లగ్జరీ కారు కోసం కిడ్నాప్‌ డ్రామా.. | Student Fakes Own Kidnapping To Get Money To Buy A Luxery Car | Sakshi
Sakshi News home page

ఖరీదైన కారు కోసం కిడ్నాప్‌ డ్రామా..

Published Wed, Apr 3 2019 8:46 AM | Last Updated on Wed, Apr 3 2019 10:21 AM

Student Fakes Own Kidnapping To Get Money To Buy A Luxery Car - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : లగ్జరీ కారు కొనుగోలు చేసేందుకు కుటుంబ సభ్యుల నుంచి రూ మూడు కోట్లు పొందడం కోసం కిడ్నాప్‌ డ్రామాకు పూనుకున్న 19 ఏళ్ల యువకుడిని గుర్‌గావ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈనెల 29న క్రికెట్‌ అకాడమీకి వెళుతున్నట్టు ఇంట్లో చెప్పి వెళ్లిన సందీప్‌ కుమార్‌ అనే ఇంటర్‌ విద్యార్ధి అప్పటి నుంచి అదృశ్యమయ్యాడు.

అయితే తాను కిడ్నాప్‌ అయ్యానని తన సోదరుడు నవీన్‌ కుమార్‌కు కాల్‌ చేయాల్సిందిగా ఓ వ్యక్తికి సందీప్‌ రూ 500 ఇచ్చాడని, రెండు రోజుల పాటు భివాడిలో ఉండి తన బైక్‌ను ఓ ఆలయం వద్ద విడిచిపెట్టి వెళ్లాడని ప్రాధమిక విచారణలో వెల్లడైందని గుర్‌గావ్‌ పోలీస్‌ ప్రతినిధి సుభాష్‌ తెలిపారు. యువకుడు గుర్‌గావ్‌ చేరుకున్న అనంతరం అప్పటికే కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో అతడిని గుర్తించి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ స్ధానిక పోలీసులకు అప్పగించాడు. పోలీసులు విచారించగా హైఎండ్‌ కార్‌ కొనుగోలు చేసేందుకు కుటుంబ సభ్యుల నుంచి రూ 3 కోట్లు పొందేందుకు తానే కిడ్నాప్ డ్రామాకు పాల్పడ్డానని అంగీకరించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement