youth arest
-
లగ్జరీ కారు కోసం కిడ్నాప్ డ్రామా..
సాక్షి, న్యూఢిల్లీ : లగ్జరీ కారు కొనుగోలు చేసేందుకు కుటుంబ సభ్యుల నుంచి రూ మూడు కోట్లు పొందడం కోసం కిడ్నాప్ డ్రామాకు పూనుకున్న 19 ఏళ్ల యువకుడిని గుర్గావ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 29న క్రికెట్ అకాడమీకి వెళుతున్నట్టు ఇంట్లో చెప్పి వెళ్లిన సందీప్ కుమార్ అనే ఇంటర్ విద్యార్ధి అప్పటి నుంచి అదృశ్యమయ్యాడు. అయితే తాను కిడ్నాప్ అయ్యానని తన సోదరుడు నవీన్ కుమార్‌కు కాల్ చేయాల్సిందిగా ఓ వ్యక్తికి సందీప్ రూ 500 ఇచ్చాడని, రెండు రోజుల పాటు భివాడిలో ఉండి తన బైక్‌ను ఓ ఆలయం వద్ద విడిచిపెట్టి వెళ్లాడని ప్రాధమిక విచారణలో వెల్లడైందని గుర్గావ్ పోలీస్ ప్రతినిధి సుభాష్ తెలిపారు. యువకుడు గుర్గావ్ చేరుకున్న అనంతరం అప్పటికే కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో అతడిని గుర్తించి ట్రాఫిక్ కానిస్టేబుల్ స్ధానిక పోలీసులకు అప్పగించాడు. పోలీసులు విచారించగా హైఎండ్ కార్ కొనుగోలు చేసేందుకు కుటుంబ సభ్యుల నుంచి రూ 3 కోట్లు పొందేందుకు తానే కిడ్నాప్ డ్రామాకు పాల్పడ్డానని అంగీకరించాడు. -
మేయర్ వెళ్లేసరికి మందేస్తూ యువకులు.. షాక్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఓ ప్రముఖ శ్మశాన వాటికలో దూరి మందు కొడుతున్న యువకులను చూసి నగర మేయర్ బొంతు రామ్మోహన్ షాకయ్యారు. అనంతరం వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేయించి వారికి షాకిచ్చారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పంజాగుట్ట హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులు పరిశీలించేందుకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ అక్కడికి వచ్చారు. ఆ సమయంలో కొంతమంది యువకులు సమాధులను టేబుళ్లుగా మార్చుకొని దర్జాగా మందుకొడుతూ కనిపించి మేయర్‌ను అవాక్కయ్యేలా చేశారు. వారిని చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వెంటనే వారిని అదుపులోకి తీసుకోని స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. కాగా, మందు కొడుతున్న యువకుల్లో ఒకరు ఆ వార్డు సభ్యురాలు జయలక్ష్మీ కుమారుడు కూడా ఉండటం గమనార్హం. 21 ఏళ్ల లోపు వారికి వైన్స్లలో మద్యం ఇవ్వకపోవడం, మద్యం షాపుల్లో కూర్చొనివ్వకపోవడం చేస్తున్న కారణంగా కొంతమంది యువకులు ఇలా స్మశానాలను సైతం ఆశ్రయించి మందుకొడుతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు శ్మశానాల భద్రతలోపం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. -
పులితో సెల్ఫీ
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్) : జూ బోనులో ఉన్న పులిని వేధింపులకు గురి చేస్తూ ఫోటోలు దిగి ఫేస్బుక్లో పెట్టిన యువకుడిని బహదూర్‌పురా పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ మలక్‌పేట అక్బర్‌బాగ్ ప్రాంతానికి చెందిన అరీబ్ తహ మెహదీ(26) అనే యువకుడు ఈ నెల 6వ తేదీన బహదూర్‌పురాలోని నెహ్రూ జూలాజికల్ పార్కుకు వెళ్లాడు. అక్కడ అతడు జూ ఉద్యోగి గోవింద్ సాయంతో సందర్శకులకు నిషిద్ధమైన డార్క్ రూంలోకి వెళ్లి బోనులో ఉన్న పులిని కాలు లాగుతూ హింసించాడు. హింసిస్తున్న ఫొటోలు, వీడియో తీసుకొని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ అంటూ టైటిల్ కూడా ఇచ్చేశాడు. అయితే దీనిని గమనించిన నెహ్రూ జూలాజికల్ అసిస్టెంట్ క్యూరేటర్ మోయినుద్దీన్ బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెహదీని అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. యువకుడిపై అక్రమ ప్రవేశం, వన్యప్రాణ రక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా మెహదీకి సహకరించిన గోవింద్‌ను జూ పార్కు అధికారులు సస్పెండ్ చేశారు. అతనిపై కూడా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని సైతం త్వరలోనే అరెస్ట్ చేయనున్నారు.