Komatireddy
-
రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల చెక్ అందించిన మంత్రి
తెలంగాణ అసెంబ్లీ వేదికగా తెలుగు నటీనటుల గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. 'పుష్ప2' సినిమా విడుదలరోజు సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఇప్పటికే రేవతి మరణించిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు శ్రేతేజ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.డిసెంబర్ 4న పుష్ప2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. వారి కుటుంబానికి తెలంగాణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందించారు. శ్రీ తేజ్ తండ్రికి తన ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా కోమటిరెడ్డి చెక్ అందించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంపు అనేది ఉండదని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ ఇస్తామని చెప్పిన రూ. 25 లక్షలు ఇప్పటికీ అప్పగించలేదని మంత్రి అన్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ మాట నిలబెట్టుకోలేదని అన్నారు. రేవతి కుమారుడు శ్రీతేజ వైద్యం కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతుందని ఆయన అన్నారు.సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ తండ్రి భాస్కర్ గారిని కలిసి 25 లక్షల రూపాయల చెక్కును కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరుపున అందించడం జరిగింది. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ లను అడిగి తెలుసుకోవడం జరిగింది. తన చికిత్సకు కోసం… pic.twitter.com/3EC5Agiowh— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) December 21, 2024 -
నాలుగు ముక్కలుగా హైదరాబాద్?.. అసలు ఏం జరుగుతుంది ..!
-
చర్లపల్లి జైలులో బెడ్ రూమ్.. కేసీఆర్ ని చూస్తే జాలేస్తుంది..!
-
రైతుబంధు ఇవ్వడానికి ఏం రోగం వచ్చింది
-
హరీష్ రావు Vs కోమటిరెడ్డి
-
హాట్ టాపిక్ గా మారిన టీ-కాంగ్ వరుస భేటీలు
-
చంపుతమని తిరుగుతున్నరు.. కోమటిరెడ్డి ఆడియో కలకలం!
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ఆయన కుమారుడు డాక్టర్ చెరుకు సుహాస్‌ను తన అభిమానులు చంపుతారంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బెదిరించినట్లుగా ఉన్న ఆడియో లీక్ అయ్యింది. అసభ్యంగా వారిద్దరినీ దూషించినట్లున్న ఆ ఆడియో ఆదివారం కలకలం రేపింది. అసలు ఆడియోలో ఏముందంటే.. ‘చూసినవా స్టేట్మెంట్.. (అంకుల్ అది వాట్సప్‌లో అట్ల ఇచ్చిండు కానీ ఆ వీడియో ఒకసారి మీరు పూర్తిగా చూడండి–ఎదుటి వ్యక్తి వాయిస్) ఏం చూసుడు. వాన్ని చంపుతమని తిరుగుతున్నరు. వంద మంది వెహికిల్ వేసుకొని తిరుగుతున్నరు. ఈ వీడియో కాదు నన్ను వందసార్లు తిట్టిండు. నెలరోజులు ఓపిక పట్టి ఇప్పుడు వంద కార్లలో వాణ్ని చంపుతమని తిరుగుతున్నరు. నిన్ను కూడా చంపుతరు. నీ హాస్పిటల్‌ను కూడా కూలగొడుతరు. లక్షల మందిని బతికించిన నేను. వానికెంత ధైర్యం నిన్న మొన్న పార్టీలకొచ్చి.. వాణ్ని వదిలిపెట్టర్రా.. నేను చెబుతున్న నీకు, వార్నింగ్ ఇస్తున్న. నేను ఆపలేను .. క్షమించమని చెప్పి, నా పేరు తీసుకొని మొన్న స్టేట్మెంట్లు ఇచ్చిండు ఓపిక పట్టిండ్రు. సార్ మాతో ని కాదిగ, నువ్వేమో ఏమనొద్దంటున్నవ్ సార్.. మేము వెళ్లినం బయటికి, యాడ దొరికితే ఆడ చంపేస్తం అంటుండ్రు వాళ్లు. నా తోని కాదు.. వాడు క్షమాపణ చెప్పకపోతే మాత్రం చంపేస్తరు... అసోంటి వంద వీడియోలు, డైరెక్టు పేరు పెట్టి వందసార్లు తిట్టిండు వాడు. ఇప్పుడొక బ్యాచ్ వెళ్లింది. నిన్ను కూడా చంపుతరు చెబుతున్న అరేయ్... నీ హాస్పిటల్ నడువదు. 25 ఏళ్లలో లక్షల మందిని బతికించిన నేను. వారందరిని కంట్రోల్ చేస్తానా నేను. అతనికి ఫోన్ చేసి చెప్పు.. అరేయ్ నీకు పార్టీ ఉన్నదారా.. ఇంటిపార్టీ ఏందిరా.. నువ్వు కౌన్సిలర్‌గా గెల వవు.. ఆయన అంతపెద్ద లీడరు అని చెప్పు. వాడు జైళ్ల పడితే నేను ఒక్కడినే పోయిన. ఎవరూ పోలే అప్పుడు. చెప్పు.. వారంకంటే ఎక్కువుండడాడు’. కోమటిరెడ్డి దిష్టిబొమ్మ దహనం డాక్టర్ చెరుకు సుధాకర్‌ను, ఆయన కుమారుడిని చంపుతామంటూ బెదిరించినట్లుగా ఆడియో లీక్ నేపథ్యంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండ గడియారం సెంటర్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిష్టి»ొమ్మను దహనం చేశారు. కాగా, ఎంపీ కోమటిరెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని బీసీ యువజన సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. దరిద్రుడు, చీడపురుగంటూ నన్ను తిట్టుడేంది: కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటినుంచి చెరుకు సుధాకర్ నాపై కామెంట్స్ చేస్తుండు. ఒకసారి దరిద్రుడని, మరోసారి చీడపురుగని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నడు. సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెడుతున్నరని ఆయన కొడుకును అడిగితే పెడితేఏంది అంటూ వంకర టింకర మాట్లాడుతుండు. ఇది ఎంతవరకు కరెక్టు. పార్టీకి పని చేయాలి. నన్ను తిట్టుడేంది? నా కొడుకుకు ఫోన్ చేసి నన్ను తిట్టడం ఆశ్చర్యం కలిగించింది: చెరుకు సుధాకర్ వెంకట్‌రెడ్డి అసభ్యంగా నన్ను తిట్టడం అశ్చర్యం కలిగించింది. నేను కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా, అతను స్టార్ క్యాంపెయినర్‌గా ఉండి ఒకే పారీ్టలో పని చేస్తున్నా నాపై అత్యంత నేరపూరితమైన, టెర్రరిస్టు భాష మాట్లాడారు. ఆయనకు మతి ఉండి మాట్లాడుతుండో.. మతి లేక మాట్లాడుతుండో అర్థం కావడంలేదు. ఆడియో టేపును తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి పంపించా. కోమటిరెడ్డిని నేను వ్యక్తిగతంగా తిట్టిన సందర్భాలు లేవు. నయీం లాంటి కరుడు గట్టిన తీవ్రవాదే నన్నేమీ చేయలేకయాడు. కోమటిరెడ్డి ఏం చేస్తాడు? ఈ వ్యాఖ్యలపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. -
రాష్ట్రంలోని సంపద కేసీఆర్ ఫ్యామిలీకే సరిపోవడం లేదు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
-
మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డితో " స్ట్రెయిట్ టాక్ "
-
మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి దూరంగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి
-
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ లో ఉంటారా ...?
-
పదివేల కోట్లిస్తే ప్రతిగింజా కొంటాం
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కల్లాలపైనే గుండెలు ఆగిపోయి రైతులు చనిపోతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బువ్వ ఎలా సహిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌కు మానవ త్వం ఉందా అని నిలదీశారు. ధనిక రాష్ట్రంలో పంటను కొనుగోలు చేయలేకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలనే డిమాండ్‌తో శనివారం టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద రెండు రోజుల ‘వరి దీక్ష’ప్రారంభమైంది. టీపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎస్. అన్వేశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ దీక్షకు సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) నేతలతోపాటు పలు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ తన ప్రసంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. అలాగే ప్రధాని, సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరి కొనకపోతే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ను అంబేడ్కర్ చౌరస్తాలో ఉరి తీయాలని వ్యాఖ్యానించారు. ప్రధాని అపాయింట్‌మెంట్‌నే కేసీఆర్ అడగలేదు... వరి కొనుగోలుపై ప్రధాని మోదీతో తాడోపేడో తేల్చుకొస్తామని చెప్పి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్... ప్రధాని అపాయింట్మెంట్ కూడా అడగలేదని, ఎంపీ సురేశ్‌రెడ్డి ఇంట్లో విందు ఆరగించి వచ్చారని రేవంత్ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ మంత్రులు కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌ను కలిసినప్పుడు కూడా యాసంగి గురించి అడిగారే తప్ప వానాకాలం సీజన్లో వచ్చిన ధాన్యం కొనుగోళ్ల గురించి ప్రస్తావించలేదని గుర్తుచేశారు. వరి పంట గురించి తెలంగాణ బీజేపీ నేతలు ఇకపై మాట్లాడబోరని గోయల్ స్పష్టం చేయడం టీఆర్ఎస్, బీజేపీలు తోడుదొంగలనడానికి నిదర్శనమన్నారు. రైతుల మరణాలకు కేసీఆరే కారణం... కాంగ్రెస్ పార్టీ నేతలకు రూ. 10 వేల కోట్లు ఇస్తే వానాకాలంలో తెలంగాణ రైతు పండించిన ప్రతి గింజను కొంటామని, విదేశాలకు ఎగుమతి కూడా చేస్తామని చెప్పారు. క్వింటాల్‌కు మద్దతు ధర ఇవ్వడమే కాకుండా ఛత్తీస్‌గఢ్‌లో ఇస్తున్నట్లుగా రూ. 500 బోనస్ కూడా చెల్లిస్తామన్నారు. అలా చేయకపోతే తాము వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగబోమని, ఈ సవాల్‌కు సీఎం కేసీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు. ఇప్పటివరకు 8 లక్షల టన్నుల ధాన్యమే కొన్నారని విమర్శించారు. రైతుల మరణాలకు కేసీఆర్ కారణమని, ధాన్యం కొనేలా ప్రభుత్వ మెడలు వంచే వరకు విశ్రమించబోమన్నారు. ప్రధాని ఆఫీసు ముందు ధర్నా చేస్తాం: ఎంపీ కోమటిరెడ్డి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీగా రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొ న్నారు. తాము కేసీఆర్‌లాగా ఢిల్లీ వెళ్లి ఇంట్లో పడుకోబోమని, పార్లమెంటులో గళం వినిపిస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని కార్యాలయం ముందు ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. వైఎస్ రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చారు... రైతులకు ఉచిత కరెంటు ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని నాటి ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ఎద్దేవా చేస్తే వై.ఎస్. రాజశేఖరరెడ్డి అధికారం చేపట్టాక ఉచిత విద్యుత్ ఇచ్చి చూపారని కోమటిరెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. రైతులను పట్టించుకోని చంద్రబాబు గతి ఏమైందో అందరూ చూస్తున్నారని, రైతులతో పెట్టుకుంటే అంతే సంగతులన్నారు. తెలంగాణ వరి రైతులను నట్టేట ముంచింది కేసీఆరేనని నల్లగొండ ఎంపీ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఖరీఫ్‌లో వచ్చే 60 లక్షల టన్నుల్లో ఇప్పటివరకు రాష్ట్రం సేకరించింది 8 లక్షల టన్నులేనన్నారు. రాష్ట్రంలో 15 కోట్ల గన్నీబ్యాగులు అవసరమైతే 5 కోట్ల బ్యాగులే కొన్నారని విమర్శించారు. కోమటిరెడ్డి, రేవంత్ ముచ్చట్లు... వరి దీక్షా వేదికపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ పగ్గాలు చేపట్టాక ఆయనతో కలిసి తొలిసారి వేదికను పంచుకున్న కోమటిరెడ్డికి వీహెచ్‌తోపాటు రైతు సంఘాల నేతలు స్వాగతం పలికారు. వేదికపైకి కోమటిరెడ్డిని సాదరంగా ఆహ్వానించిన రేవంత్... ఆయనతో కాసేపు కూర్చొని మాట్లాడారు. ఆ తర్వాత ఉత్తమ్, వీహెచ్ సహా ఇతర నేతలంతా సరదాగా మాట్లాడుకోవడం కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. కాగా, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వరి దీక్షావేదికపైనే శనివారం రాత్రి నిద్రించారు. వీరితోపాటు అన్వేశ్‌రెడ్డి, నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, భువనగిరి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మెట్టు సాయికుమార్ తదితరులు ఉన్నారు. -
కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు
-
త్వరలో రామప్ప, లక్నవరానికి గోదావరి నీళ్లు
సాక్షి, హైదరాబాద్: ‘అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనగానే ఎండిన మొక్కజొన్న జూళ్లు, ఎండిన వరి కంకులు, నీటి సమస్యకు చిహ్నంగా ఖాళీ బిందెలు, కరెంటు కోతలకు నిరసనగా కందిళ్ల ప్రదర్శనలు కనిపించేవి. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక ఇలాంటివి కన్పించట్లేదు. ప్రజారంజక పాలనకు ఇదే నిదర్శనం’అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా సీఎం కేసీఆర్ తరఫున నీటిపారుదల శాఖపై ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్ర చరిత్రలో యాసంగిలో ఏకంగా 38 లక్షల ఎకరాలు సాగుతో కళకళలాడటం తొలిసారి చూస్తున్నామని చెప్పారు. అద్భుతమైన రీతిలో సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి కోటి ఎకరాలు సాగులోకి తెచ్చే దిశగా తెలంగాణ సాగుతోందన్నారు. ఇటీవల సీడబ్ల్యూసీ చైర్మన్ కూడా తెలంగాణ ప్రాజెక్టులపై ప్రశంసలు కురిపించారని గుర్తు చేశారు. త్వరలో దేవాదుల ప్రాజెక్టులో భాగంగా రామప్ప చెరువును గోదావరి నీటితో నింపుతామని, అక్కడి నుంచి లక్నవరం చెరువుకు గ్రావిటీ ద్వారా అందిస్తామని తెలిపారు. వెరసి 8,700 ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందిస్తామని చెప్పారు. లక్ష కోట్ల అవినీతి: కోమటిరెడ్డి సాగునీటిపై హరీశ్‌రావు మాట్లాడుతుండ గా.. కాంగ్రెస్ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధికారపక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రాజెక్టుల పేరుతో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ గట్టిగా నినాదాలు చేశారు. దీంతో అధికార పార్టీ సభ్యులు ఆయనపై విరుచుకుపడ్డారు. భారీ అవినీతి జరిగినా, గొప్పగా పనులు జరిగాయంటూ చెప్పుకోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. కాంట్రాక్టర్ల బకాయిలు చాలావరకు తీర్చాం: ప్రశాంత్‌రెడ్డి రోడ్ల అభివృద్ధికి గతం కంటే ఈసారి ఎక్కువ నిధులే కేటాయించుకున్నామని రోడ్లు భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కాంట్రాక్టర్లకు భారీగా బిల్లుల బకాయిలున్న మాట నిజం కాదన్నారు. గతంలో ఎక్కువే ఉండేవని, కానీ ఆర్డీఎఫ్ ద్వారా రుణం పొంది వాటిని చాలా వరకు తీర్చేశామని చెప్పారు. లుంబినీ పార్కులో తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నాన్ని అద్భుతంగా రూపొందిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోనూ ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు నిర్మించాలన్న సభ్యుల సూచనను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. 80 శాతం పూర్తయిన ‘భగీరథ’ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం 80% పూర్తయిందని, త్వరలో మిగతా పనులు పూర్తి చేస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. మిషన్ భగీరథ పుణ్యాన ఇప్పుడు వేసవిలోనూ రాష్ట్రంలో తాగు నీటి సమస్య లు లేవన్నారు. పుణ్యస్నానాలు ఆచరించే గోదావరి జలం ఇంటిలో నల్లా తిప్పగానే వస్తున్నందుకు అభినందించాల్సింది పో యి కాంగ్రెస్ నేతలు అనవసర ఆరోపణ లు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంలో రాజగోపాల్ ను ఉద్దేశించి మంత్రి వాడిన ఓ పదాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటిం చారు. అందుకు సారీ కూడా చెప్పారు. -
