unrest
-
బంగ్లా అల్లర్లు: భారత్‌కు ఉగ్ర ముప్పు!
ఢిల్లీ: రిజర్వేషన్ కోటా వ్యతిరేకంగా మొదలైన విద్యార్థులు, నిరసనకారులు చేట్టిన నిరసన హింసాత్మకంగా మారటంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఆమె దేశం విడిచిపెట్టిన్పటి నుంచి అక్కడ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాత్కాలిక కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ మైనర్టీలు, హిందూవులపై దాడులు కొనసాగుతున్నాయి. అయితే బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అల్లర్లు, నెలకొన్న అనిశ్చితి కారణంగా ఉగ్రవాద సంస్థల నుంచి భారత్‌కు ముప్పు పొంచిఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. షేక్ హహీనా ప్రభుత్వాన్ని దించడానికి నిరసనలు చేపట్టిన వారంతా విద్యార్థలుగా కనిపించినప్పటికీ.. మైనార్టీలు, హిందూవులపై దాడులను గమనిస్తే వారివెనక ఉగ్రసంస్థల ప్రమేయం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ), బంగ్లాదేశ్‌కు చెందిన అన్సరుల్లా బంగ్లా టీమ్ (ఏబీటీ)తో కలిసి.. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద దాడులకు పాల్పడనున్నట్లు సమాచారం.బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వ మార్పు ఆపరేషన్‌లో పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) పాత్ర, జమాత్-ఇ-ఇస్లామీ, అన్సరుల్లా బంగ్లా టీమ్( ఏబీటీ) తో ఇతర నిషేధిత గ్రూపుల ప్రత్యక్ష మద్దతు ఉన్నట్ల నిఘా వర్గాలు సూచిస్తున్నాయి. ఎల్ఈటీ సహకారంతో ఏబీటీ 2022లో భారత్‌లో దాడులను చేయటమే లక్ష్యంగా బెంగాల్లో స్థావరాన్ని స్థాపించినట్లు నిఘా అధికారులు తెలిపారు. త్రిపురలోని హిందూ మెజారిటీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఎల్ఈటీ ఏబీటీతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నట్లు గతంలో ఇంటెలిజెన్స్‌కి సమాచారం వచ్చింది. దాదాపు 50 నుండి 100 మంది ఏబీటీకి చెందిన ఉగ్రవాదులు త్రిపురలోకి చొరబడాలని ప్లాన్ చేస్తున్నాయని 2022లో నిఘా వర్గాలు గుర్తించాయి. అదే ఏడాది ఏబీటీతో సంబంధం ఉన్న అనేక మంది ఉగ్రవాదులను అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. -
Bangladesh unrest: భారత్‌కు తిరిగొచ్చిన 4,500 మంది విద్యార్థులు
బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హింసాయుత ఘటనలు చోటుచేసుకుంటుండటంతో 4,500 మందికి పైగా భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇదేవిధంగా నేపాల్ నుండి 500 మంది, భూటాన్ నుండి 38 మంది, మాల్దీవుల నుండి ఒకరు భారతదేశానికి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్ భారత పౌరుల భద్రతపై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 4,500 మందికి పైగా భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఢాకాలోని భారత హైకమిషన్, చిట్టగాంగ్, రాజ్షాహి, సిల్హెట్, ఖుల్నాలోని అసిస్టెంట్ హైకమిషన్లు భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు సహాయం అందిస్తున్నాయి. భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులు, విమానాశ్రయాలకు భారత పౌరులు సజావుగా వెళ్లేలా చూసేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.బంగ్లాదేశ్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలలో ఇప్పటికీవున్న భారతీయ విద్యార్థులు, ఇతర భారతీయులతో భారత హైకమిషన్ టచ్‌లో ఉంది. బంగ్లాదేశ్‌లో మొత్తం 15 వేల మంది భారతీయ పౌరులు ఉన్నారని, ఇందులో 8,500 మంది విద్యార్థులు ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన తమిళులను ఆదుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్న నేపథ్యంలో సరిహద్దు భద్రతా దళం భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిఘాను మరింతగా పెంచింది. Update on return of Indian Nationals in Bangladesh: So far, over 4500 Indian students have returned to India. The High Commission has been making arrangement for security escort for safe travel of Indian nationals to the border-crossing points. 500 students of Nepal, 38 of Bhutan… pic.twitter.com/XNmCYYz7U0— ANI (@ANI) July 21, 2024 -
మణిపూర్‌లో మళ్లీ హింస: నలుగురి అపహరణ, కాల్పుల్లో ఏడుగురికి గాయాలు!
దేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మే నెలలో మొదలైన హింసాకాండ ఇంకా చల్లారడం లేదు. తాజా ఘటనలో ఒక సైనికుని కుటుంబానికి చెందిన ముగ్గురు సహా మొత్తం నలుగురిని మైతీ ఉగ్రవాదులు అపహరించారు. ఈ సంఘటన ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ కిడ్నాప్ వార్త అంతటా వ్యాపించడంతో ఇంఫాల్ వెస్ట్, కాంగ్పోక్పి జిల్లాలతో పాటు కాంగ్‌చుప్ ప్రాంతంలో ఒక సమూహంపై సాయుధ కుకీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఒక మహిళతో సహా మొత్తం ఏడుగురు గాయపడ్డారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం, ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన నలుగురిలో 65 ఏళ్ల వ్యక్తి కూడా ఉన్నాడు. వీరిని రక్షించేందుకు తమ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని కాంగ్పోక్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ఎం ప్రభాకర్ తెలిపారు. కిడ్నాప్‌కు గురైన మిగతా నలుగురిని నెంగ్‌కిమ్ (60), నీలం (55), జాన్ తంగ్జామ్ హౌకిప్ (25), జామ్‌ఖోటాంగ్ (40)గా పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: ‘సరి- బేసి’ విధానం ఏ దేశంలో మొదలయ్యింది? -
నాహేల్ మృతి.. కంటిమీద కునుకులేని ఫ్రాన్స్..! వీడియో బయటకు
ఫ్రాన్స్: గడిచిన మూడు రోజులుగా ఫ్రాన్స్ అట్టుడికిపోతోంది. పోలీసు కాల్పుల్లో మరణించిన నల్ల జాతీయుడు నాహేల్ మృతికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు పోలీసులపై దాడులకు తెగబడ్డారు. పాఠశాలలు, టౌన్ హాళ్లు, పోలీస్ స్టేషన్లు, కార్లు, దుకాణాలను తగలబెడుతూ ఆందోళనకారులు దేశాన్ని నిద్రపోనీయడం లేదు. అసలేం జరిగింది.. మంగళవారం ఉదయం అల్జీరియాకు చెందిన 17 ఏళ్ల ముస్లిం యువకుడు నాహేల్ నాంటెర్రే ట్రాఫిక్ స్టాప్ వద్ద పోలీసుల ఆజ్ఞను అతిక్రమిస్తూ కొంచెం ముందుకు వెళ్ళాడు. దీంతో పోలీసులు పోలాండ్ నెంబరు ప్లేటు ఉన్న నాహేల్ కారును బ్లాక్ చేసి నాహేల్ ను ప్రమాదకరంగా పరిగణించి పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరిపారు. దీంతో నాహేల్ అక్కడికక్కడే మరణించాడు. వీడియో లీక్.. ఈ హత్యోదంతం తాలూకు వీడియో బయటకు రావడంతో ఫ్రాన్స్ లోని ముస్లింలు పెద్ద ఎత్తున అల్లర్లకు తెరతీశారు. నాహేల్ కు న్యాయం చేయండంటూ మొదలైన నిరసన కాస్తా మెల్లిగా హింసాత్మకంగా మారింది. నినాదాలు చేస్తూ ముస్లింలు కార్లు, దుకాణాలు ప్రజా ఆస్తులను