బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హింసాయుత ఘటనలు చోటుచేసుకుంటుండటంతో 4,500 మందికి పైగా భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇదేవిధంగా నేపాల్ నుండి 500 మంది, భూటాన్ నుండి 38 మంది, మాల్దీవుల నుండి ఒకరు భారతదేశానికి చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్ భారత పౌరుల భద్రతపై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 4,500 మందికి పైగా భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఢాకాలోని భారత హైకమిషన్, చిట్టగాంగ్, రాజ్‌షాహి, సిల్హెట్, ఖుల్నాలోని అసిస్టెంట్ హైకమిషన్లు భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు సహాయం అందిస్తున్నాయి. భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులు, విమానాశ్రయాలకు భారత పౌరులు సజావుగా వెళ్లేలా చూసేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.
బంగ్లాదేశ్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలలో ఇప్పటికీవున్న భారతీయ విద్యార్థులు, ఇతర భారతీయులతో భారత హైకమిషన్ టచ్‌లో ఉంది. బంగ్లాదేశ్‌లో మొత్తం 15 వేల మంది భారతీయ పౌరులు ఉన్నారని, ఇందులో 8,500 మంది విద్యార్థులు ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయిన తమిళులను ఆదుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్న నేపథ్యంలో సరిహద్దు భద్రతా దళం భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిఘాను మరింతగా పెంచింది.
Update on return of Indian Nationals in Bangladesh: So far, over 4500 Indian students have returned to India. The High Commission has been making arrangement for security escort for safe travel of Indian nationals to the border-crossing points. 500 students of Nepal, 38 of Bhutan… pic.twitter.com/XNmCYYz7U0
— ANI (@ANI) July 21, 2024
Comments
Please login to add a commentAdd a comment