వద్దకు వెళ్లింది. ఆ సమయంలో శిశువు అమ్మమ్మ చేతిలో ఉంది. ఇదే సమయంలో బుర్ఖా ధరించిన ఓ మహిళ అక్కడకు చేరుకుంది. తాను ఆసుపత్రి సిబ్బంది అని మాయమాటలు చెప్పి..వృద్ధురాలి చేతిలో ఉన్న శిశువును తీసుకుంది. కాసేపు ఎత్తుకుని మాట్లాడిస్తున్నట్లు నటిస్తూ రోగులు ఉన్న గుంపులోకి వెళ్లింది. అక్కడ నుంచి ని్రష్కమించిన ఆ మహిళ మళ్లీ కనిపించలేదు. దీంతో తల్లి, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శిశువు ఆచూకీ కోసం ఆసుపత్రి ప్రాంగణమంతా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు చేసేదేమి లేక నాంపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే పోలీసులు సీసీ పుటేజీ పరిశీలించారు. ఆసుపత్రి నుంచి శిశువును ఎత్తుకొని బయటకు వెళ్లిన మహిళ బుర్ఖాలో వచి్చనట్లు పోలీసులు గుర్తించారు. ఆటోలో వెళ్లిన మహిళ కొంతదూరం వెళ్లాక ఆటో దిగి మరో ద్విచక్ర వాహనాన్ని ఎక్కి పారిపోయింది. -
ఆరేళ్ల ప్రాయంలో కిడ్నాప్‌కి గురయ్యాడు..కట్‌చేస్తే 70 ఏళ్ల తర్వాత..!
కొన్ని సంఘటనలు ఓ పట్టాన అర్థం కావు. ఎలా వస్తువులు లేదా వ్యక్తులను పోగొట్టుకుట్టాం. వాటి ఆచూకీకై ఏళ్లు తరబడి ఆశగా ఎదురుచూస్తాం. చివరికి ఆశలన్నీ ఆవిరిఅయిపోయి. దొరకదు అనే నైరాశ్యంలో ఉండగా ఏదో అద్భుతం జరిగనట్టుగా ఆ వ్యక్తి లేదా ఆ వస్తువు మన చెంతకు వస్తే ఆ ఆనందం మాటలకందని భావోద్వేగా క్షణం కదూ..అలాంటి కథే ఇక్కడ చోటేచేసుకుంది. గుండెల్ని పిండేసీ ఉద్వేగభరితం లూయిస్ అర్మాండో అల్బినో కథ..!ఏం జరిగిందంటే..కాలిఫోర్నియాకి చెందిన లూయిస్ ఆర్మాండో అల్బినో ఫిబ్రవరి 21, 1951న తన పదేళ్ల సోదరుడు రోజర్‌తో కలిసి ఆడుకుంటుండగా తప్పిపోయాడు. ఓ అపరిచిత మహిళ స్వీట్లు ఇస్తానని ఆశచూపి ఎత్తుకుపోయింది. అలా కిడ్నాప్‌కి గురైన అల్బినో ఆచూకీ అంతు చిక్కని మిస్టరీలా ఉండిపోయింది. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయే తప్ప..అల్బినో ఆచూకీ గురించి మచ్చుకైనా కేసు ముందుకు సాగలేదు. అతడి కోసం ఎదురుచూసి అతడి తల్లి 92 ఏళ్ల వయసులో కన్నుమూసింది. అయితే అల్బినో మేనకోడలు అలిడా అలెక్విన్(60) మాత్రం తన మామ అల్బినో ఆచూకీ ఎలాగైన కనిపెట్టాలని ఎంతోగానో తప్పనపడింది. అందుకోసం నాడు కిడ్నాప్ అయ్యినట్లు ఇచ్చిన పేపర్ యాడ్లు, ఫోటోలను సేకరించి మరీ అన్వేషణ సాగించింది. డీఎన్ఏ పరీక్షలు వంటి ప్రత్యామ్నాయాలతో తీవ్రంగా వెతకడం ప్రారంభించింది. ఎట్టకేలకు ఆమె కృషి ఫలించి..మామ అల్బినో ఆచూకిని కనుక్కొంది. అతడు రిటైర్డ్ అగ్నిమాపక సిబ్బంది, మెరైన్ కార్ప్స్ నిపుణుడుని తెలుసుకుంది. అతడు వియత్నాంలో రెండుసార్లు పర్యటించాడు కూడా. అతడి డీఎన్‌తో తన కుటుంబ సభ్యుల డీఎన్ఏ 22% సరిపోలాడం వంటివి ఆమె ఆనందానికి అవధులు లేకుండా చేసింది. వెంటనే అలిడా తన మామ అల్బినోను కుటుంబ సభ్యులతో కలిపింది. అల్బినో సరిగ్గా తన సోదరుడు రోజర్ 82 ఏటనే కలుసుకున్నాడు. అతడు కేన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిసి బాధపడ్డాడు. అయితే మరణానికి ముందు ఇలా తప్పిపోయిన తన తమ్ముడిని కలుసుకోవడం తనకెంతో సంతోషాన్నిచ్చిందంటూ రోజర్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇరువురు తమ చిన్నప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు. చాలసేపు మాట్లాడుకున్నారు. ఈ మధుర క్షణం కోసం అలిడా ఎంతగా తపించిందంటే..స్థానిక లైబ్రరీలలో వార్తాపత్రికల ఆర్కైవ్‌లు, మైక్రోఫిల్మ్‌లు తదితరాలతో అణువణువు జల్లెడ పట్టింది. చివరికి లూయిస్ అల్బినో చిత్రాలను కనిపెట్టి..దశాబ్దాల నాటి మిస్టరీని చేధించింది. తన మామ అల్బినోని కుటుంబంతో కలిపింది మేనకోడలు అలిడా అలెక్విన్ .(చదవండి: ఇదేం బ్యాగ్ రా దేవుడా..! ధర తెలిస్తే కంగుతింటారు..!) -
మణిపూర్‌లో మళ్లీ హింస: నలుగురి అపహరణ, కాల్పుల్లో ఏడుగురికి గాయాలు!
దేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మే నెలలో మొదలైన హింసాకాండ ఇంకా చల్లారడం లేదు. తాజా ఘటనలో ఒక సైనికుని కుటుంబానికి చెందిన ముగ్గురు సహా మొత్తం నలుగురిని మైతీ ఉగ్రవాదులు అపహరించారు. ఈ సంఘటన ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ కిడ్నాప్ వార్త అంతటా వ్యాపించడంతో ఇంఫాల్ వెస్ట్, కాంగ్పోక్పి జిల్లాలతో పాటు కాంగ్‌చుప్ ప్రాంతంలో ఒక సమూహంపై సాయుధ కుకీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఒక మహిళతో సహా మొత్తం ఏడుగురు గాయపడ్డారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం, ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన నలుగురిలో 65 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నాడు. వీరిని రక్షించేందుకు తమ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని కాంగ్పోక్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ఎం ప్రభాకర్ తెలిపారు. కిడ్నాప్‌కు గురైన మిగతా నలుగురిని నెంగ్‌కిమ్ (60), నీలం (55), జాన్ తంగ్జామ్ హౌకిప్ (25), జామ్‌ఖోటాంగ్ (40)గా పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: ‘సరి- బేసి’ విధానం ఏ దేశంలో మొదలయ్యింది? -
అలల్లో కరిగిన కలలు
సూల్‌పురా: నూతన సంవత్సర వేడుకల్లో సరదాగా గడిపేందుకు నగరానికి చెందిన 8 మంది మిత్రులు విశాఖపట్టణం వెళ్లారు. ఆర్కే బీచ్‌లో దిగి ఎంజాయ్ చేస్తుండగా ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. రసూల్‌పురాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ దుర్ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, వైజాగ్ వెళ్లిన సిద్ధు అనే యువకుడు అందించిన వివరాల ప్రకారం.. రసూల్‌పురా 105 గల్లీకి చెందిన యువకులు శివకుమార్, అజీజ్, శివ, వినోద్, మధు, పవన్, సిద్ధు, కార్తీక్‌లు కలిసి డిసెంబరు 30న కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్టణం వెళ్లేందుకు బయలుదేరారు. ఆ రోజు రైలు టికెట్లు దొరక్కపోవడంతో 31న ఉదయం వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో వీరంతా ఆర్కే బీచ్ వద్దకు బయలుదేరారు. వీరిలో అయిదుగురు ఒడ్డున ఉండగా శివకుమార్, అజీజ్, శివ సముద్రంలోకి దిగారు. ఈ క్రమంలో అలల «ఉద్ధృతికి ముగ్గురూ సముద్రంలోకి కొట్టుకుపోయారు. శివ మృతదేహం లభించింది. అజీజ్, శివకుమార్‌లు గల్లంతయ్యారు. ఘటన సమాచారం అందగానే రసూల్‌పురా నుంచి యువకుల తల్లిదండ్రులు, స్నేహితులు విశాఖకు బయలుదేరారు. -
ఎప్పుడూ ఇంటి గుమ్మం దాటని అర్పిత... నాకోసం చంకలో బిడ్డను ఎత్తుకుని
Chhattisgarh Sub Engineer Ajay Roshan Lakra Abducted By Maoists Released Credit Goes To His Wife: అడవి భయపెడుతుంది. క్రూరమృగాలు ఉంటాయి. అడవి భయపెడుతుంది. దారులు తెలియకుంటాయి. అడవి భయపెడుతుంది. తుపాకులు పేలుతాయి. కాని ఆమె భయపడలేదు.ప్రాణాలు లెక్క చేయలేదు. వెనక్కు మరలలేదు. కిడ్నాప్ అయ్యి అడవిలో ఉన్న భర్త కోసం చంకలో మూడేళ్ల బిడ్డను పెట్టుకుని ముందుకు సాగింది. భర్త విడుదలకు మంకుపట్టు పట్టింది. అడవికి కూడా మనసు ఉండే ఉంటుంది. అందుకే ఆమెకు తల వంచింది. తాను ఓడి ఆమెను గెలిపించింది.ఈ ఏడాది నవంబర్‌లో చత్తిస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనను ‘సాక్షి’కి వివరించింది. నవంబర్ 11. 35 ఏళ్ల అజయ్ రోషన్ లక్రా బిజాపూర్‌లో సబ్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. ‘ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన’ కింద పల్లెల్లో రోడ్లు వేయించడం అతడి పని. ఆ పనిలో భాగంగానే ప్యూన్ లక్ష్మణ్‌ను తీసుకుని అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోర్నా అనే గ్రామానికి వెళ్లాడు. వెంటనే మావోయిస్టులు అతణ్ణి, లక్ష్మణ్‌ను కిడ్నాప్ చేశారు. రోషన్ లక్రాను మావోయిస్టులు కాంట్రాక్టర్ అనుకున్నారు. కాని రోషన్ లక్రా కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగి. అతణ్ణి ఎలా విడుదల చేయాలి. ప్యూన్ని వదిలిపెట్టిన మావోయిస్టులు రోషన్ ను తమ వద్దనే ఉంచుకున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే భర్త కోసం అర్పిత బయలుదేరింది. 20 కిలోమీటర్లు... చంకన మూడేళ్ల కొడుకుతో అడవిలో నడుస్తూనే ఉంది. అడవి జంతువులు ఎదురైతే చెట్లు, బండ రాళ్ల మధ్య దాక్కుంటూ ముందుకెళ్లింది. అడుగు తీసి అడుగు వేస్తే విషసర్పాలు.. అయినా ఆమె బెదరలేదు. భర్తను విడిపించుకోవాలనుకున్న ఆమె పట్టుదలను చూసిన మీడియా, గ్రామస్తులు తోడుగా నిలిచారు. చివరకు మావోయిస్టులను ఒప్పించి భర్తను తిరిగి అప్పగించేలా చూశారు. బీజాపూర్‌లో అర్పితను ‘సాక్షి’ కలవగా ఆమె భర్త కోసం చేసిన పోరాటాన్ని ఇలా వివరించింది. మొదటి రోజు.. నా పేరు అర్పిత. మాది చత్తిస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లా. బీజాపూర్ నుంచి700 కిలోమీటర్లు. 2018లో మా ఆయనకు బీజాపూర్‌కు బదిలీ అయింది. నేను మాత్రం ఏడాది క్రితమే బీజాపూర్‌కు వచ్చాను. నాకు హిందీ తప్ప మరాఠీ, గోండి భాషలు రావు. రోజంతా ఇంట్లోనే బాబుతో గడుపుతున్న. మా ఆయన మధ్యాహ్నం భోజనం ఇంట్లోనే తినేవారు. ఎట్టి పరిస్థితిల్లోనూ చీకటి పడక ముందే ఇంటికి చేరుకునేవారు. గత నెల 11వ తేదీన కూడా డ్యూటికీ వెళ్తున్నప్పుడు మధ్యాహ్నం భోజనానికి వస్తానని చెప్పారు కానీ రాలేదు. మధ్యాహ్నం 2, 3 గంటల ప్రాంతంలో ఆయన ఫోన్‌కు ట్రై చేస్తే స్విచాఫ్ వచ్చింది. ఆఫీస్ పని మీద బయటికి వెళ్లారని అనుకున్నా. సార్ ఇంటికి వచ్చారా? సాయంత్రం 6 గంటలకు ఆయన ఆఫీస్ నుంచి ఇద్దరు వచ్చారు... అజయ్ సార్ వచ్చారా? అని. నేను ఎందుకు.. ఏమైందని అడిగా. వాళ్లు ఏమీ చెప్పకుండానే వెళ్లిపోయారు. అప్పటికే ఆయన ఎక్కడికి వెళ్లి ఉంటారోననే టెన్షన్ పట్టుకుంది. రాత్రి 10 అయింది. ఆయన ఆఫీస్ నుంచి నలుగురు వచ్చారు. మీ ఆయన గోర్నా అటవీ ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు పనుల పర్యవేక్షణ కోసం వెళ్లారు. బహుశా దారి తప్పి ఉంటారు. రేపు ఉదయం వచ్చేస్తారు.. కంగారు పడకండి అని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అవసరమైతే మీకు తోడుగా మా ఇంటి మహిళలు ఉంటారు అన్నారు. నేను మళ్లీ అడిగాఏఉ అసలేం జరిగిందో చెప్పండి.. నాకు మూడేళ్ల బాబు (కియాన్ రోషన్) ఉన్నాడు... ఇక్కడ నాకు నా అనే వాళ్లు ఎవరూ లేరని వాళ్లతో అన్నాను. ఆఫీస్ నుంచి వచ్చిన వారు మళ్లీ అదే చెప్పి నిశ్చింతగా ఉండమన్నారు. రెండో రోజు... నవంబర్ 12. ఉదయం 8. ఆఫీస్ నుంచి ఇద్దరు వచ్చారు. అజయ్‌ని మావోయిస్టులు బందీ చేశారనే పిడుగు లాంటి వార్త చెప్పారు. వారి మాటలు వినగానే నేను నా భర్తను ఎలా రక్షించుకోవాలో చెప్పండి... అడవికి వెళ్తాను అన్నాను. దానికి వారు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వదిలిపెడతారని తెలిసింది... అప్పటి వరకు ఓపిక పట్టండి అన్నారు. మా ఆయనకు సంబంధించిన గుర్తింపు కార్డులు అడిగితే ఇచ్చా. వాటిని తీసుకెళ్లారు. రాత్రి 10 దాటింది. మా ఆయన గురించి ఏ సమాచారం తెలియదు. ఉదయం 8 గంటల నుంచి ఇంటి గుమ్మం ముందే బాబుతో కూర్చున్న. మావారు ఎప్పుడొస్తారా? అని ఎదురుచూసిన. అయినా అజయ్ రాలేదు. అప్పుడే నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది... మా ఆయనతో వెళ్లిన ప్యూన్ లక్ష్మణ్ ను మావోయిస్టులు వదిలిపెట్టారని. యి ఆయనను దండకారణ్యంలోకి తీసుకెళ్లారని. అది విని రాత్రంతా ఏడుస్తూనే గడిపా. మూడో రోజు.. మరుసటి రోజు నవంబర్ 13వ తేదీ ఉదయం. మా ఆయన ఆఫీస్ సిబ్బందితో కలిసి లక్ష్మణ్‌ను కలిసి మాట్లాడడానికి ఆయన ఇంటికి వెళ్లా. ‘మావోయిస్టులు నన్ను, సార్‌ను వేర్వేరుగా ఉంచారు మేడమ్. రెండ్రోజుల్లో ఆయన్ను ఒక్కసారి మాత్రమే చూశా.’ అని లక్ష్మణ్ అన్నాడు. మీడియా, ఆఫీస్ సిబ్బందితో కలిసి లక్ష్మణ్‌ను వదిలిపెట్టిన ఊరికి వెళ్లిన. అక్కడి గ్రామస్తుల ముందు నా బాధ చెప్పుకున్న. ‘మేం వాళ్లతో మాట్లాడతాం. మీ ఆయన ఇంటికి వచ్చేస్తాడు వెళ్లండి’ అని గ్రామస్తులు చెప్పారు. సాయంత్రం ఇంటికి వచ్చేశా. ఆ రాత్రి కూడా అజయ్ రాలేదు. నాలుగో రోజు నవంబర్ 14న ఉదయమే లేచి బాబుతో మళ్లీ అడవికి బయలుదేరిన. మధ్యలో మమ్మల్ని చూసిన ఆఫీస్ సిబ్బంది ఒంటరిగా వెళ్లొద్దు... ప్రమాదముందని వెళ్లకుండా ఒత్తిడి తెచ్చి ఇంటికి పంపించేశారు. ఆ రోజూ మా ఆయన గురించి ఎలాంటి సమాచారం రాలేదు. ఐదో రోజు ఐదో రోజు నవంబర్ 15న మీడియాతో కలిసి మరో ఊరికి వెళ్లిన. మా ఆయన్ను అక్కడికి తీసుకెళ్లారని తెలిసింది. ఆ గ్రామస్తులు అజయ్ ఈరోజు వచ్చేస్తారు అని కచ్చితమైన హామీ ఇవ్వడంతో ఇంటికి వచ్చేశా. ఆరోజూ మావారు ఇంటికి రాలేదు. అజయ్‌ను ఏదైనా చేసి ఉంటారా..? ఆయన బతికే ఉన్నాడా..? అనే ఏవేవో ఆలోచనలు రాసాగాయి. ఆ ఆలోచనలు రావద్దనుకున్నా పరిస్థితుల్ని చూస్తే అలానే అనిపించింది. ఆరో రోజు..! మా ఆయనను కిడ్నాప్ చేసిన ఆరో రోజైన నవంబర్ 16న మళ్లీ అడవి బాట పట్టా. ఇంటికి వస్తే మా ఆయనతోనే.. లేకపోతే రావొద్దని నిర్ణయించుకున్నా. నలుగురు మీడియా సభ్యులు నాకు తోడుగా అడవిలోకి వచ్చారు. ముందురోజు మేం వెళ్లిన ఊరికి వెళ్లి అడిగితే ఇంకో గ్రామం పేరు చెప్పారు. అయినా అధైర్యపడలే. వారు చెప్పిన ఊరికి వెళ్లాం. ఎవర్ని ఎంత అడిగినా తెలియదన్నారు. చీకటి పడుతోంది. నేను, మీడియా అక్కడ ఓ చిన్న స్కూల్లో బస చేశాం. మీడియాలో ఓ మహిళ కూడా ఉండడం నాకు ధైర్యానిచ్చింది. ఆ సమయంలో బిస్కట్ ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లే మా కడుపు నింపాయి. ఏడో రోజు మరుసటి రోజు నవంబర్ 17న ఉదయం లేచి గ్రామస్తులను మరోసారి వేడుకున్నాం. ఐదోరోజు వెళ్లిన ఊరికి వెళ్లాలని, అక్కడ ప్రజా కోర్టు ఉందని వారు సూచించారు. హుటాహుటిన ఆ ఊరికి వెళ్లాం. మేం అక్కడికి చేరుకోగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు వినిపించాయి. ఏం జరుగుతుందోననే భయం పట్టుకుంది. బాబును గట్టిగా గుండెకు హత్తుకుని ముందుకు వెళ్లా. అప్పటికే ప్రజాకోర్టు ముగియడంతో ముందు నలుగురు, వెనక పది మందికి పైగా తుపాకులతో వస్తున్నారు. మధ్యలో నా అజయ్ కనిపించారు. ఆయన్ను చూడగానే ఏడ్చుకుంటూ పరుగెత్తుకుని వెళ్లి కౌగిలించుకున్న. మా ఆయన్ను క్షేమంగా వదిలిపెట్టినందుకు మావోయిస్టులతో పాటు సహకరించిన గ్రామస్తులు, మీడియాకు మేం రుణపడి ఉన్నాం. అర్పితే నన్ను తీసుకొచ్చింది : అజయ్ రోషన్ గత నెల 11న నేను, నా ఫ్యూన్ లక్ష్మణ్‌తో కలిసి రోడ్డు పని పర్యవేక్షణకు గోర్నాకు వెళ్లా. తిరుగు పయనంలో పది మంది మావోయిస్టులు నన్ను, లక్ష్మణ్‌ను అడ్డగించారు. స్థానికుడొకరి పేరు చెప్పి ఆయనతో చెప్పి వచ్చారా..? అని అడిగారు. మేం అవునన్నాం. మమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్తామని చెప్పి అడవి లోపలికి తీసుకెళ్లారు. మొబైల్ ఫోన్లు తీసుకుని స్విచ్ ఆఫ్ చేశారు. తర్వాత కళ్లకు గంతలు కట్టారు. పేరు, ఉద్యోగం, కుటుంబ వివరాలు, అడ్రస్ అడిగారు. నన్ను లక్ష్మణ్‌ను అప్పుడే వేరు చేశారు. మరుసటి రోజు గుట్టపైకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి 17వ తేదీ వరకు ఎనిమిది స్థావరాలు తిప్పారు. వెళ్లిన ప్రతిచోటా పేరు, ఉద్యోగం, కుటుంబ వివరాలు, అడ్రస్ ఇవే అడిగారు. నేను ఉన్నది ఉన్నట్టు చెప్పిన. వాళ్లు ఎంక్వైరీ చేసుకున్నారనుకుంటా. ఏడో రోజు నన్ను ప్రజాకోర్టుకు తీసుకెళ్తున్నామని, నన్ను వదిలిపెట్టాలో.. లేదో.. వారే నిర్ణయిస్తారని చెప్పారు. అప్పుడు నేను టెన్షన్ పడ్డ. అర్పిత ఎప్పుడూ ఇంటి గుమ్మం దాటలేదు. నాకేదైన అయితే ఎంతో దూరంలో ఉన్న వాళ్ల ఊరికి ఒంటరిగా ఎలా వెళ్తుందో అని ఆందోళన చెందా. చివరకు నన్ను వారు చెప్పిన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి వద్దని పెద్ద గొంతుతో అరిచారు. అంతలోనే నా కళ్ల గంతలు విప్పారు. దూరం నుంచి అర్పిత పరుగెత్తుకుని వచ్చి.. ఏడుస్తూ నన్ను కౌగిలించుకుంది. తర్వాత మమ్మల్ని వెళ్లిపొమ్మన్నారు. కియాన్‌ను చంకలో ఎత్తుకుని అడవిలో నా అర్పిత పడ్డ బాధల్ని చూసే మావోయిస్టులు నన్ను వదిలిపెట్టారని అనుకుంటున్న. – ముహమ్మద్ ముజాహిద్ బాబా సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
కిడ్నాపర్ల చెర నుంచి 42 మంది విడుదల
లాగోస్: రెండు వారాలక్రితం ఉత్తర నైజీరియాలోని ఒక పాఠశాల నుంచి కిడ్నాప్‌కి గురైన 27 మంది విద్యార్థులు సహా, మొత్తం 42 మందిని, బందిపోట్లు విడుదల చేసినట్టు ఓ అధికారి వెల్లడించారు. కిడ్నాపర్ల చెరలోనుంచి విడుదలైన వారు దేశ రాజధాని మిన్నాకి చేరుకున్నారని నైజర్ గవర్నర్, చీఫ్ ప్రెస్ సెక్రటరీ మేరీ నియోల్ బెర్జ్ వెల్లడించారు. ప్రభుత్వ సైన్స్ కాలేజ్ కగారా నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులను సాయుధులైన దుండగులు రెండు వారాల క్రితం అపహరించారు. నార్తరన్ నైజీరియాలోని జాంఫరా రాష్ట్రంలోని బోర్డింగ్ స్కూల్నుంచి 317 మంది బాలికలను అపహరించిన ఒక రోజు తర్వాత ముష్కరులు వీరిని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారని పోలీసులు తెలిపారు. జాంఫరా రాష్ట్రంలో అనేక బందిపోటు ముఠాలు పనిచేస్తున్నాయి. డబ్బు కోసం, లేదా వారి సభ్యులను జైలు నుంచి విడుదల చేయించుకునేందుకు వారు ఈ దారుణాలకు పాల్పడుతుంటారని ప్రభుత్వం తెలిపింది. లొంగిపోయేది లేదు: బుహారీ నైజీరియా అధ్యక్షుడు మొహమ్మద్ బుహారీ మాట్లాడుతూ కిడ్నాప్‌కి గురైన పాఠశాల పిల్లలను సురక్షితంగా, సజీవంగా విడిపించుకోవడం ప్రభుత్వ ప్రథాన లక్ష్యమని అన్నారు. అయితే అంతమాత్రాన అమాయక పాఠశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకొన్న బందిపోట్ల బ్లాక్ మెయిలింగ్‌లకు లొంగిపోయేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం కంటే తాము శక్తివంతులమని బందిపోట్లు, కిడ్నాపర్లు, ఉగ్రవాదులు భ్రమలో ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు. నైజీరియాలో అనేక యేళ్ళుగా ఇటువంటి కిడ్నాప్‌లు, దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 2014లో బోరో రాష్ట్రంలోని చిబోక్ మాధ్యమిక పాఠశాల నుంచి 276 మంది బాలికలను జిహాదిస్ట్ గ్రూపు కిడ్నాప్ చేసింది. ఇప్పటికీ వారిలోని 100 మంది బాలికల ఆచూకీ తెలియరాలేదు. -
దుబ్బాకలో కిడ్నాప్.. నిజామాబాద్‌లో ప్రత్యక్షం
సాక్షి, నిజామాబాద్: ధర్పల్లి మండలం దుబ్బాక రోడ్డులో డీబీతండాకు చెందిన యువతి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. శనివారం మధ్యాహ్నం కిడ్నాప్‌నకు గురి కాగా అదే రోజు రాత్రి నిజామాబాద్ బస్టాండ్ వద్ద యువతి తప్పించుకొని ఇంటికి చేరింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దుబ్బాకలో వరి కోత మిషిన్ పని చేసే వ్యక్తితో యువతికి గతంలోనే పరిచయం ఉంది. దీంతో యువతిని శనివారం మధ్యాహ్నం బయటకు వెళుతామని కారులో తీసుకెళ్లారు. ఇంతలోనే యువతి తల్లి చూసి కూతురుని కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. సదరు వ్యక్తిని నిజామాబాద్‌కు తెచ్చారు. బస్టాండ్ వద్ద కారు డోరు లాక్ పడకపోవడంతో యువతి కారు నుంచి తప్పించుకొని వెళ్లింది. సదరు యువకుడు కారులో పారిపోయాడు. ఇందల్వాయి బస్టాండ్ వద్ద కారు మొరాయించడంతో చేసేది ఏమిలేక యువకుడు పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ తన కార్యాలయానికి యువకుడిని తెచ్చి విచారించి కేసు నమోదు చేశారు. యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు ఏమంటున్నారంటే.. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామ సమీపంలో శనివారం మధ్యాహ్నం యువతిని కిడ్నాప్ చేసిన ఘటనలో పోలీసులు మధ్యాహ్నం నుంచి ఆదివారం తెల్లవారుజామున వరకు శ్రమించగా తెల్లవారుజామున 5.45 గంటలకు నిజామాబాద్ బస్టాండ్‌లో బాలిక పోలీసులకు లభించింది. యువతిని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని సఖీ సెంటర్‌కు తరలించారు. అక్కడే నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, ధర్పల్లి సీఐ ప్రసాద్, ఎస్ఐ పాండేరావు విచా రించారు. అనంతరం ఏసీపీ కార్యాలయంలో శ్రీనివాస్‌కుమార్ మాట్లాడారు. యువతి శనివారం మధ్యాహ్నం కిడ్నాప్‌నకు గురైందని ధర్పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారన్నారు. ధర్పల్లి, సిరికొండ, ఇందల్వాయి టోల్గేట్, జక్రాన్‌పల్లి, భీంగల్‌తోపాటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తం గా పోలీసులను అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అన్ని పోలీసు స్టేషన్ పరిధిలోని లాడ్జీలు, హోటళ్లు, రైల్వేస్టేషన్, బస్టాండ్లల్లో సైతం తనిఖీ చేయగా తెల్లవారుజామున నిజామాబాద్ బస్టాండ్‌లో యువతిని పట్టుకున్నట్లు చెప్పా రు. ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ యువతిని విచా రించగా పలు విషయలు బయటకు వచ్చాయన్నారు. దుబ్బాకకు చెందిన నగేష్ యువతిని కిడ్నాప్ చేశాడని, ముఖ పరిచయం ఉందని బాధిత యువతి తెలిపినట్లు ఏసీపీ తెలియజేశారు. ప్రస్తుతం నిందితుడు నగేష్ తమ అదుపులో ఉన్నాడని, విచారిస్తున్నామని, అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తా మన్నారు. ధర్పల్లి పోలీసుస్టేషన్లో కేసు ధర్పల్లి పోలీసు స్టేషన్లో యువతిని కిడ్నాప్ చేసిన నిందితుడు నగేష్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. లైంగికదాడి, కిడ్నాప్ చట్టం కింద రెండు కేసులు నమోదు చేశామని వారు పేర్కొన్నారు. ధర్పల్లి సీఐ, ఎస్ఐలు ఇప్పటికే విచారణ చేపట్టారు. -
టికెట్ తీసుకుంటుండగా బాలుడి కిడ్నాప్..!
సాక్షి, హైదరాబాద్ : ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లో ఓ బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకుంటుండగా తమ కుమారుడు జయప్రకాష్ (విక్కీ) కనిపించకుండా పోయాడని అతని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్ చుట్టు పక్కల అంతా వెతికామని, విక్కీ జాడ తెలియరావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడిని ఎవరో కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
లగ్జరీ కారు కోసం కిడ్నాప్ డ్రామా..
సాక్షి, న్యూఢిల్లీ : లగ్జరీ కారు కొనుగోలు చేసేందుకు కుటుంబ సభ్యుల నుంచి రూ మూడు కోట్లు పొందడం కోసం కిడ్నాప్ డ్రామాకు పూనుకున్న 19 ఏళ్ల యువకుడిని గుర్గావ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 29న క్రికెట్ అకాడమీకి వెళుతున్నట్టు ఇంట్లో చెప్పి వెళ్లిన సందీప్ కుమార్ అనే ఇంటర్ విద్యార్ధి అప్పటి నుంచి అదృశ్యమయ్యాడు. అయితే తాను కిడ్నాప్ అయ్యానని తన సోదరుడు నవీన్ కుమార్‌కు కాల్ చేయాల్సిందిగా ఓ వ్యక్తికి సందీప్ రూ 500 ఇచ్చాడని, రెండు రోజుల పాటు భివాడిలో ఉండి తన బైక్‌ను ఓ ఆలయం వద్ద విడిచిపెట్టి వెళ్లాడని ప్రాధమిక విచారణలో వెల్లడైందని గుర్గావ్ పోలీస్ ప్రతినిధి సుభాష్ తెలిపారు. యువకుడు గుర్గావ్ చేరుకున్న అనంతరం అప్పటికే కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో అతడిని గుర్తించి ట్రాఫిక్ కానిస్టేబుల్ స్ధానిక పోలీసులకు అప్పగించాడు. పోలీసులు విచారించగా హైఎండ్ కార్ కొనుగోలు చేసేందుకు కుటుంబ సభ్యుల నుంచి రూ 3 కోట్లు పొందేందుకు తానే కిడ్నాప్ డ్రామాకు పాల్పడ్డానని అంగీకరించాడు. -
విషాదం: కవలలు కిడ్నాప్.. నదిలో శవమై తేలి
బోపాల్: మధ్యప్రదేశ్‌లో అపహరణకు గురైన ఇద్దరు కవలపిల్లల ఉదంతం తీవ్ర విషాదంతో ముగిసింది. ఫిబ్రవరి 12న పిల్లలు చదువుకుంటున్న పాఠశాల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వారిని అపహరించుకుపోయిన విషయం తీవ్ర కలకలం రేపి సంగతి తెలిసిందే. కవలలో కోసం తీవ్ర గాలింపు చేపట్టిన ఆ రాష్ట్ర పోలీస్ బృందానికి ఉత్తరప్రదేశ్‌లోని బండా ప్రాంతంలో యమున నదీ తీరంలో విగతజీవులుగా కనిపించారు. ఐదేళ్ల శ్రేయాన్షు, ప్రియాన్షు అనే కవలలు మధ్యప్రదేశ్‌లోని ఓ ప్రముఖ వ్యాపారవేత్తకు చెందిన పిల్లలు. చిత్రకూట్ సమీపంలో వారు చదువుకుంటున్న స్కూల్ వద్ద యూపీకి చెందిన కిడ్నాపర్లు గన్‌తో బెదిరించి వారిని కిడ్నాప్ చేశారు. రూ.50 లక్షలు ఇస్తే వారిని వదిలేస్తామని బెదిరించారు. డబ్బులు చెల్లించినప్పటికీ పిల్లల్ని హతమార్చి నదిలో వదిలేశారు. ఈ ఘటన యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఘటనకు సంబందించి ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆగ్రహావేశాలు.. చెలరేగిన హింస కిడ్నాపైన కవలలు శవాలై కొట్టుకువచ్చిన విషయం తెలియగానే మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో పెద్దఎత్తున నిరసనలు పెల్లుబికాయి. వందలాది మంది జనం ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చారు. పిల్లలు కిడ్నాపైన ప్రదేశానికి సమీపంలో ఉన్న జానకికుంద్ షాపింగ్ కాంప్లెక్స్‌ను కొల్లగొట్టారు. కాంప్లెక్స్ ఆస్తులపై విరుచుకుపడ్డారు. కొన్ని దుకాణాలకు నిప్పు పెట్టారు. దీంతో అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేసి, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. పిల్లల స్కూలుపై కొంతమంది ఆందోళనకారులు విరుచుకుపడి రాళ్లురువ్వారు. యోగి రాజీనామా చేయాలి ఈఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఘటనకు బాధ్యత వహిస్తూ యూపీ సీఎం పదవికి యోగి ఆదిత్యానాథ్ రాజీనామా చేయాలని ఆ రాష్ట్ర న్యాయశాఖమంత్రి పీసీ శర్మ డిమాండ్ చేశారు. యూపీ పోలీస్ శాఖకి పిల్లల కిడ్నాప్ గురించి తమ ప్రభుత్వం సమాచారం అందించిన వెంటనే స్పందించి ఉంటే ఈ దారుణం జరిగేదికాదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పిల్లలు హత్యకు గురికావడంతో పౌరుల భద్రత విషయంలో ప్రభుత్వ వైఫల్యం మరోసారి బయటపడింది ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. పిల్లల హత్యను ఖండిస్తున్నట్లు తెలిపారు. -
శిశువును అపహరించిన ఆస్పత్రి సిబ్బంది
సాక్షి, కోనేరుసెంటర్(మచిలీపట్నం): పుట్టిన శిశువు మగబిడ్డ కావడంతో జన్మనిచ్చిన తల్లికి సైతం ఆ శిశువును చూపించకుండా ఓ వైద్యురాలు ఆడిన నాటకం.. సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. పుట్టిన బిడ్డను తనివితీరా చూసుకోవాలన్న ఆ తల్లి తాపత్రయాన్ని సైతం పట్టించుకోని ఆ వైద్యురాలు బిడ్డను అప్పటికపుడు వేరే ప్రాంతానికి తరలించేసింది. గత్యంతరం లేని ఆ అభాగ్యురాలి తల్లి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. ఈ అమానవీయ ఘటన కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో శుక్రవారం చోటు చేసుకుంది. బందరు మండలం సత్రవపాలెంకు చెందిన చిన్నం వెంకటనరసమ్మ కూలి పనులు చేస్తుంటుంది. ఆమెకు నలుగురు సంతానం కాగా కనకదుర్గ పుట్టుకతోనే వికలాంగురాలు. అంగవైకల్యంతో ఉన్న ఆమెకు సంబంధాలు రాకపోవడంతో తల్లితోనే కలసి ఉంటుంది. ఇదిలా ఉండగా కనకదుర్గ అక్క మొగుడు రమణ తరచూ అత్తింటికి వస్తూ కనకదుర్గతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. అనేక మార్లు ఆమెపై లైంగికదాడి చేయడంతో గర్భం దాల్చింది. విషయం కాస్తా చేయి దాటిపోవడంతో ఈ నెల 3వ తేదీన ప్రసవం నిమిత్తం రాజుపేటలోని వాణికుసుమ ఆస్పత్రి వైద్యురాలు వాణికుసుమను తల్లి నరసమ్మ కలిసింది. విషయం వివరంగా చెప్పి ఆపరేషన్ చేయాలని కోరింది. అందుకోసం వైద్యురాలు పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయగా నరసమ్మ తగిన మొత్తంలో ముట్టజెప్పింది. ఆదివారం కనకదుర్గను ఆస్ప త్రిలో చేర్చగా సోమవారం ఆమెకు ఆపరేషన్ చేశారు. కనకదుర్గ మగబిడ్డకు జన్మనిచ్చింది.పుట్టిన బిడ్డను సదరు వైద్యురాలు తల్లికి చూపించకుండా ఉంచింది. అలా రోజు, రెండు రోజులు, మూడు రోజులు గడవగా అనుమానం వచ్చిన బాధితురాలి తల్లి నరసమ్మ వైద్యురాలిని కలిసి పుట్టిన బిడ్డను చూపించాలంటూ వేడుకుంది. పుట్టింది బిడ్డ కాదు గడ్డ మాత్రమే అంటూ వైద్యురాలు బుకాయించింది. గత్యం తరం లేని నరసమ్మ చివరికి పోలీసులను ఆశ్రయించి న్యాయం కోరింది. రంగంలోకి దిగిన పోలీసులు వైద్యురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్సీషియనే బిడ్డను అపహరించి మచిలీపట్నం దాటించినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం శిశువు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఉన్నట్టు సమాచారం. కాగా ఈ తతంగాన్ని తప్పుదారి పట్టించేందుకు పలువురు టీడీపీ నేతలు తెర వెనుక కథ నడిపినట్టు విమర్శలు వస్తున్నాయి. -
చిట్టితండ్రీ.. వచ్చేశావా..
ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. ఏడాదిన్నర బాబును కిడ్నాపర్ అపహరించింది మొదలు నిద్రాహారాలు మానేసిన ఆ దంపతులు మంగళవారం కొండంత సంబర పడ్డారు. బిడ్డ ఒడిచేరగానే తల్లి కంట ఆనందభాష్పాలు కట్టలు తెంచుకున్నాయి. తిరుమలలో వీరేష్ కిడ్నాపు ఫలితంగా ఏర్పడిన నాలుగు రోజుల ఉత్కంఠకు తెరపడింది. పోలీసులతో సహా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కిడ్నాప్ కేసును ఛేదించిన విధానాన్ని అర్బన్ జిల్లా ఎస్పీ కెకెఎన్ అన్బురాజన్ మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో మీడియాకు వివరించారు. తిరుపతి క్రైం : గత నెల27వ తేదీ రాత్రి మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందిన ప్రశాంత్ యాదవ్, అతని భార్య స్నేహలు తమ బిడ్డ వీరేష్ (18 నెలలు)తో తిరుమలకు వచ్చారు. మర్నాడు ఉదయం చూసేసరికి వీరేష్ కనపడలేదన్నారు. కాసేపు వెతికాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాబు వివరాలు తెలియజేశారు. వారిచ్చిన వివరాల ఆధారంగా వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. తిరుమల, తిరుపతిలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అనుమానిత వ్యక్తి బాలుడిని తీసుకెళ్తున్న దృశ్యాలను గుర్తించారు. ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలతో ప్రత్యేక బృందాలను కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి నగరాలలో ముమ్మర తనిఖీలు చేశారు. ఈలోగా నిందితుడి ఊహా చిత్రాలను, కిడ్నాప్ వివరాలను పత్రికలలోను, సామాజిక మాధ్యమం ద్వారా ముమ్మర ప్రచారం చేశారు. దీనివల్ల దేశమంతా ఈ ఘటన పాకింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మహూర్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రేణుకాదేవి ఆలయం వద్ద బాలుడితో కిడ్నాపర్ తిరుగుతున్న వైనాన్ని ఓ వ్యక్తి గమనించాడు. అప్పటికే ఈ కిడ్నాప్ సమాచారాన్ని మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ఆ వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశాడు. వెంటనే పోలీసులు చేరుకుని కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి సురక్షితంగా బాలుడ్ని కాపాడారు. మహారాష్ట్ర పోలీసుల సమాచారంతో తిరుమల ఏఎస్పీ కేఎస్.మహేశ్వర్రాజు, సీఐ రామకృష్ణ అక్కడకు వెళ్లారు. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకుని, బాబును వెంట బెట్టుకుని తిరుపతికి వచ్చారు. కిడ్నాపర్ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఐ.విశ్వంబర్(43)గా గుర్తించారు. ఇతను తాపీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అవివాహితుడు. రెండుమూడు నెలలకొకసారి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేవారు. అదేమాదిరిగా ఇటీవల తిరుమలకు వచ్చి వీరేష్‌ను కిడ్నాప్ చేశాడు. తనకు ఎవరూ లేకపోవడంతో వృద్ధాప్యంలో తోడుగా ఉంటాడనే బాలుడిని కిడ్నాప్ చేసినట్లు విశ్వంబర్ చెబుతున్నాడు. మరే ఉద్దేశం లేదని పోలీసులకు విచారణలో తెలిపాడు. పూర్తిస్థాయిలో విచారించి నిజానిజాలను తేలుస్తామని అర్బన్ ఎస్పీ చెప్పారు. తిరుమలకు వచ్చే యాత్రికులు కూడా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. పిల్లలు కన్పించకపోతే మరి ఆలస్యం చేయకుండా అతివేగంగా పోలీసులకు సమాచారమివ్వాలని కోరారు. అలా చేస్తే సకాలంలో నిందితులను అదుపులోకి తీసుకుంటామన్నారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ శివరామరెడ్డి, క్రైం డీఎస్పీ రవిశంకర్‌రెడ్డి, డీఎస్పీ రవిమనోహరాచారీ, ఎస్సీ,ఎస్టీ సెల్ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
కథ సుఖాంతం : బాలుడి ఆచూకీ లభ్యం
-
కథ సుఖాంతం : బాలుడి ఆచూకీ లభ్యం
సాక్షి, తిరుమల: రెండు రోజుల ఉత్కంఠకు తెరపడింది. తిరుమలలో బాలుడి కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. శుక్రవారం ఉదయం కిడ్నాపైన వీరేష్ ఆచూకీ నాందేడ్‌లో లభ్యమైంది. పిల్లాడిని అపహరించి మహారాష్ట్రకు పరారైన నిందితున్ని స్థానిక ప్రజలు గుర్తించి ఆదివారం ఉదయం నాందేడ్‌లో పట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కిడ్నాపర్‌ను అరెస్టు చేసి బాలుడ్ని సంరక్షణలోకి తీసుకున్నారు. వివరాలు.. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ దంపతులు ఏడాదిన్నర వయసున్న కుమారుడు వీరేష్‌తో కలిసి గురువారం తిరుమలకు వచ్చారు. శ్రీవారి దర్శనం అనంతరం అద్దె గదులు దొరక్కపోవడంతో మాధవ నిలయం వద్ద గల మండపంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. (తిరుమలలో బాలుడి కిడ్నాప్) ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వీరేష్ కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గంటల తరబడి వెతికినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి తండ్రి వద్ద నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి బాబు ఆచూకీ కోసం రంగంలోకి దిగారు. కిడ్నాపర్‌ను పట్టుకోవడానికి తిరుమల ఏఎస్పీ మహేశ్వరరాజు ఆధ్వర్యంలో 6 ప్రత్యేక బృందాలను నియమించారు. బాలుడి ఫొటోతో పాటు కిడ్నాప్ చేసిన వ్యక్తి చిత్రాలున్న పోస్టర్లు, కరపత్రాలను ముద్రించి బస్సుల్లో అతికించారు. సీసీ ఫుటేజీలు లభ్యం.. ఈ ఘటనలో బాలుడు తప్పిపోలేదని, ఓ వ్యక్తి వీరేష్‌ను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ప్రాథమిక సాక్ష్యాలు లభించాయి. తిరుమలలోని గంగమ్మ ఆలయం వద్ద పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఉదయం 7.30 గంటలకు మాధవ నిలయం వద్ద ఉన్న గంగమ్మవారి ఆలయం ముందు సుమారు 42 ఏళ్ల వయస్సున్న వ్యక్తి వీరేష్‌ను అపహరించినట్లు నిర్దారణకు వచ్చారు. -
పిల్లాడిని ఎలా ఎత్తుకుపోయాడో చూడండి
సాక్షి, తిరుమల: తిరుమలలో బాలుడి కిడ్నాప్ ఉదంతంతో టీటీడీ అధికారులు ఉలిక్కి పడ్డారు. ఏడాది క్రితం తిరుమలలో జరిగిన రెండు కిడ్నాప్ ఘటనలు మరువకముందే మహారాష్ట్రకు చెందిన ఏడాదిన్నర వయసున్న వీరేష్ శుక్రవారం అపహరణకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ దంపతులు గురువారం తిరుమలకు వచ్చారు. శుక్రవారం ఉదయం 4 గంటలకు శ్రీవారి దర్శనం ముగించుకుని విశ్రాంతి గదులు దొరకక పోవడంతో 4.15 గంటలప్పుడు మాధవ నిలయం వద్ద ఉన్న మండపంలో విశ్రాంతి తీసుకున్నారు. ఉదయం 6.30 నిమిషాల వరకు బాబు నిద్రిస్తూ కనిపించాడని బాలుడి తండ్రి ప్రశాంత్ తెలిపాడు. కాసేపు కునుకు తీసి 7.15 గంటలకు చూడగా బాబు తమ వద్ద లేకపోవడంతో.. గంటల తరబడి వెతికామని లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. బాలుడి తండ్రి వద్ద నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి బాబు ఆచూకీ కోసం రంగంలోకి దిగారు. కిడ్నాపర్‌ను పట్టుకోవడానికి తిరుమల ఏఎస్పీ మహేశ్వరరాజు ఆధ్వర్యంలో 6 ప్రత్యేక బృందాలను నియమించారు. బాలుడి ఫొటోతో పాటు కిడ్నాప్ చేసిన వ్యక్తి చిత్రాలున్న పోస్టర్లు, కరపత్రాలను ముద్రించి బస్సుల్లో అతికించారు. సీసీ ఫుటేజీలు లభ్యం.. ఈ ఘటనలో బాలుడు తప్పిపోలేదని, ఓ వ్యక్తి వీరేష్‌ను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ప్రాథమిక సాక్ష్యాలు లభించాయి. తిరుమలలోని గంగమ్మ ఆలయం వద్ద పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఉదయం 7.30 గంటలకు మాధవ నిలయం వద్ద ఉన్న గంగమ్మవారి ఆలయం ముందు సుమారు 42 ఏళ్ల వయస్సున్న వ్యక్తి వీరేష్‌ను అపహరించినట్లు నిర్దారణకు వచ్చారు. -
ఇంటర్ విద్యార్థిని కిడ్నాప్ చేసిన నక్సల్స్
సాక్షి, న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఇంటర్ రెండో సవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని నక్సలైట్లు బుధవారం కిడ్నాప్ చేశారు. బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు ముగ్గురు నక్సలైట్లను కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే యువకున్ని అపహరించినట్టు తెలుస్తోంది. బేజీ నుంచి కొండకు వెళ్తున్నతక కొడుకు కనిపించకుండా పోయాడని యువకుడి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారుప. కాగా, నిన్న ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశ నుంచి నక్సలైట్ల మృత దేహాలను స్వాధీనం చేసుకున్నామనీ, మరో నక్సలైట్‌ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. భద్రతా బలగాలు చేపట్టిన యాంటి నక్సల్ ఆపరేషన్ సందర్భంగా ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు సుకుమా ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. ఘటనా స్థలం నుంచి నాలుగు నాటు బాంబులు, ఒక రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. -
పశువుల్లంక రెవెన్యూ అధికారులపై తిరగబడ్డ గ్రామస్తులు