దగ్ధం చేశారు. ఇదే క్రమంలో మార్సెల్లీ లోని అతి పెద్ద గ్రంథాలయానికి కూడా నిప్పు పెట్టారు ఆందోళనకారులు. They r chanting Allah hu akbar and burning shops, cars, public property looting shops France has a 9% muslim population that is highest in Europe and most of them are African immigrants whom France gave shelter pic.twitter.com/jjkcTM5KIu — STAR Boy (@Starboy2079) June 30, 2023 అక్కడ సర్వసాధారణం.. ఫ్రాన్స్ దేశ జనాభాలో 9% ఉండే ముస్లింలలో అత్యధికులు శరణార్థులు.. వలసదారులే.. వీరికి ఫ్రాన్స్ ఆశ్రయమిచ్చింది. గతేడాది ఫిఫా వరల్డ్ కప్ సమయంలో ఫ్రాన్స్ జట్టు మొరాకోపై గెలిచినప్పుడు కూడా ముస్లింలు ఇలాగే విధ్వంసాన్ని సృష్టించారు. ఈ నేపథ్యంలో కొందరు దీన్ని జాత్యాహంకారానికి వ్యతిరేకంగా ఎగిసిన ఉద్యమ జ్వాలాగా అభివర్ణస్తుంటే మరికొంతమంది మాత్రం వారు అల్లర్లు చేయడానికి ఏదో ఒక కారణం కావాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అరెస్టులు.. ఆందోళనకారులు చేసిన దాడుల్లో ఇంతవరకు 249 మంది పోలీసులు గాయపడ్డారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ అల్లర్లు చేస్తున్న సుమారు 875 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అత్యధికులు 14 నుండి 18 సంవత్సరాల వయసువారే కావడం విశేషం. ఉక్కుపాదం.. ఉద్రిక్త ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చెలరేగకుండా నియంత్రించే క్రమంలో దాదాపుగా 40 వేల మంది రక్షణ బలగాలను మోహరించినట్టు తెలిపారు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్డ్ డార్మానిన్. Amidst slogans of Allah hu Akbar, Rioters are destroying The France pic.twitter.com/JOBY2bVSDL — STAR Boy (@Starboy2079) June 30, 2023 ఆ తల్లి కడుపు కోత.. నేను పోలీసు వ్యవస్థపై నింద వేయడం లేదు. నా కుమారుడిని పొట్టనబెట్టుకున్న ఆ ఒక్క అధికారిపైనే నా కోపమంతా. నా బిడ్డను అతనే చంపాడు. నా కుమారుడు అరబ్ అని తెలిసే, అతని కాల్పులు జరిపాడు.. అని నాహెల్ తల్లి మౌనియా ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్షుడి సందేశం.. ఇదిలా ఉండగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పందిస్తూ.. ఆందోళనాకరుల పధ్ధతి సరైనది కాదని, కుర్రాడిని కాల్చి చంపిన ఘటనలో పోలీసు అధికారిపై విచారణ జరుగుతోందని ఆందోళనకారులు శాంతించాలని కోరారు. Riots in France (Explained) Tuesday morning, A 17 year old Algirian muslim Nahel was driving a car with Polland number in Bus lane at Nanterre (Suburb of Paris) Police tried to stop him but he didn't stop. Police found him potential threat and shot (Video in last tweet) 1/5 pic.twitter.com/iIXPvEoraM — STAR Boy (@Starboy2079) June 30, 2023 ఇది కూడా చదవండి : యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ.. -
మంచి మాట: అభిప్రాయం కాదు... అవగాహన
వ్యక్తి తన వ్యక్తిత్వానికి అతీతంగా వస్తుతత్త్వానికి, ఉన్న విషయానికి మాలిమి అవాలి. అనుకోవడం నుంచి తెలుసుకోవడానికి పయనించాలి. అభిప్రాయం నుండి అవగాహనలోకీ చేరాలి. అనుకోవడం అంటేనే తెలివిడిలేనితనం. ‘ఇది నా అభిప్రాయం‘ అనడం ఒక మనిషి అవగాహనా రాహిత్యాన్ని తెలియజేస్తూంటుంది. విషయం, వాస్తవం, సత్యం ఇవి మనిషి మనిషికీ మారవు. అభిప్రాయాలే వేర్వేరుగానూ, రకరకాలుగానూ ఉంటాయి. ఒక విషయం గురించి ఏదో అనుకోవడం ఏమిటి? విషయాల్ని తెలుసుకోవడం లేదా తటస్థంగా ఉండడం అన్నదే సరైనది. లోకంలో ప్రతి ఒక్కరూ అభిప్రాయపడడం గొప్ప అనుకుంటూంటారు. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న 67% మధ్యతరగతి వ్యక్తులు అభిప్రాయపడుతూ బతుకుతూంటారు. అభిప్రాయాలు మనిషి అశక్తతకు, తెలివిడిలేనితనానికి వ్యక్తీకరణలు. అభిప్రాయపడడం అన్నది మధ్యతరగతి మాంద్యంగానూ, జాడ్యంగానూ ఉంది. అందువల్ల గందరగోళం తప్పితే మరొకటి ఉండదు. ఉపిరి పీల్చుకోవడం తరువాత ఒక వ్యక్తి తప్పకుండా చేసే పని అభిప్రాయపడడమే. మనుషులకు తప్పితే ఏ జంతువుకూ అభిప్రాయాలుండవు. అందుకే జంతువుల్లో లేని అశాంతి మనుషుల్లో మాత్రమే ఉంది. ‘ఇది నా అభిప్రాయం’, ‘నేను ఏమనుకుంటున్నానంటే‘, ‘నేను చెప్పేదేమిటంటే’... అనే స్థితి నుండీ, స్థాయి నుండీ మధ్య తరగతి మనిషి ఇంకా ఎదగలేదు. మనిషి అవగాహనకూ అతీతంగా తన అభిప్రాయాల వల్లా, ఏదో అనుకోవడం వల్లా తన ఎదుగుదలకు తానే అడ్డుపడుతున్నాడు. ఒక కుటుంబంలోని వ్యక్తుల అభిప్రాయాల వల్లా, ఏదేదో అనుకోవడం వల్లా ఆ కుటుంబాలు ఛిద్రమైన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. అభిప్రాయపడడం, అనుకోవడం ఒక మానసిక బలహీనత. హిట్లర్ అభిప్రాయాల వల్ల రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి మొత్తం మానవాళికి పెనుహాని జరిగింది. అభిప్రాయపడడం కూడా మూర్ఖత్వంలాగే అపాయకరమైనదే! కొన్ని సందర్భాల్లో మూఢనమ్మకంలాగా కీడు చేసేదే! నా అభిప్రాయం మేరకు అనేది ప్రపంచానికి మేలు చేసినది కాకపోగా అనర్థాల్ని కలిగించింది, మనుషుల మధ్య అంతరాల్ని పెంచింది. మనస్పర్థలను సృష్టించింది. ఈ చింతనతో ఎన్నో దశాబ్దుల క్రితం నుండీ అంతర్జాతీయ సంస్థలు ప్రపంచానికీ, మానవాళికీ అత్యవసరమయ్యే ఎన్నో ఉత్పాదనల్ని ఉత్పత్తి చేసి అందుబాటులోకి తెచ్చాయి, సగటు మనిషికి హితాన్ని చేకూర్చాయి. చూడడం, వినడం, అవగతం చేసుకోవడం, చెప్పడం ఇవి మనిషికి సరిగ్గా అలవడలేదు. వ్యక్తిగత అభిప్రాయాలూ, ఉద్దేశాల వల్ల సాటి మనిషికీ, సమాజానికీ ప్రయోజనం ఉండదు. అభిప్రాయాలు, ఉద్దేశాలు, అనుకోవడం ఇవి కాదు ఎరుక, అవగాహన, విజ్ఞతలే కావాలి. ఒకరి ఎరుక, అవగాహన మరొకరికీ, సమాజానికీ ఉపయోగపడతాయి. ఈ ప్రపంచానికి మేలు చేసినవన్నీ అవగాహనలే, వాస్తవాలే, సత్యాలే. ఒక వైద్యుడి చదువు లేదా ఎరుక మాత్రమే రోగికి అవసరమవుతుంది. ఒక అధ్యాపకుడికి ఎరుక ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థికి సరైన విద్య వస్తుంది. ’రెండు రెళ్లు నాలుగు’ అన్న ఎఱుకను మాత్రమే ఉపాధ్యాయుడు విద్యార్థికి అందజెయ్యాలి. అదే విద్యార్థికి కావాల్సింది. ఆ రెండురెళ్లు నాలుగు అన్నది అవగాహన. ఆ అవగాహనే ఒక వ్యక్తి జీవనానికి తోడ్పడేది. ఇలా ఏ విషయంలోనైనా ఎరుకవల్ల వచ్చే లేదా వచ్చిన అవగాహన మాత్రమే మేలు చేస్తుంది. అభిప్రాయం అనేది పూర్తిగా వ్యక్తిగతం. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. అభిప్రాయాలు సార్వత్రికమైనవి కావు అపై సార్వజనీనమైనవీ కావు. మనం సరిగ్గా ఉండాలంటే మనకు ఉండాల్సింది అభిప్రాయాలు కాదు అవగాహనలు. బతకడం అంటే అభిప్రాయాల్ని మోసుకుంటూ ఉండిపోవడమా? కాదు. బతకడం అంటే తెలుసుకుని అవగాహనతో సాగడం. అభిప్రాయపడడం ఒక వ్యక్తికి ఆరంభదశ కావచ్చు. కానీ వ్యక్తి అక్కడే ఉండిపోకూడదు. తన అభిప్రాయాన్ని వాస్తవం లేదా ఉన్న విషయంతో సరిపోల్చి చూసుకోవాలి. తాను అనుకున్న దానికి ఏ మాత్రం ఉనికి ఉంది అన్నదాన్ని పరిశీలించగలగాలి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒక గాయకుడు గొప్ప గాయకుడు అన్న అభిప్రాయం ఉంటే ఆ గాయకుడి సామర్థ్యాన్ని, గాయకుడి వ్యాప్తిని, తరువాతి తరం వాళ్లపై ఆ గాయకుడి ప్రభావాన్ని, పరిశీలించగలిగితే ఆ గాయకుడు గొప్ప గాయకుడు అన్న అభిప్రాయం సరైనదా కాదా అనేది తెలిసిపోతుంది. విజ్ఞానశాస్త్రవేత్తల ఆవిష్కరణలను పరిశీలిస్తే మనకు అవగాహన అన్నది ఏమిటో అర్థమై పోతుంది. విజ్ఞాన శాస్త్రవేత్తలు ఒక అభిప్రాయంతోనో, ఏదో ఒకటనుకునో మొదలుపెడతారు. ప్రయోగాలు, ఆలోచనలు, పరిశీలనలు చేస్తూ, చేస్తూ తమను తాము మార్చుకుంటూ, సరిచేసుకుంటూ ఒక దశలో వాళ్లు సరైన ఆవిష్కరణలు చెయ్యగలుతారు. ఆ ఆవిష్కరణ జరిగాక అది అవగాహన అవుతుంది. ఆ అవగాహనే లోకానికి ఉపయోగ పడేదవుతుంది. అవగాహన మనిషికి స్వేచ్ఛను ఇస్తుంది. సాటి మనిషికి, సమాజానికి మేలు చేస్తుంది. శాంతిని ఇస్తుంది. ఈ సత్యాన్ని బుద్ధిలోకి తీసుకుందాం. అభిప్రాయాలకు అతీతంగా ‘బతకడం’ నేర్చుకుందాం. అభిప్రాయపడడం ఒక వ్యక్తికి ఆరంభదశ కావచ్చు. కానీ వ్యక్తి అక్కడే ఉండిపోకూడదు. తన అభిప్రాయాన్ని వాస్తవం లేదా ఉన్న విషయంతో సరిపోల్చి చూసుకోవాలి. తాను అనుకున్న దానికి ఏ మాత్రం ఉనికి ఉంది అన్నదాన్ని పరిశీలించగలగాలి. – రోచిష్మాన్ -
భారత్ సహా 75 దేశాల్లో అలజడి
సాక్షి, న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి గుర్తించిన ప్రపంచంలోని 195 దేశాల్లో 40 శాతం దేశాల్లో, అంటే 75 దేశాల్లో అలజడి, అశాంతి పరిస్థితులు నెలకొంటాయని, అందులో భారత దేశం కూడా ఉంటుందని ‘వెరిక్స్ మ్యాపిల్‌క్రాఫ్ట్’ అనే సామాజిక, ఆర్థిక, రాజకీయ డేటా విశ్లేషణ సంస్థ అంచనా వేసింది. గతేడాది, అంటే 2019లో హాంగ్ కాంగ్, చిలీ, నైజీరియా, సుడాన్, హైతీ, లెబనాన్ తదితర 47 దేశాల్లో అలజడి, అశాంతి పరిస్థితులు నెలకొనగా 2020 సంవత్సరానికి ఆ పరిస్థితులు 75 దేశాలకు విస్తరిస్తాయని అంచనా వేసి, ఈ మేరకు వెరిక్స్ మ్యాపిల్‌క్రాఫ్ట్ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. గతేడాది ఎక్కువ అశాంతి పరిస్థితులు నెలకొన్న హాంగ్ కాంగ్, చిలీ దేశాల్లో ఈ ఏడాది కూడా అశాంతి పరిస్థితులు కొనసాగుతాయని, మరో రెండేళ్ల వరకు ఆ దేశాల్లో పరిస్థితి మెరుగు పడే అవకాశం లేదని ఆ నివేదిక పేర్కొంది. ఆ తర్వాత వెనిజులా, ఇరాన్, లిబియా, గినియా, నైజీరియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, పాలస్తీనా, ఇతియోపియా, బొలీవియా దేశాల్లో అశాంతి పరిస్థితులు నెలకొంటాయని అంచనా వేసింది. ముఖ్యంగా ప్రజలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు జరపడం వల్లనే అశాంతి పరిస్థితులు ఏర్పడతాయని, ఆయా దేశాల ప్రభుత్వాలు మానవ హక్కులను కాలరాయడమే ప్రజా పోరాటాలకు దారితీస్తుందని నివేదిక అభిప్రాయపడింది. ముఖ్యంగా నైజీరియా, లెబనాన్, బొలీవియా దేశాల్లో తీవ్ర ప్రజాందోళనలకు అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత 2020 సంవత్సరంలో భారత్ సహా ఇతియోపియా, పాకిస్థాన్, జింబాబ్వే దేశాల్లో అశాంతి పరిస్థితులు పెల్లుబికే అవకాశం ఎక్కువగా ఉందని వెరిక్స్ సంస్థ అంచనా వేసింది. భారత దేశం విషయంలో ఈ అంచనాలు ఇప్పటికే నిజం అవుతున్నట్లు నేడు పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ పట్టికకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజాందోళనలు చూస్తుంటే అర్థం అవుతోంది. అశాంతికి కారణాలను గుర్తించి ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలు దిద్దుబాటు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రశాంత పరిస్థితిలు త్వరలో ఏర్పడే అవకాశాలు లేవు. సమస్యలను పరిష్కరించడానికి కొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకర పరిస్థితులున్న దేశం ‘యెమన్’ అని వెరిక్స్ సంస్థ గుర్తించగా అది దాదాపు నిజమేనని రుజువైంది. ఇంకా అక్కడ పరిస్థితులు మెరగుపడలేదనడానికి ఆదివారం యెమన్‌లో జరిగిన ద్రోన్ దాడిలో 80 మంది సైనికులు మరణించడం గమనార్హం. ఆందోళనలకు ఆస్కారం ఉన్న 125 దేశాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితలను క్షుణ్నంగా అధ్యయనం చేసిన ఈ సంస్థ 75 దేశాల్లో ఏదోస్థాయిలో ప్రజాందోళనలు చెలరేగుతాయని అంచనా వేసింది. రష్యా, సౌదీ అరేబియా, చైనా, టర్కీ, థాయ్‌లాండ్, బ్రెజిల్ దేశాల్లో సైన్యం ఎదురుదాడుల వల్ల ఆందోళన చేసే ప్రజలకు ప్రమాదం ఉందని అంచనా వేసింది. చాలా దేశాల్లో ప్రజాందోళనల వల్ల ప్రభుత్వాలు బలహీనపడే అవకాశం ఉండగా, ప్రపంచంలో ఆందోళనకారులకు అత్యంత ప్రమాదకరమైన దేశం ‘ఉత్తర కొరియా’ అని వెరిక్స్ సంస్థ హెచ్చరించింది. చదవండి: భారత్‌పై ప్రతీకారం తీర్చుకోలేం -
‘ఘర్షణలు రెచ్చగొట్టేవారిని వదిలిపెట్టం’
షిల్లాంగ్: మేఘాలయలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఘర్షణలను కొందరు కావాలనే ప్రోత్సహిస్తున్నారని ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా ఆరోపించారు. గురువారం షిల్లాంగ్‌లో ఖాసీ పిల్లాడిపై ఒక సిక్కూ మహిళ దాడి చేయడంతో ఘర్షణలు మొదలైన సంగతి తెలిసిందే. పంజాబ్ వాసులు నివాసముంటున్న మావ్‌లాంగ్‌లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు మిగతా ప్రాంతాలకు విస్తరించాయి. కాగా, ఘర్షణలను అదుపు చేయడానికి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. నిరసనకారులకు కొంతమంది డబ్బులు, మద్యం అందిస్తున్నారని సీఎం సంగ్మా ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా ఘర్షణలను ప్రోత్సహిస్తున్న పంజాబీలను గుర్తిస్తామని ఆయన స్పష్టం చేశారు. మత ఘర్షణల పేరిట రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మేఘాలయలో క్షేత్ర స్థాయిలోని పరిస్థితులు తెలుసుకోవడానికి తమ కేబినెట్ మంత్రి సుఖ్జిందర్ సింగ్ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని పంపుతామని పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ఆదివారం ప్రకటించారు. కమిటీ నివేదిక ఆధారంగా పంజాబ్ ప్రభుత్వం స్పందిస్తుందని ఆయన తెలిపారు. మేఘాలయలోని పరిస్థితులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజు స్పందించారు. షిల్లాంగ్‌లో పరిస్థితులు బాగానే ఉన్నాయని, గురుద్వారపై ఎవరూ దాడి చేయలేదనీ, వదంతులు నమ్మొద్దని ట్వీట్ చేశారు. Beware of rumour-mongers & troublemakers. There was no damage to any Gurdwara or other institutions belonging to the Sikh Minority in Meghalaya. Law & Order situation is under control and the State Govt is extremely vigilant & settling the case. — Kiren Rijiju (@KirenRijiju) June 3, 2018 -
అనారోగ్యం... అశాంతి!?
