ఆరేళ్ల ప్రాయంలో కిడ్నాప్‌కి గురయ్యాడు..కట్‌చేస్తే 70 ఏళ్ల తర్వాత..! | Boy Abducted From California In 1951 Return 70 Years Later | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల ప్రాయంలో కిడ్నాప్‌కి గురయ్యాడు..కట్‌చేస్తే 70 ఏళ్ల తర్వాత..!

Published Mon, Sep 23 2024 11:26 AM | Last Updated on Mon, Sep 23 2024 11:26 AM

Boy Abducted From California In 1951 Return 70 Years Later

కొన్ని సంఘటనలు ఓ పట్టాన అర్థం కావు. ఎలా వస్తువులు లేదా వ్యక్తులను పోగొట్టుకుట్టాం. వాటి ఆచూకీకై ఏళ్లు తరబడి ఆశగా ఎదురుచూస్తాం. చివరికి ఆశలన్నీ ఆవిరిఅయిపోయి. దొరకదు అనే నైరాశ్యంలో ఉండగా ఏదో అద్భుతం జరిగనట్టుగా ఆ వ్యక్తి లేదా ఆ వస్తువు మన చెంతకు వస్తే ఆ ఆనందం మాటలకందని భావోద్వేగా క్షణం కదూ..అలాంటి కథే ఇక్కడ చోటేచేసుకుంది. గుండెల్ని పిండేసీ ఉద్వేగభరితం లూయిస్ అర్మాండో అల్బినో ‍కథ..!

ఏం జరిగిందంటే..కాలిఫోర్నియాకి చెందిన లూయిస్‌ ఆర్మాండో అల్బినో ఫిబ్రవరి 21, 1951న తన పదేళ్ల సోదరుడు రోజర్‌తో కలిసి ఆడుకుంటుండగా తప్పిపోయాడు. ఓ అపరిచిత మహిళ స్వీట్లు ఇస్తానని ఆశచూపి ఎత్తుకుపోయింది. అలా కిడ్నాప్‌కి గురైన అల్బినో ఆచూకీ అంతు చిక్కని మిస్టరీలా ఉండిపోయింది. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయే తప్ప..అల్బినో ఆచూకీ గురించి మచ్చుకైనా కేసు ముందుకు సాగలేదు. 

అతడి కోసం ఎదురుచూసి అతడి తల్లి 92 ఏళ్ల వయసులో కన్నుమూసింది. అయితే అల్బినో మేనకోడలు అలిడా అలెక్విన్(60)  మాత్రం తన మామ అల్బినో ఆచూకీ ఎలాగైన కనిపెట్టాలని ఎంతోగానో తప్పనపడింది. అందుకోసం నాడు కిడ్నాప్‌ అయ్యినట్లు ఇచ్చిన పేపర్‌ యాడ్‌లు, ఫోటోలను సేకరించి మరీ అన్వేషణ సాగించింది. డీఎన్‌ఏ పరీక్షలు వంటి ప్రత్యామ్నాయాలతో తీవ్రంగా వెతకడం ప్రారంభించింది. ఎట్టకేలకు ఆమె కృషి ఫలించి..మామ అల్బినో ఆచూకిని కనుక్కొంది. అతడు రిటైర్డ్‌ అగ్నిమాపక సిబ్బంది, మెరైన్‌ కార్ప్స్‌ నిపుణుడుని తెలుసుకుంది. 

అతడు వియత్నాంలో రెండుసార్లు పర్యటించాడు కూడా. అతడి డీఎన్‌తో తన కుటుంబ సభ్యుల డీఎన్‌ఏ 22% సరిపోలాడం వంటివి ఆమె ఆనందానికి అవధులు లేకుండా చేసింది. వెంటనే అలిడా తన మామ అల్బినోను కుటుంబ సభ్యులతో కలిపింది. అల్బినో సరిగ్గా తన సోదరుడు రోజర్‌ 82 ఏటనే కలుసుకున్నాడు. అతడు కేన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిసి బాధపడ్డాడు. అయితే మరణానికి ముందు ఇలా తప్పిపోయిన తన తమ్ముడిని కలుసుకోవడం తనకెంతో సంతోషాన్నిచ్చిందంటూ రోజర్‌ భావోద్వేగానికి గురయ్యాడు. 

ఇరువురు తమ చిన్నప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు. చాలసేపు మాట్లాడుకున్నారు. ఈ మధుర క్షణం కోసం అలిడా ఎంతగా తపించిందంటే..స్థానిక లైబ్రరీలలో వార్తాపత్రికల ఆర్కైవ్‌లు, మైక్రోఫిల్మ్‌లు తదితరాలతో అణువణువు జల్లెడ పట్టింది. చివరికి లూయిస్‌ అల్బినో చిత్రాలను కనిపెట్టి..దశాబ్దాల నాటి మిస్టరీని చేధించింది. తన మామ అల్బినోని కుటుంబంతో కలిపింది మేనకోడలు అలిడా అలెక్విన్ .

(చదవండి: ఇదేం బ్యాగ్‌ రా దేవుడా..! ధర తెలిస్తే కంగుతింటారు..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement