దేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మే నెలలో మొదలైన హింసాకాండ ఇంకా చల్లారడం లేదు. తాజా ఘటనలో ఒక సైనికుని కుటుంబానికి చెందిన ముగ్గురు సహా మొత్తం నలుగురిని మైతీ ఉగ్రవాదులు అపహరించారు. ఈ సంఘటన ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో చోటుచేసుకుంది.
ఈ కిడ్నాప్ వార్త అంతటా వ్యాపించడంతో ఇంఫాల్ వెస్ట్, కాంగ్‌పోక్పి జిల్లాలతో పాటు కాంగ్‌చుప్ ప్రాంతంలో ఒక సమూహంపై సాయుధ కుకీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఒక మహిళతో సహా మొత్తం ఏడుగురు గాయపడ్డారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం, ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన నలుగురిలో 65 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నాడు. వీరిని రక్షించేందుకు తమ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని కాంగ్‌పోక్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ఎం ప్రభాకర్ తెలిపారు. కిడ్నాప్‌కు గురైన మిగతా నలుగురిని నెంగ్‌కిమ్ (60), నీలం (55), జాన్ తంగ్‌జామ్ హౌకిప్ (25), జామ్‌ఖోటాంగ్ (40)గా పోలీసులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: ‘సరి- బేసి’ విధానం ఏ దేశంలో మొదలయ్యింది?
Comments
Please login to add a commentAdd a comment