కొందరి ఇళ్లలో ఏదో తెలియని అశాంతి నెలకొని ఉంటుంది. అలాంటి ఇళ్లలోని చిన్నారులు తరచు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. నిష్కారణంగా భయపడుతూఉంటారు. ఇంట్లోని పెద్దలకు మనశ్శాంతి లోపిస్తుంది. ఏదో తెలియని చింతతో లోలోపలే కుమిలిపోతూ ఉంటారు. దృష్టిదోషాల వల్ల, పితృదోషాల వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. వీటికి కొన్ని పరిహారాలు... సోమవారం రుద్రాభిషేకం జరిపించి, పాశుపత మంత్రంతో అభిమంత్రించిన దశముఖ రుద్రాక్షను మెడలో ధరించాలి. దీనివల్ల దోషాలు తొలగిపోతాయి.సాయంత్రం చీకటి పడిన తర్వాత మట్టిమూకుడులో ఆవుపేడతో చేసిన పిడకలకు నిప్పుపెట్టి, వాటిపై ఎండిన వేపాకులను వేసి మండించాలి. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత నిత్యపూజకు ఉపక్రమించే ముందు గోరోచనం, కుంకుమపువ్వు, పసుపు నూరి ముద్దగా చేసి తిలకంగా ధరించండి. పిల్లలకు కూడా పెట్టండి. చిన్నారులు ఊరకే భయపడుతున్నట్లయితే, వారికి సాయంత్రం వేళ ఒక నిమ్మకాయతో ఏడుసార్లు దిష్టి తీయాలి. ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా తరిగి, నాలుగు రోడ్ల కూడలి వద్ద వాటిని నాలుగు దిక్కులకు విసిరి పారేయాలి. పేద అమ్మాయిల పెళ్లికి శక్తివంచన లేకుండా ఆర్థిక సాయం చేయండి. వీలుంటే స్వయంగా కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వహించండి. దీనివల్ల పితృదోషాలు తొలగుతాయి. – పన్యాల జగన్నాథ దాసు -
డార్జిలింగ్ ఎన్కౌంటర్లో ఎస్సై మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో అలజడి రేగింది. గూర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) చీఫ్ బిమల్ గురుంగ్ మద్దతుదారులు జరిపిన కాల్పుల్లో ఒక ఎస్సై చనిపోగా, నలుగురు పోలీసులు గాయపడ్డారు. ఓ అటవీ ప్రాంతంలో గురుంగ్ దాక్కున్నాడన్న సమాచారంతో పోలీసులు శుక్రవారం అక్కడికి వెళ్లగా ఈ ఘటన జరిగింది. మృతిచెందిన ఎస్సైని అమితవ్ ముల్లిక్‌గా గుర్తించారు. పోలీసుల కాల్పుల్లో తమ మద్దతుదారులు ముగ్గురు చనిపోయారని జీజేఎం ప్రకటించింది. అదనపు డీజీపీ అనూజ్ శర్మ కోల్‌కతాలో వివరాలు వెల్లడిస్తూ...గురుంగ్ తన అనుచరులతో కలసి పాట్లిబస్ అటవీ ప్రాంతంలో దాక్కున్నాడన్న సమాచారం తమకు అందిందని చెప్పారు. వేకువజామున వారి స్థావరంపై సోదాలకు దిగిన పోలీసులపై గురుంగ్ అనుచరులు కాల్పులు జరిపారని తెలిపారు. సంఘటనా స్థలి నుంచి ఆరు ఏకే–47 తుపాకులు, 500 రౌండ్ల మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. -
విధ్వంసంలో రూ.200 కోట్ల నష్టం
సాక్షి, చంఢీఘడ్ : అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించిన అనంతరం హరియాణాలో జరిగిన విధ్వంసకాండపైన దృష్టిని కేంద్రీకరించిన మీడియా, అధికారులు పంజాబ్‌లో జరిగిన నష్టం గురించి అంతగా పట్టించుకోలేదు. పంజాబ్‌లో జరిగిన నష్టం గురించి ఇప్పుడిప్పుడే అందిన అంచనా అందర్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. దాదాపు 200 కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లిందని అధికారులు అంచనాకు వచ్చారు. అల్లర్లలో 32 మంది మరణించడం తెల్సిందే. అయితే వారిలో కూడా పది మంది పంజాబీలు ఉన్నారని తేలింది. డేరా అల్లరి మూకలు పంజాబ్‌లోని సదన్‌వాస్ గ్రామంలో విద్యుత్ కేంద్రాన్ని, గులవాన గ్రామంలో రైల్వే స్టేషన్‌ను దగ్ధం చేశాయి. బటిండాలో ఓ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్, బనవాలి, ముసాలోని రెండు పెట్రోలు బంకులను దగ్ధం చేశాయి. మానస ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ వద్ద రెండు కార్లను తగులబెట్టాయి. మానక్‌పూర్ ప్రాంతంలోని ఓ పాఠశాల ఫర్నీచర్‌ను, మలాట్‌లోని ఓ రైల్వే స్టేషన్, నంగల్ జిల్లాలో కో-ఆపరేటివ్ సొసైటీ, ఖోఖర్ కలాన్ గ్రామంలో ఓ ప్రభుత్వ గిడ్డంగిని, సంగ్రూర్‌లో పవర్ హౌజ్‌ను అల్లరి మూకలు దగ్ధం చేశాయి. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ఆదేశం మేరకు అధికారులు అల్లర్ల సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు వాటిల్లిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ప్రాథమికంగా ఈ నష్టం 200 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని భావిస్తున్నట్లు వారు మీడియాకు తెలిపారు. -
అలజడి
జీవితం అనే సాగరంలో మన ప్రయాణం కాగితపు పడవలోనే. అలలో జడి లేకున్నా... మనలో అలజడి ఉన్నా ప్రయాణం కష్టం. ఇతరుల కన్నా ముందే ఉండాలన్న అలజడి ఎన్నో జీవితాలను ముంచేస్తోంది. ముందుండాల్సింది ఇతరుల కన్నా కాదు... పోరాడాల్సింది సాటివాళ్లతో కాదు... మీ సామర్థ్యంతో మీరే ప్రతిరోజూ తలపడండి. పోరాడండి. అప్పుడు మీ ప్రతి అడుగూ ఒక ముందడుగు అవుతుంది. కాగితపు పడవలో కూడా సుదూర ప్రయాణం చేస్తారు. కాలింగ్‌బెల్ మోగింది. డైనింగ్ టేబుల్ మీదే తలపెట్టి నిద్రపోతున్న కీర్తి లేచి టైమ్ చూసింది. అర్థరాత్రి దాటింది. డోర్ తీసింది. ఎదురుగా భర్త వంశీ. గుమ్మంలోనే ప్రశ్నించింది కీర్తి. ‘‘కనీసం ఈ ఒక్కరోజైనా ఇంటికి త్వరగా రావచ్చు కదా. ఎప్పుడూ పని పని.. అంటారు. ఈ రోజు దినేష్ బర్త్ డే అనైనా గుర్తుందా. వాడు ఇంత సేపు చూసి చూసి కేక్ కట్ చేయకుండా అలాగే నిద్రపోయాడు..’’ బాధగా అంది కీర్తి.‘‘ఈ పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేసినా ఇంకా వెనకపడిపోతాం. కష్టపడితేనే కదా విజయం సాధించేది. నీకిది చెప్పినా అర్థం కాదు. కేక్ కట్ చేయడమేగా. చేసేయాల్సింది..’’ సింపుల్‌గా అంటూ వెళ్లి పడుకున్నాడు వంశీ. నీళ్లు నిండిన కళ్లతో అలాగే చూస్తూ ఉండిపోయింది. టేబుల్ మీద అలాగే వదిలేసిన కేక్ తీసి ఫ్రిజ్‌లో పెట్టింది. పోటీలో వెనకపడిపోతే... ఆఫీస్ లిఫ్ట్‌డోర్ తెరిచీ తెరుచుకోకముందే లోపలికి పరిగెత్తాడు వంశీ. అంతే వేగంగా తన క్యాబిన్‌కి వెళ్లి సీట్లో కూర్చుని, సిస్టమ్ ఆన్ చేశాడు. ఆయాసంతో గుండె పట్టేసినట్టయింది. రొప్పుతున్నాడు. ఇక కుర్చీలో కూర్చోలేననిపించింది. తప్పనిసరై హాస్పిటల్‌కి వెళ్లాడు. డాక్టర్ పల్స్ చెక్ చేసి ‘‘ఎందుకంత అలజడి పడుతున్నారు. హైబీపి ఉంది. రోజుకి ఎన్నిగంటల పనిచేస్తారు’’ అన్నాడు. ‘‘కనీసం 18 నుంచి 20 గంటలు. ఎందుకలా అడిగారు?’’ అన్నాడు వంశీ ‘‘అలా మిషన్లా పనిచేస్తే ఆరోగ్యం ఇలాగే ఉంటుంది. కొంచెం విశ్రాంతి తీసుకోండి’’ అంటున్న డాక్టర్ని వారిస్తూ.. ‘‘అలా అయితే ఈ పోటీ ప్రపంచంలో బతగ్గలమంటారా?’’అంటూనే లేచి వెళ్లడానికి నాలుగడుగులు వేసి, కళ్లు తిరిగి కిందపడిపోయాడు. ఫైళ్లతోనే కుస్తీ ఫోన్లో సమాచారం తెలియగానే కీర్తి అన్నయ్య రఘు వచ్చాడు. అన్నను చూడగానే ఏడుపు ఆగలేదు కీర్తికి. ‘‘ఆరోగ్యం పాడుచేసుకునేంతగా ఏమైంది?’’ అని అడిగాడు చెల్లెలిని. ‘‘ఇరవై నాల్గంటలూ పని పని అంటూ ఆఫీసులోనే ఉంటున్నాడు. ఇంట్లో ఉన్నా ఆఫీసుకు సంబంధించిన ఫోన్లు, ఫైళ్లతోనే ఉంటాడు. నన్నూ, దినేష్‌ను పూర్తిగా మర్చిపోయాడు. తన తిండి, నిద్ర గురించి కూడా పట్టించుకోవడంలేదు. ఎప్పుడూ మనిషికి ఆందోళనే. అదేమని అడిగితే ‘పనిలో ఉంటున్నాను కదా. పోటీకి తగ్గ స్పీడ్ లేకపోతే ఎలా?’ అంటున్నాడు. చెబితే కోపం, చెప్పకపోతే ఏమైపోతాడో అని భయం. ఎలా చక్కదిద్దాలో అర్థంకావడంలేదన్నయ్యా!’’ ఏడుస్తూనే తమ పరిస్థితి అంతా వివరించింది కీర్తి. శ్రమలోనే కాలమంతా! కౌన్సెలర్ ముందున్నాడు వంశీ. ఈ జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే రిగ్రెషన్ థెరపీ ఒక గైడెన్స్‌లా ఉపయోగపడుతుందని నచ్చజెప్పి వంశీని రిగ్రెషన్ థెరపీకి తీసుకొచ్చాడు రఘు. కళ్లు మూసుకొని మౌనంగా ధ్యానముద్రలో ఉన్న వంశీకి కౌన్సెలర్ సూచనలు ఇవ్వడం ప్రారంభించారు. ఆ సూచనలతో మెల్లగా తన జీవితాన్ని అర్థం చేసుకునే దిశగా ప్రయాణం మొదలుపెట్టాడు వంశీ. కంపెనీలో తను. తన అవసరానికి మించి పనిచేస్తున్నాడు. కింది ఉద్యోగులను బాగా పనిచేయాలని, ఎక్కువ గంటలు పనిచేయాలని గైడ్ చేస్తున్నాడు. అటు నుంచి గతంలో చేసిన ఉద్యోగాల జాబితా పరిశీలించాడు. అంతటా తన తోటివారందరిలోనూ ముందుండాలని ఎక్కువ శ్రమిస్తున్నాడు. అయినా, తనకన్నా తక్కువ గంటలు పనిచేసేవారే ముందుంటున్నారు. కాలేజ్, స్కూల్ రోజుల్లో తను అందరికన్నా ముందుం డాలని అనిపించుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాడు. ఎందుకు? అన్వేషణ మొదలైంది. ఆ శోధనలో బాల్యదశలో ఒక చోట ఆగిపోయాడు వంశీ. కాసేపు ఆగి చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘నేను మూడు, అన్నయ్య ఐదవ తరగతి చదువుతున్నాం. మేమిద్దరం నాన్న ముందు నిల్చుని ఉన్నాం. నాన్నకు మా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చాం. నాన్న అన్నయ్యను మెచ్చుకుంటున్నాడు. తన జేబులో ఉన్న పెన్ను తీసి అన్నయ్య జేబులో పెట్టి, ‘నా పేరు నిలబెట్టేది నువ్వేరా’ అని ముద్దులు పెడుతున్నాడు. ‘మరి నాకు పెన్ను’ అన్నాను. ‘అన్నయ్యకన్నా మార్కులు ఎక్కువ తెచ్చుకో, అప్పుడు చూద్దాం’ అని వెళ్లిపోయాడు నాన్న. కష్టపడి చదవాలని అప్పుడే అనుకున్నా. అమ్మ అన్నానికి పిలిచినా వెళ్లకుండా చదువుతున్నాను. రాత్రిళ్లు కరెంట్ పోయినా దీపం పెట్టుకొని చదువుతున్నాను. నెక్ట్స్ క్లాస్‌కి స్కూళ్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ అన్నయ్యకే ఎక్కువ మార్కులు వచ్చాయి. నేను ఇంకా ఎక్కువ కష్టపడి చదువుతున్నాను’’ అంటూ ఆగిపోయాడు వంశీ. ‘‘ఇంకా వెనక్కి ప్రయాణించండి. ఆ ప్రయాణంలో మిమ్మల్ని అమితంగా బాధించిన సంఘటన ఏదున్నా చెప్పండి’’ అన్నారు కౌన్సెలర్. వంశీ ప్రయాణం ఇంకా వెనక్కి తిరిగింది. వంశీ చెబుతున్నాడు ‘‘నేను, అమ్మ గర్భంలో నుంచి అప్పుడే బయటకు వచ్చాను. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. నన్ను చూడ్డానికి వచ్చిన నాన్న ‘వీడేంటి ఇంత నల్లగా పుట్టాడు. పెద్దోడిది మంచి రంగు’ అంటున్నాడు. ఆయన చూపులు నన్ను అసహ్యించుకున్నట్టు ఉన్నాయి. అన్నీ సక్రమంగా ఉంటేనే ముందంజనా! ‘‘వంశీ, మీరు ఇప్పుడు అమ్మ గర్భంలో నుంచి మీ గత జన్మలోకి ప్రయాణిస్తున్నారు. ఆ గతం తాలూకు అవశేషం ఎక్కడుందో చూడండి’’ అన్నారు కౌన్సెలర్. తల్లి గర్భంలో.. అటు నుంచి గతజన్మలోకి వంశీ ప్రయాణం సాగింది. ఆ అవశేషం గురించి వంశీ చెబుతూ ‘‘నేను అంధుడిని. రోడ్డుదాటలేకపోతున్నాను. ఎవరో వచ్చి నన్ను రోడ్డు దాటిస్తామన్నారు. అప్పుడు నాకు చాలా బాధ వేసింది. అందరూ పరిగెడుతున్నారు. కనీసం నేను రోడ్డు కూడా దాటలేకపోతున్నాను. దేవుడు నన్ను ఎందుకిలా పుట్టించాడు. అన్నీ సక్రమంగా ఉంటే అందరి కన్నా ముందుండేవాడిని. జీవితమంతా ఆ బాధతోనే గడిపాను. అలాగే మరణించాను’’ చెబుతున్న వంశీ గుండె నీరైంది. పోటీ మీద అవగాహన ‘‘వంశీ ఈ జన్మకు రండి. ప్రస్తుత పరిస్థితికి గత సంఘటనలకు బేరీజు వేసుకొని చూడండి’’ అంటూ కౌన్సెలర్ సూచనలు ఇవ్వడం మొదలుపెట్టారు. ‘‘వంశీ, మీ జీవనప్రయాణంలోని స్పష్టత మీద దృష్టి పెట్టండి. మొదటిది: ‘అన్నయ్య కన్నా నేను తక్కువ’ అనే భావన మీలో ఎనిమిదేళ్ల వయసులో పడిపోయింది. దీంతో మెప్పు కోసం పోటీ పడాలని నిర్ణయించుకొని కష్టపడటం మొదలుపెట్టారు. మీ కష్టంలో ‘నాలో సామర్థ్యం తక్కువ’ అనే ఆలోచన బలంగా పడిపోయింది. సామర్థ్యాన్ని మెరుగుపెట్టుకుంటే మీ అన్నకన్నా నాలుగు మార్కులు సంపాదించడం పెద్ద కష్టమయ్యేది కాదు. ఇప్పుడు మీరు చేస్తున్నపని కూడా సామర్థ్యంతో కాకుండా కష్టంతో లాక్కొస్తున్నారు. రెండవది: నల్లగా పుట్టానని, అందంగా ఉన్నవారితో పోటీపడలేననే భయాన్ని పెంచుకున్నారు. నల్లగా ఉన్న వారెంతో మంది సాధించిన విజయాలు ఇన్నేళ్లలో మీకు కనిపిం^è లేదా! అవగాహనకు రండి. శ్రీకృష్ణుడు నల్లగానే పుట్టి, అవతారపురుషుడయ్యాడనీ మీకూ తెలుసు కదా. మూడవది: అంధుడిగా గత జన్మ అంతా బాధపడ్డారు. బాగుంటే అందరితో పోటీ పడి, వేగంగా పరిగెత్తేవాడిని అనుకున్నారు. అంధులుగా ఉన్నవారు కూడా ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. వాళ్లు సాధించిన విజయాలను ఒకసారి పరిశీలించండి. ‘నేను ఇలా కాకుండా ఇంకోలా ఉండి ఉంటే’ అనుకోకుండా ‘మేధస్సుతో సాధించగలను’ అని నిర్ణయం తీసుకోండి. అందరితో కాకుండా మీతో మీరు పోటీ పడండి. కష్టంగా కాదు, ఇష్టంగా జీవించండి’’ కౌన్సెలర్ మాటలతో ప్రశాంతంగా మేలుకొన్నాడు వంశీ! ఇప్పుడు అతడికి హాయిగా ఉంది. తుఫాను తీరిన సముద్రంలా ఉన్నాడతను. జీవితం సమతూకం.. కాలింగ్‌బెల్ మోగడంతో వెళ్లి డోర్ తీసింది కీర్తి. ఎదురుగా వంశీ! నమ్మబుద్ధికాక గడియారం కేసి చూసింది, సాయంత్రం ఆరు. హోమ్‌వర్క్ చేసుకుంటున్న దినేష్ తండ్రి చూసి ఆనందంగా ‘డాడీ..’ అంటూ పరిగెత్తుకువచ్చి తండ్రిని చుట్టేశాడు. ‘పని ఎప్పుడూ ఉండేదే. ఇవాళ సినిమాకెళ్దామా’ అంటూ సరదాగా మాట్లాడుతున్న భర్తను ఆశ్చర్యంగా చూస్తూండిపోయింది కీర్తి. ‘‘ఇలాగే ఉంటే ఎలా సినిమాకు లేట్ అయిపోతుంది పద పద..’’ అని తొందరపెడుతున్న వంశీని చూసి తమ జీవితాల్లోకి వసంతం వచ్చేసిందని సంబరపడిపోయింది కీర్తి. మన వాస్తవ పరిస్థితులకు మనమే సృష్టికర్తలం ‘యద్భావం తద్భవతి’ అంటే ఏది ఆలోచిస్తున్నామో అదే జరుగుతుంది. తమ వాస్తవ పరిస్థితులకు తామే సృష్టికర్తలం అని గ్రహిస్తే సమస్యలుగా అనిపించినవన్నీ పరిష్కారమవుతాయి. అన్నింటా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఆలోచనలను నమ్మకాలవైపు పయనింపజేయాలి. అదెలాగంటే, చిత్రకారుడు తెల్లని కాన్వాస్‌పై అద్భుతమైన చిత్రం వేయడానికి ఎంతటి బాధ్యత తీసుకుంటాడో ఎవరికి వారు తమ జీవితాన్ని మలచుకోవడంలో అలా స్వీయ బాధ్యత తీసుకోవాలి. – డాక్టర్ న్యూటన్, పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్ సామర్థ్యాల పెంపుకు కృషి అవసరం చెడు ఆలోచనలకు బలం ఇస్తే అలాంటి వాస్తవమే మనం చూస్తాం. దీంతో మన చుట్టూ అలాంటి వాతావరణమే ఉందనుకుంటాం. వంశీ ఆలోచనలో ఎప్పుడూ ‘అందరికన్నా ముందుండాలి’ అనుకునే వాడు. అయితే, ఆ పోటీని సామర్థ్యంతో కాకుండా, సమయంతో లెక్కించాడు. దీంతో జీవితంలో బ్యాలెన్స్ కోల్పోయాడు. ఆరోగ్యం దెబ్బతింది. కుటుంబంలో సమస్యలు తలెత్తాయి. మన ఆలోచనలను గమనించి, సరైనదారిలో సామర్థ్యాలను పెంచుకున్నప్పుడే విజయం. – డాక్టర్ లక్ష్మి, పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్ అపనమ్మకాలను నమ్మకాలవైపుగా మళ్లించాలంటే... ఏదైనా చెడు ఆలోచన, అపనమ్మకం వంటివి కలిగినప్పుడు దానికి పూర్తి వ్యతిరేక ఆలోచనను పేపర్‌మీద రాయండి. ఇది మీలో ఒక శక్తివంతమైన ఆలోచనవుతుంది.మీకు అనుకూలమైన నిర్ణయాలను రాస్తూ ఉండండి. ఉదాహరణకు: నేను చాలా బాగున్నాను. నేను చేయగలను. నేను సాధించగలను.. ఇలాంటివి స్వీయ ఆనందం, ఆరోగ్యం, చుట్టూ అనుబంధాలు ఏవిధంగా ఉంటున్నాయో గుర్తించివీటి పట్ల ఉంటున్న అపనమ్మకాలను నమ్మకం వైపుగా మల్లించాలి.సినిమా దృశ్యం మాదిరి జీవితాన్ని కళ్లతో అత్యద్భుతంగా ఉన్నట్టు దర్శించాలి. అనుకూలంగా లేని సంఘటనలను చిత్రాలుగా ఊహించుకొని అవన్నీ చాలా బాగవుతున్నట్టు ఊహించాలి.రోజూ 30–40 నిమిషాలు ధ్యానం చేయాలి. దీని వల్ల చెడు ఆలోచనలు మంచివైపుగా ప్రయాణిస్తాయి.విశ్రాంతి లేకపోవడం, ఆందోళనలు, భయాలు అన్నీ ధ్యానంలో కరిగిపోతాయి. పాజిటివ్ ఆలోచనలకు దారి తీసి, ఆత్మవిశ్వాసాన్ని, వికాసాన్ని ధ్యానం పెంపొందింపజేస్తుంది. – నిర్మల రెడ్డి చిల్కమర్రి -
ఉత్కృష్టసోమం–అగ్నిష్టోమం
సమాజంలో పెచ్చరిల్లుతున్న అశాంతిని, అసంతృప్తిని తొలగించి, లోకకల్యాణం చేకూర్చేందుకు, సనాతన సంస్కృతీ సంప్రదాయాలను నిలబెట్టేందుకు 23 సోమవారం నుంచి 28 శనివారం వరకు ‘ఉత్కృష్ట సోమయాగం’ జరగనుంది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లిలో బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్యసోమయాజులు బ్రహ్మత్వంలో... మాడుగుల భవానీ శశిభూషణ శర్మ దంపతుల యాజమాన్యంలో ఈ బృహద్యజ్ఞం జరుగుతోంది. కృష్ణానదీ తరంగాలపై వీచే గాలి సోకినా చాలు. పాపాలన్నీ నశించి విష్ణులోకాలను పొందుతారని పురాణాలు పేర్కొన్నాయి. అటువంటి పవిత్ర కృష్ణానదీ తీరాన్ని ఆనుకొని ఉన్న బీచుపల్లి క్షేత్రం ఈ చారిత్రక యాగానికి వేదికవడం ముదావహం. గతంలో ఈ ప్రాంతమంతా విరివిగా శ్రౌతయాగాలు జరిగేవి. ఈ ప్రాంతంలోనిశ్రౌతపండితులు దక్షిణభారతదేశంలో అగ్రగాములుగా ఉండేవారని చరిత్ర. అటువంటి చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో వందేళ్ల తర్వాత ఈ సోమయాగం... శ్రౌతయాగ రక్షణలో ‘శ్రుతి సంవర్ధినీ’ మరుగున పడుతున్న వైదిక సంస్కృతిని పరిరక్షించాలనే లక్ష్యంతో, శ్రౌతధర్మం పట్ల అందరికి అవగాహన కలిగించి శ్రౌతయజ్ఞాలలోని ఆచార, సంప్రదాయాలను నేటి తరానికి అందించాలనే తపనతో మూడేళ్ల క్రితం ఏర్పాటయిన శ్రుతి సంవర్ధినీ సభ ఇప్పుడు ఈ యాగాన్ని నిర్వహిస్తోంది. మహాతపశ్శాలులైన ద్రష్టలు లోకాతీతదృష్టిని సంపాదించి మానవునికంటే ఉత్తమమైన శక్తులున్నాయని చాటిచెప్పారు. అటువంటి శక్తులు సాకారమైనా, నిరాకారమైనా కావచ్చు. ఈ ప్రపంచంలో నిలబడడంలో వాటి సహకారం ఎంతైనా అవసరం. ఆ శక్తులనే మనం దేవతలని పిలుచుకుంటున్నాం. అటువంటి దేవతలకు కృతజ్ఞతా పూర్వకమైన బుద్ధితో చేసేదే యజ్ఞం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ ఐదింటిని కలిపి పంచభూతాలని అంటారు. ప్రకృతికి ఈ పంచభూతాలే ముఖ్యకారణాలు. అటువంటి పంచభూతాలలో అగ్ని మూడవది. యజ్ఞయాగాది క్రియలలో ముందుగా కావలసింది అగ్నిదేవుడే! ‘అగ్నిముఖావైదేవా’. అన్న వాక్యానుసారం దేవతలకు ఏది సమర్పించాలన్నా దాన్ని అగ్నిముఖంగా ఇవ్వాల్సిందే. అలా ఇచ్చినవాటినే దేవతలు స్వీకరిస్తారు. దీనినే యజ్ఞమని అంటారు. యజ్ఞాలు శ్రౌతయజ్ఞాలని, స్మార్తయజ్ఞాలనీ రెండురకాలు. వీటిలో వేదోక్తమైన శ్రౌతయజ్ఞాలకు విశేష ప్రాధాన్యత ఉంది. వాటిలోనిదే అగ్నిష్టోమం. సోమయాగం అంటే ఏమిటి? విశ్వంలో ప్రాణులు బతకడానికి కావలసిన అన్నం, నీరు, గాలి, మొదలైన వాటిని ప్రసాదించే దేవతలకు కృతజ్ఞతాపూర్వకంగా హవిస్సులను సమర్పించి వారిని ఆరాధించాలి. ‘‘దేవేభ్య ఇదం నమమ–నేను సమర్పించిన ఈ హవిస్సు ఆయా దేవతలకు చెందుతుంది. ఇందులో నాది ఏమీలేదు’’ అన్న భావనతో స్వార్థాన్ని విడచి సమస్త పాపాలను తొలగించుకొని చిత్తశుద్ధిని పొందుతాం. ఈ విధంగా సర్వదేవతల స్వరూపుడైన పరమేశ్వరుణ్ని తృప్తిపరచి, తద్వారా దేవ ఋణం నుంచి విముక్తుడవడమే ఈ యాగ ముఖ్య ఉద్దేశ్యం. అన్ని యాగాలలో సమర్పించే పురోడాశం, నెయ్యి, పాలు, పెరుగు మొదలైన హవిస్సులేగాక, అమృతలత జాతికి చెందిన ‘సోమలత’ అనే ప్రధానమైన హవిస్సును నలుగురు ఋత్విక్కులు మంత్రోక్తంగా దంచి, ముద్దను ఒక బట్టలో పెట్టి దానిని పిండి ఆ రసాన్ని గ్రహ, చమస అనే పేరుతో ఉన్న పాత్రలలోకి తీసుకుంటారు. అనంతరం దీనిని యాగంలో సమర్పిస్తారు. ఈ సోమరసాన్ని అగ్నిలో ఆహుతి ఇచ్చినప్పుడు ఆ యాగ దేవతయిన ఇంద్రుడు తృప్తిచెంది, ప్రజలకు బలాన్ని, కీర్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించి, క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే ఈ యజ్ఞాలూ, యాగాలూ. యజ్ఞయాగాల వల్ల వాతావరణ కాలుష్యం తగ్గి, వర్షాలు కురుస్తాయని, భూగర్భజలాలు పెరిగి, పంటలు బాగా పండుతాయని సైన్సుపరంగా కూడా రుజువైంది. ఈ అగ్నిష్టోమయాగంలో త్రివృత్, పంచదశ, సప్తదశ, ఏకవిగంశములనే నాలుగు రకాల స్తోత్రాలు, సామగాన రూపకాలైన పన్నెండు స్తోత్రాలు ఉన్నందువల్ల దీనికి జ్యోతిరగ్నిష్టోమం అని పేరు. అగ్నిష్టోమమనే యజ్ఞాయజ్ఞియ స్తోత్రంతో ఈ యాగం పూర్తి అవుతున్నందున దీనికి ‘అగ్నిష్టోమం’ అనే పేరు సార్థకమైంది. అగ్నిష్టోమానంతరం సంతానార్థులకోసం పుత్రకామేష్ఠి యాగం నిర్వహిస్తున్నారు. – అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని వేదపండితులు -
అహంకారం చీకటికన్నా ప్రమాదకరం
దురహంకారం, మూర్ఖత్వం కవలపిల్లలు. విషాదమేమిటంటే తన మూర్ఖత్వమే తనకు గొయ్యి తవ్వుతుందన్నది దురహంకారికి తెలియదు. ఈజిప్టు చక్రవర్తి ఫరో దురహంకారి, పరమమూర్ఖుడు కూడా! అక్కడ నాలుగొందల ఏళ్లుగా బానిసలుగా దుర్భర జీవితాన్ననుభవిస్తున్న ఇశ్రాయేలీయులను మోషే నాయకత్వంలో విడుదల చేయించడానికి దేవుడే పరోక్షంగా ఫరో మూర్ఖత్వం, దురహంకారంతో పోరాడవలసి వచ్చింది. ఇశ్రాయేలీయులు అక్కడ బానిసలే అయినా తమ ప్రతిభాపాటవాలతో, శ్రమతో ఈజిప్టు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. వాళ్లు దేశం వదిలివెళ్లిపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్న భయంతో ఫరో వారిని విడుదల చేయడానికి ససేమిరా అన్నాడు. ఈజిప్టు ప్రజలు, జంతువుల తొలి సంతానాన్ని దేవుడు హతం చేయడంతో ఫరో దిగి వచ్చి ఇశ్రాయేలీయులను పోనిచ్చాడు. అయితే దేవుడు దూరదృష్టితో వారిని కనానను దేశానికి దర్గరి దారిలో కాక, ఎర్రసముద్రం అడ్డుగా ఉన్న చుట్టు దారిలో నడిపించాడు (నిర్గమ 13: 17,18). ఇశ్రాయేలీయులను వదిలినట్టే వదిలి మనసు మార్చుకొని మూర్ఖత్వంతో వారి సంహారానికి ఫరో తన సైన్యంతో బయలుదేరాడు. ముందు సముద్రం, వెనుక ఫరో సైన్యంతో ముందు నుయ్యి, వెనుక గొయ్యిలో ఉన్న ఇశ్రాయేలీయులకు, సముద్రాన్ని రెండు పాయలు చేసి మధ్యలో దారిని ఏర్పరచి, దేవుడు వారిని ముందుకు నడిపించాడు. అంతదాకా ఇశ్రాయేలీయులకు నీడనిస్తూ, దారి చూపిస్తున్న మేఘస్తంభాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఫరో సైన్యానికి మధ్యలో పెట్టాడు. అకారణంగా వారిని తరుముతూ వస్తున్న ఫరో సైన్యానికి తాము ఎర్ర సముద్రంలోకి వచ్చామన్నది తెలియలేదు. ఇశ్రాయేలీయులంతా సముద్రపు దారిని దాటేటప్పటికి ఫరో సైన్యం ఆ దారిలో సముద్రం మధ్యలో ఉంది. దేవుడు తిరిగి మేఘస్తంభాన్ని తొలగించి ఇశ్రాయేలీయులకు ముందు పెట్టినప్పుడు కాని ఫరోకు తామెంత ప్రమాదంలో చిక్కుకున్నామో అర్థం కాలేదు. కాని తప్పించుకునే మార్గం లేదు. దేవుడు సముద్రజలాల్ని యధాతథం చేయడంతో ఫరో, అతనితో పాటున్న వేలాదిమంది సైనికులు జలసమాధి అయ్యారు. అలా ఇశ్రాయేలీయులకున్న శత్రుభయమనేది లేకుండా పోయింది. ఈ ఉదంతం రెండు విషయాలు స్పష్టం చేస్తుంది. దగ్గరి దారులుండగా వాటిని కాదని దేవుడు చుట్టు దారిన నడిపిస్తున్నాడన్నా, ఎదురుచూస్తున్న ఆశీర్వాదాన్నివ్వడంలో ఆలస్యం చేస్తున్నాడన్నా, దాంట్లో ఒక మహాగొప్ప ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడన్నది మొదటి విషయం. తాను బలవంతుడనని దురహంకారంతో ఎంత విర్రవీగినా దేవుడు తలుచుకుంటే చివరికి మట్టి కరిచి చరిత్రహీనుడు కాక తప్పదన్నది రెండవ అంశం. ప్రతికూలత ఎదురైనప్పుడు, ఒత్తిడి పెరిగినప్పుడు, అనుకున్నవి అనుకున్నట్లుగా సాగనప్పుడు కృంగిపోకుండా, దేవుడు చుట్టుదారిలో నడిపించినా తుదకు ఆశీర్వాదకరమైన గమ్యానికే చేర్చుతాడని మనం నమ్మాలి. ఫరో బలం ముందు బానిసలైన ఇశ్రాయేలీయులెంత? కాని ఇశ్రాయేలీయుల వెనుక దేవుని బలం ఉన్నదని, ఆ బలాన్ని తానెదుర్కోలేనన్న వివేచనను ఫరో తన దురహంకారం కారణంగా కోల్పోయి దిక్కులేని వాడిలాగా దుర్మరణం చెందాడు. రాత్రి చీకటున్నా పగలు వెలుగుంటుంది. కాని దురహంకారి జీవితంలో పగలు, రాత్రి కూడా చీకటే, అనుక్షణమూ అశాంతే! ఫరో దురహంకార నిర్ణయానికి వేలాదిమంది సైనికులు బలైనట్టే, కొందరు నాయకుల మూర్ఖత్వం, దురహంకారం మొత్తం దేశాన్ని అశాంతిమయం చేయడం ఇప్పుడూ చూస్తున్నాం. కొండను కూడా పెకిలించగల శక్తి మంచితనానిది, మృదుత్వానిదైతే, ఉన్నట్టుండి కొండంత అశాంతికి గురి చేసే శక్తి దురహంకారానిది!! – రెవ.డాక్టర్.టి.ఎ. ప్రభుకిరణ్ -
‘నేను ఇక పోలీసుగా ఉండలేను’
శ్రీనగర్: ఉత్తర కశ్మీర్ లోని సోపోర్ ప్రాంతంలో అల్లరిమూకలు తమ ఇంటిపై దాడి చేయడంతో ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులు తమ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తాము ఉద్యోగాలు చేయలేమని ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్ లో అశాంతి కారణంగా పోలీసు అధికారులు రాజీనామా చేయడం ఇదే మొదటిసారి. 'నా ఇంటిపై దాడి చేయడంతో నేను రాజీనామా చేస్తున్నా. నేనిక పోలీసుగా ఉండలేను. కుటుంబమంతా నాపై ఆధారపడివుంది. ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకున్నాను. ఇక పోలీసులతో ఉండడని ఇక్కడి ప్రజలకు నేను చెప్పాదలుచుకున్నా’నని ఎస్పీవో వసీమ్ అహ్మద్ షేక్ పేర్కొన్నాడు. వీరి రాజీనామాలపై పోలీసులు మౌనం దాల్చారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాది బుర్హాన్ వాని ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్ లో తలెత్తిన అలర్లలో 68 మంది మృతి చెందారు. 5 వేల మందిపైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. అల్లరిమూకల రాళ్లదాడిలో పెద్ద సంఖ్యలో పోలీసులు గాయపడ్డారు. పలువురు పోలీసుల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. -
రాజ్యసభలో విపక్షాల ఆందోళన
-
రాజ్యసభలో విపక్షాల ఆందోళన
ఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో దళితులపై దాడి అంశంపై బుధవారం రాజ్యసభ దద్దరిల్లింది. ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని నినాదాలు చేస్తూ విపక్షాల ఎంపీలు పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. గోసంరక్షణ పేరుతో దళితులపై దాడులు చేయడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు అనుకూలమైన ప్రభుత్వంగా చెప్పుకుంటున్న బీజేపీ పాలనలో మధ్యప్రదేశ్‌లో బీఫ్ పేరుతో మహిళపై దాడి జరగడాన్ని బీఎస్పీ నాయకురాలు మాయావతి తీవ్రంగా ఖండించారు. కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సమాధానమిస్తూ.. దేశంలో దళితులపై ఎక్కడ దాడులు జరిగినా సమర్థించబోం అని స్పష్టం చేశారు. బాధ్యులపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. -
రాజ్‌నాథ్ అమెరికా పర్యటన రద్దు
-
ఇంకా చల్లారని టీమిండియా ఓటమి సెగలు
శ్రీనగర్: టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమి శ్రీనగర్ లో సెగలు పుట్టిస్తోంది. విద్యార్థుల మధ్య మ్యాచ్ ఓటమి విషయంలో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతోంది. నిన్న శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) లో జరిగిన ఘర్షణ నేపథ్యంలో... పరిస్థితులను అధ్యయనం చేయడానికి కేంద్రం ఇద్దరు వ్యక్తులతో కూడిన టీంను బుధవారం అక్కడకు పంపింది. నిట్ లో నాన్ లోకల్ విద్యార్థులు మూడు రంగుల జెండాలు చేతిలో పట్టుకుని పరీక్షలను వాయిదా వేయాలంటూ మంగళవారం భారీ ఎత్తున నిరసనలు తెలిపారు. వారు మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు పోలీసుల పైకి రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘర్షణలో పలువురు అధికారులతో పాటూ విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో భారీ ఎత్తున పోలీసులు, బెటాలియన్లను అక్కడ మోహరించారు. ' శ్రీనగర్ ఎన్ఐటీ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరీక్షల గురించి ప్రభుత్వం చూసుకుంటుంది' అని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ పేర్కొన్నారు. మరోవైపు ఎన్ఐటీలో పరిస్థితులపై జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీతో మాట్లాడి తెలుసుకున్నట్లు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామని ముఫ్తీ హామీ ఇచ్చారని రాజ్ నాథ్ ట్విట్ చేశారు. కాగా టీ-20 వరల్డ్ కప్ సెమీస్ లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఓటమి పాలవ్వడంతో శ్రీనగర్ నిట్‌లో కశ్మీర్ స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య గొడవ తలెత్తిన విషయం తెలిసిందే. టీమిండియా ఓడిపోగానే స్థానిక విద్యార్థులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి భారత వ్యతిరేక నినాదాలు, పాక్ అనుకూల నినాదాలు చేశారు. దాంతో స్థానికేతర విద్యార్థులు భారత అనుకూల, పాక్ వ్యతిరేక నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఇది రెండు వర్గాల మధ్య గొడవకు కారణమైంది. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. ఆ తర్వాత మళ్లీ శుక్రవారం కూడా మరోసారి గొడవలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.