Unrest In France Over Teens Killing 800 Arrested - Sakshi
Sakshi News home page

నాహేల్ మృతి.. కంటిమీద కునుకులేని ఫ్రాన్స్‌..! పెచ్చుమీరుతున్న హింసాకాండ

Published Fri, Jun 30 2023 6:15 PM | Last Updated on Fri, Jun 30 2023 7:21 PM

Unrest In France Over Teens Killing 800 Arrested - Sakshi

ఫ్రాన్స్: గడిచిన మూడు రోజులుగా ఫ్రాన్స్ అట్టుడికిపోతోంది. పోలీసు కాల్పుల్లో మరణించిన నల్ల జాతీయుడు నాహేల్ మృతికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు పోలీసులపై దాడులకు తెగబడ్డారు. పాఠశాలలు, టౌన్ హాళ్లు, పోలీస్ స్టేషన్లు, కార్లు, దుకాణాలను తగలబెడుతూ ఆందోళనకారులు దేశాన్ని నిద్రపోనీయడం లేదు.

అసలేం జరిగింది.. 
మంగళవారం ఉదయం అల్జీరియాకు చెందిన 17 ఏళ్ల ముస్లిం యువకుడు నాహేల్ నాంటెర్రే ట్రాఫిక్ స్టాప్ వద్ద పోలీసుల ఆజ్ఞను అతిక్రమిస్తూ కొంచెం ముందుకు వెళ్ళాడు. దీంతో పోలీసులు పోలాండ్ నెంబరు ప్లేటు ఉన్న నాహేల్ కారును బ్లాక్ చేసి నాహేల్ ను ప్రమాదకరంగా పరిగణించి పాయింట్ బ్లాంక్ రేంజిలో కాల్పులు జరిపారు. దీంతో నాహేల్ అక్కడికక్కడే మరణించాడు. 

వీడియో లీక్.. 
ఈ హత్యోదంతం తాలూకు వీడియో బయటకు రావడంతో ఫ్రాన్స్ లోని ముస్లింలు పెద్ద ఎత్తున అల్లర్లకు తెరతీశారు. నాహేల్ కు న్యాయం చేయండంటూ మొదలైన నిరసన కాస్తా మెల్లిగా హింసాత్మకంగా మారింది. నినాదాలు చేస్తూ ముస్లింలు కార్లు, దుకాణాలు ప్రజా ఆస్తులను దగ్ధం చేశారు. ఇదే క్రమంలో మార్సెల్లీ లోని అతి పెద్ద గ్రంథాలయానికి కూడా నిప్పు పెట్టారు ఆందోళనకారులు.  

అక్కడ సర్వసాధారణం.. 
ఫ్రాన్స్ దేశ జనాభాలో 9% ఉండే ముస్లింలలో అత్యధికులు శరణార్థులు.. వలసదారులే.. వీరికి ఫ్రాన్స్ ఆశ్రయమిచ్చింది. గతేడాది ఫిఫా వరల్డ్ కప్ సమయంలో ఫ్రాన్స్ జట్టు మొరాకోపై గెలిచినప్పుడు కూడా ముస్లింలు ఇలాగే విధ్వంసాన్ని సృష్టించారు. ఈ నేపథ్యంలో కొందరు దీన్ని జాత్యాహంకారానికి వ్యతిరేకంగా ఎగిసిన ఉద్యమ జ్వాలాగా అభివర్ణస్తుంటే మరికొంతమంది మాత్రం వారు అల్లర్లు చేయడానికి ఏదో ఒక కారణం కావాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.    

అరెస్టులు.. 
ఆందోళనకారులు చేసిన దాడుల్లో ఇంతవరకు 249 మంది పోలీసులు గాయపడ్డారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ అల్లర్లు చేస్తున్న సుమారు 875 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అత్యధికులు 14 నుండి 18 సంవత్సరాల వయసువారే కావడం విశేషం. 

ఉక్కుపాదం.. 
ఉద్రిక్త ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు చెలరేగకుండా నియంత్రించే క్రమంలో దాదాపుగా 40 వేల మంది రక్షణ బలగాలను మోహరించినట్టు తెలిపారు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్డ్ డార్మానిన్.        

ఆ తల్లి కడుపు కోత.. 
నేను పోలీసు వ్యవస్థపై నింద వేయడం లేదు. నా కుమారుడిని పొట్టనబెట్టుకున్న ఆ ఒక్క అధికారిపైనే నా కోపమంతా. నా బిడ్డను అతనే చంపాడు. నా కుమారుడు అరబ్​ అని తెలిసే, అతని కాల్పులు జరిపాడు..  అని నాహెల్​ తల్లి మౌనియా ఆవేదన వ్యక్తం చేశారు.

అధ్యక్షుడి సందేశం.. 
ఇదిలా ఉండగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పందిస్తూ.. ఆందోళనాకరుల పధ్ధతి సరైనది కాదని, కుర్రాడిని కాల్చి చంపిన ఘటనలో పోలీసు అధికారిపై విచారణ జరుగుతోందని ఆందోళనకారులు శాంతించాలని కోరారు. 

ఇది కూడా చదవండి : యుద్ధ వాతావరణంలో ప్రశాంతంగా సాండ్ విచ్ తింటూ..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement