సాక్షి, నిజామాబాద్: ధర్పల్లి మండలం దుబ్బాక రోడ్డులో డీబీతండాకు చెందిన యువతి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. శనివారం మధ్యాహ్నం కిడ్నాప్‌నకు గురి కాగా అదే రోజు రాత్రి నిజామాబాద్ బస్టాండ్ వద్ద యువతి తప్పించుకొని ఇంటికి చేరింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దుబ్బాకలో వరి కోత మిషిన్ పని చేసే వ్యక్తితో యువతికి గతంలోనే పరిచయం ఉంది. దీంతో యువతిని శనివారం మధ్యాహ్నం బయటకు వెళుతామని కారులో తీసుకెళ్లారు. ఇంతలోనే యువతి తల్లి చూసి కూతురుని కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. సదరు వ్యక్తిని నిజామాబాద్‌కు తెచ్చారు. బస్టాండ్ వద్ద కారు డోరు లాక్ పడకపోవడంతో యువతి కారు నుంచి తప్పించుకొని వెళ్లింది. సదరు యువకుడు కారులో పారిపోయాడు. ఇందల్‌వాయి బస్టాండ్ వద్ద కారు మొరాయించడంతో చేసేది ఏమిలేక యువకుడు పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.
ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ తన కార్యాలయానికి యువకుడిని తెచ్చి విచారించి కేసు నమోదు చేశారు. యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు ఏమంటున్నారంటే.. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామ సమీపంలో శనివారం మధ్యాహ్నం యువతిని కిడ్నాప్ చేసిన ఘటనలో పోలీసులు మధ్యాహ్నం నుంచి ఆదివారం తెల్లవారుజామున వరకు శ్రమించగా తెల్లవారుజామున 5.45 గంటలకు నిజామాబాద్ బస్టాండ్‌లో బాలిక పోలీసులకు లభించింది. యువతిని నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని సఖీ సెంటర్‌కు తరలించారు. అక్కడే నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, ధర్పల్లి సీఐ ప్రసాద్, ఎస్‌ఐ పాండేరావు విచా రించారు. అనంతరం ఏసీపీ కార్యాలయంలో శ్రీనివాస్‌కుమార్ మాట్లాడారు. యువతి శనివారం మధ్యాహ్నం కిడ్నాప్‌నకు గురైందని ధర్పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారన్నారు.
ధర్పల్లి, సిరికొండ, ఇందల్‌వాయి టోల్‌గేట్, జక్రాన్‌పల్లి, భీంగల్‌తోపాటు నిజామాబాద్ జిల్లా వ్యాప్తం గా పోలీసులను అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అన్ని పోలీసు స్టేషన్ పరిధిలోని లాడ్జీలు, హోటళ్లు, రైల్వేస్టేషన్, బస్టాండ్‌లల్లో సైతం తనిఖీ చేయగా తెల్లవారుజామున నిజామాబాద్ బస్టాండ్‌లో యువతిని పట్టుకున్నట్లు చెప్పా రు. ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ యువతిని విచా రించగా పలు విషయలు బయటకు వచ్చాయన్నారు. దుబ్బాకకు చెందిన నగేష్ యువతిని కిడ్నాప్ చేశాడని, ముఖ పరిచయం ఉందని బాధిత యువతి తెలిపినట్లు ఏసీపీ తెలియజేశారు. ప్రస్తుతం నిందితుడు నగేష్ తమ అదుపులో ఉన్నాడని, విచారిస్తున్నామని, అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తా మన్నారు. ధర్పల్లి పోలీసుస్టేషన్‌లో కేసు ధర్పల్లి పోలీసు స్టేషన్‌లో యువతిని కిడ్నాప్ చేసిన నిందితుడు నగేష్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. లైంగికదాడి, కిడ్నాప్ చట్టం కింద రెండు కేసులు నమోదు చేశామని వారు పేర్కొన్నారు. ధర్పల్లి సీఐ, ఎస్‌ఐలు ఇప్పటికే విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment