
కొందరి ఇళ్లలో ఏదో తెలియని అశాంతి నెలకొని ఉంటుంది. అలాంటి ఇళ్లలోని చిన్నారులు తరచు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. నిష్కారణంగా భయపడుతూఉంటారు. ఇంట్లోని పెద్దలకు మనశ్శాంతి లోపిస్తుంది. ఏదో తెలియని చింతతో లోలోపలే కుమిలిపోతూ ఉంటారు. దృష్టిదోషాల వల్ల, పితృదోషాల వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. వీటికి కొన్ని పరిహారాలు... సోమవారం రుద్రాభిషేకం జరిపించి, పాశుపత మంత్రంతో అభిమంత్రించిన దశముఖ రుద్రాక్షను మెడలో ధరించాలి. దీనివల్ల దోషాలు తొలగిపోతాయి.సాయంత్రం చీకటి పడిన తర్వాత మట్టిమూకుడులో ఆవుపేడతో చేసిన పిడకలకు నిప్పుపెట్టి, వాటిపై ఎండిన వేపాకులను వేసి మండించాలి. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత నిత్యపూజకు ఉపక్రమించే ముందు గోరోచనం, కుంకుమపువ్వు, పసుపు నూరి ముద్దగా చేసి తిలకంగా ధరించండి. పిల్లలకు కూడా పెట్టండి.
చిన్నారులు ఊరకే భయపడుతున్నట్లయితే, వారికి సాయంత్రం వేళ ఒక నిమ్మకాయతో ఏడుసార్లు దిష్టి తీయాలి. ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా తరిగి, నాలుగు రోడ్ల కూడలి వద్ద వాటిని నాలుగు దిక్కులకు విసిరి పారేయాలి. పేద అమ్మాయిల పెళ్లికి శక్తివంచన లేకుండా ఆర్థిక సాయం చేయండి. వీలుంటే స్వయంగా కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వహించండి. దీనివల్ల పితృదోషాలు తొలగుతాయి.
– పన్యాల జగన్నాథ దాసు
Comments
Please login to add a commentAdd a comment