సోనియా గాంధీతో ఎంపీ కోమటిరెడ్డి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఢిల్లీలోని ఆమె నివాసంలో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని రాజకీయ పరిస్థితులను ఆమెకు వివరించినట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికల అనంతరం పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్పుకుంటానని ప్రకటించడం, ఇటీవల కర్ణాటక తదితర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు నూతన అధ్యక్షులను నియమించడం వంటి పరిణా మాల నేపథ్యంలో కోమటిరెడ్డి భేటీ ప్రాధా న్యత సంతరించుకుంది. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నేతలకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని, అధికార పార్టీని ఎదుర్కొనేందుకు త్వరితగతిన పీసీసీ కమిటీ ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలుస్తోంది. -
జనగామ వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించాలి
సాక్షి, హైదరాబాద్: రాయగిరి వరకు ప్రతిపాదించిన ఎంఎంటీఎస్ రైలును జనగామ వరకు పొడిగించాలని, ప్యాసింజర్ రైలు (ఎంఈఎంయూ)ను ఫలక్‌నుమా నుంచి భువనగిరి దాకా విస్తరించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని వివిధ రైల్వే స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్, ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లను ఆపడంతోపాటు పలు సమస్యలు పరిష్కరించాల న్నారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో జీఎంను కలసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. -
కోమటిరెడ్డి,సంపత్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు
-
బహిష్కరణ అప్రజాస్వామికం
సాక్షి, హైదరాబాద్ : తమ సభ్యుల అనర్హత వేటుపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమీషన్ (సీఈసీ)ను ఆశ్రయించింది. సహజ న్యాయసూత్రాలను పాటించకుండా, అప్రజాస్వామికంగా తమ సభ్యులను స్పీకర్ బహిష్కరించారని.. సభ్యత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని బుధవారం ఫిర్యాదు చేసింది. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ఎలాంటి న్యాయ సూత్రాలను పాటించకుండా తమను సభ నుంచి పంపించేశారని.. తమకు అన్యాయం జరగకుండా చూడాలని ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు సీఈసీకి ఆన్లైన్లో సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేరుగా ప్రతినిధి బృందంతో సీఈసీ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. పార్టీ ఎలక్షన్ కంట్రోల్ కమిషన్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం గురువారం ఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో సీఈసీని కలవనున్నారు. ఇక తమ సభ్యత్వం రద్దు విషయంలో కనీస సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని వెంకట్‌రెడ్డి, సంపత్‌లు స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కుట్ర.. ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల బహిష్కరణ అంశంపై మర్రి శశిధర్‌రెడ్డి కూడా బుధవారం సీఈసీకి ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ అవుతుందని.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోపాటు వాటికి ఉప ఎన్నికలు జరుగుతాయని మంత్రి హరీశ్‌రావు చెప్పినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయని ఆ లేఖలో వివరించారు. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకూడదన్న కుట్రపూరిత ఉద్దేశంతోనే తమ సభ్యుల సభ్యత్వాలను రద్దు చేశారని పేర్కొన్నారు. బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు హైకోర్టు, సుప్రీంకోర్టులను న్యాయం కోసం ఆశ్రయిస్తారని.. అప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సీఈసీని కోరారు. రెండు అసెంబ్లీ స్థానాల ఖాళీని నోటిఫై చేయాలంటూ తెలంగాణ శాసనసభ స్పీకర్ పంపిన లేఖను నిలిపివేయాలని.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ స్థానాలకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయవద్దని విజ్ఞప్తి చేశారు. -
కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వం రద్దు
సాక్షి, హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనసభలో జరిగిన ఘటనలకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్లగొండ), ఎస్ఏ సంపత్‌కుమార్ (అలంపూర్)లపై వేటు పడింది. సభా హక్కుల ఉల్లంఘన, సభ గౌరవానికి భంగం కలిగించడం వంటి చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలతో.. వారిద్దరి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ మంగళవారం అసెంబ్లీ తీర్మానించింది. ప్రస్తుత అసెంబ్లీ ముగిసే వరకు వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌కు చెందిన మిగతా 11 మంది ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసింది. మరోవైపు శాసనమండలిలోనూ ఆరుగురు కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. దురదృష్టకరమైన ఘటన.. సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నర్సింహన్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి విసిరేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్‌ఫోన్స్ సెట్‌ను విసిరేయగా.. అది తగిలి శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ గాయపడ్డారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న అధికారపక్షం.. నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మంగళవారం ఉదయం శాసనసభ సమావేశం కాగానే ఈ అంశాన్ని లేవనెత్తింది. స్పీకర్ మధుసూదనచారి వచ్చి సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న అనంతరం దీనిపై మాట్లాడారు. ‘‘గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో దుర్మార్గమైన, దురదృష్టకమైన, అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంది. సభకు నా తీవ్ర మనస్తాపాన్ని తెలియజేస్తున్నా.. నాలుగేళ్లుగా దేశంలోనే గొప్పగా, గౌరవంగా సభను నిర్వహిస్తున్నాం. నేను తీవ్రంగా మనస్తాపం చెందాను. దాడితో దెబ్బతిన్న స్వామిగౌడ్‌ను చూసి షాక్‌కు గురయ్యాను..’’అని పేర్కొన్నారు. సభా నిబంధనల మేరకు.. తర్వాత శాసనసభ వ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు మాట్లాడారు. ‘‘నిన్నటి అరాచక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ ఘటన ప్రజాస్వామ్యానికే మాయని మచ్చను మిగిల్చింది. మీ (స్పీకర్) తీవ్ర మనోవేదనకు, ఆవేదనకు అనుగుణంగా అసెంబ్లీ నిబంధనల (240 పేజీలోని సబ్ రూల్ 2) ప్రకారం.. కాంగ్రెస్ సభ్యులు కె.జానారెడ్డి, ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జె.గీతారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, జి.చిన్నారెడ్డి, డి.కె.అరుణ, టి.రామ్మోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, ఎన్.పద్మావతి, దొంతి మాధవరెడ్డిలను బడ్జెట్ సమావేశాల కాలానికి సస్పెండ్ చేయాలని ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాను. నిన్న జరిగిన దాడి చాలా చాలా తీవ్రమైనది. చట్టసభలను అవమానపరిచేలా, రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసేలా జరిగింది. ఈ విషయంలో శాసనసభ తీవ్ర వేదనకు గురైంది. శాసనసభ నిబంధనలను ఉల్లంఘించి, సభా మర్యాదలకు భంగం కలిగించడానికి కారణమైన వారిపై పార్లమెంటరీ నిబంధనల (120 పేజీలోని 7.1 పేరా, రాజ్యాంగంలోని 194లో మూడో సెక్షన్) ప్రకారం.. కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల సభ్యత్వాలను ప్రస్తుత శాసనసభ కాలం ముగిసేవరకు రద్దు చేయాలని ప్రతిపాదిస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాను..’’అని తెలిపారు. ఈ తీర్మానాలను పరిగణనలోకి తీసుకున్న స్పీకర్.. సభ ఆమోదం కోరారు. అనంతరం తీర్మానాలను ఆమోదించినట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం అప్రజాస్వామికమని కాంగ్రెస్ సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టి.జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పటికే మార్షల్స్ సభలోకి ప్రవేశించారు. అందులో మహిళా మార్షల్స్ ఎక్కువ సంఖ్యలో వచ్చారు. తొలుత వారు పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి వద్దకు వచ్చి బయటికి తీసుకెళ్లబోయారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆగారు. కొద్దిసేపటి తర్వాత కాంగ్రెస్ సభ్యులంతా బయటికి వెళ్లిపోయారు. ఆ తర్వాతే ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలోకి రావడం గమనార్హం. మండలిలో గందరగోళం.. శాసన మండలిలోనూ ఆరుగురు కాంగ్రెస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన గందరగోళానికి బాధ్యులను చేస్తూ వారిని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. మంగళవారం శాసన మండలి ప్రారంభమైన వెంటనే.. కాంగ్రెస్ సభ్యులు విపక్ష నేత షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సంతోష్, దామోదర్‌రెడ్డి, ఆకుల లలిత, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలను సస్పెండ్ చేయాలని ప్రతిపాదిస్తూ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీర్మానాన్ని ప్రతిపాదించారు. దానిని పరిగణనలోకి తీసుకున్న మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్.. తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండైన సభ్యులు సభను వీడి వెళ్లాలని సూచించారు. అయితే కాంగ్రెస్ సభ్యులు బయటికి వెళ్లకుండా ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సస్పెండైన సభ్యులకు సభలో మాట్లాడే అవకాశం ఉండదని, బయటకు వెళ్లిపోవాలని డిప్యూటీ చైర్మన్ స్పష్టం చేశారు. అయినా కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో సభలో గందరగోళం నెలకొంది. చివరికి మార్షల్స్‌ను రప్పించి.. కాంగ్రెస్ సభ్యులను బయటకు పంపారు. ఈ సమయంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
‘పెద్దోళ్లంతా’ లోక్‌సభకే!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలను ఈసారి లోక్‌సభకు పోటీ చేయించాలని ఆ పార్టీ అధిష్టానం యోచిస్తోంది. ముఖ్యంగా వారసులను బరిలోకి దింపాలని ప్రయత్నిస్తున్న నేతలను పార్లమెంటుకు పంపాలని, వారసులకు రాష్ట్రంలో అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని భావిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో చాలా మంది నేతలు సీఎం రేసులో ఉండటం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కసరత్తు పకడ్బందీగా జరగకపోతే నష్టం తప్పదన్న అంచనాలు, పార్టీలోని నేతల మధ్య పోటీకి చెక్ పెట్టడం లక్ష్యంగా పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతోపాటు సీనియర్లు పోటీచేసే లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు అన్నివిధాలా భరోసా కల్పించినట్లు అవుతుందని అంటున్నారు. కుటుంబ సభ్యులకు సీట్లు..! రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు చాలామంది వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులకు కూడా అవకాశం కల్పించాలని పార్టీకి ప్రతిపాదిస్తున్నారు. అయితే సీట్ల సర్దుబాటు, ప్రాంతాలు, సామాజిక సమీకరణాల దృష్ట్యా కుటుంబ సభ్యులకు సీట్లు కోరుకునే నేతలందరినీ సంతృప్తిపరిచే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులకు సీటు కావాలంటే.. లోక్‌సభకు వెళ్లాలని సీనియర్లకు మెలిక పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. సీనియర్ నేతలు కోమటిరెడ్డి, పొన్నాల, జానా, సబిత, డీకే అరుణ, సర్వే సత్యనారాయణ, గీతారెడ్డి, రాజనర్సింహ తదితరులు ఈ జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు. – సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను నల్లగొండ లోక్‌సభకు పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ అసెంబ్లీ నుంచి సోదరుడు, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డికి లైన్‌క్లియర్ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. – జానారెడ్డి కుమారుడు రఘువీర్ గత ఎన్నికల సమయంలోనే మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. కానీ వీలుకాలేదు. ఈసారి ఎమ్మెల్యే బరిలో దిగాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు. ఆయనకు అవకాశమిస్తే.. జానాను నల్లగొండ లేదా మల్కాజ్గిరి నుంచి లోక్‌సభకు పోటీ చేయించే అవకాశాలున్నట్లు సమాచారం. – సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడు కార్తీక్ కోసం గత ఎన్నికల్లోనే అసెంబ్లీ స్థానాన్ని వదులుకున్నారు. ఆ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా పోటీచేసిన కార్తీక్.. ఈసారి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే బరిలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో సబితను చేవెళ్ల ఎంపీ స్థానంలో పోటీకి దింపే అవకాశాలున్నాయి. – పొన్నాల లక్ష్మయ్య కూడా కోడలు వైశాలిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నారు. ఆమె జనగామ నుంచి పోటీ చేయాలనుకుంటే పొన్నాలను భువనగిరి ఎంపీ స్థానంలో పోటీ చేయాలని కోరవచ్చని అంటున్నారు. – డీకే అరుణ తన కుమార్తె స్నిగ్ధారెడ్డిని ఎమ్మెల్యే చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అదే జరిగితే అరుణను లోక్‌సభకు పంపవచ్చని.. మహబూబ్‌నగర్ నుంచిగానీ, మరో చోట గానీ పోటీలోకి దింపవచ్చని తెలుస్తోంది. – సీనియర్ నేత జైపాల్‌రెడ్డిని ఈసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లోకి తీసుకుంటారని, వచ్చే ఎన్నికల్లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నుంచి బరిలో ఉంటారనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే జైపాల్‌రెడ్డి సీఎం రేసులో ఉంటారు. కానీ తనకు సీఎం కావాలన్న ఆలోచన లేదని, ఈసారికి ఎంపీ బరిలోనే ఉంటానని జైపాల్‌రెడ్డి సన్నిహితుల వద్ద చెబుతున్నారు. – ఇక పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఆయన సతీమణి పద్మావతీరెడ్డి ఇద్దరూ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కుటుంబంలో ఒకరికే అసెంబ్లీ అవకాశమనే నిర్ణయం నేపథ్యంలో.. ఉత్తమ్ హుజూర్నగర్ అసెంబ్లీకే పోటీచేస్తారని, పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడలో మరొకరికి అవకాశమిస్తారని చెబుతున్నారు. దీంతో ఇతర నేతల నుంచి అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉండదనే చర్చ జరుగుతోంది. ఆ ఎంపీ స్థానాల కోసం.. రాష్ట్రంలో ఎస్సీ రిజర్వుడు లోక్‌సభ స్థానాలైన వరంగల్, పెద్దపల్లి విషయంలో కాంగ్రెస్ అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితిలో ఉంది. గత ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేసిన రాజయ్య కుటుంబ సమస్యల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పెద్దపల్లి నుంచి పోటీ చేసిన వివేక్ టీఆర్ఎస్లో చేరారు. అయితే కాంగ్రెస్ వరంగల్ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను నిలబెట్టింది. ఈసారీ ఆయననే బరిలోకి దింపవచ్చని అంటున్నారు. లేదా గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ పేర్లను కూడా పరిశీలించే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. గీతారెడ్డి కుమార్తె మేఘనారెడ్డి, రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డిల పేర్లు కూడా ఈసారి ఎన్నికల బరిలో వినిపిస్తున్నాయి. -
కోమటిరెడ్డి కమీషన్లు తీసుకోలేదా?
మిర్యాలగూడ : కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డిలకు రాజకీయ భవిష్యత్ లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు విమర్శించారు. మిర్యాలగూడ సభలో మాట్లాడుతూ.. మిషన్ కాకతీయలో కోమటిరెడ్డి కమీషన్లు తీసుకున్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. ఆధారాలతో సహా నిరూపించి ప్రజల ముందు పెడ్తానని సవాల్ విసిరారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి మంత్రులుగా పనిచేసిన మిర్యాలగూడలో రహదారి వెడల్పునకు ఎటువంటి నిధులివ్వలేదని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రూ.7 కోట్లు మంజూరు చేసి రోడ్ల వెడల్పునకు శంకుస్థాపన చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు ప్రజల కోసం చెరువుల్లో పని చేయించలేదని.. కేవలం కాంట్రాక్టర్ల కోసమే ఐ.బి. శాఖ పని చేసేలా చేశారని మండిపడ్డారు. -
‘పీసీసీకి సంబంధం లేకుండా పాదయాత్ర చేస్తా’
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలో పాదయాత్ర చేస్తానని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. పీసీసీకి సంబంధం లేకుండా కాంగ్రెస్ నేత హోదాలోనే పాదయాత్ర చేపడుతానని స్పష్టం చేశారు. ఏఐసీసీ నుంచి అనుమతి వచ్చిన వెంటనే యాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ సిగ్గు పడాలని ఎమ్మెల్యే కోమటి రెడ్డి వ్యాఖ్యానించారు. సుమారు 540 గ్రామాలకు మంచి నీరందించే ఉదయసముద్రం ఎండిపోతోందని అధికారులకు, మంత్రి హరీష్‌రావుకు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగు నీరందక ప్రజలు రోడ్డెక్కితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. జిల్లాకు ఫ్లోరైడ్ నీరందిస్తున్న ఘనత సీఎందేనని ఎద్దేవా చేశారు. మంచినీరందించే విషయంలో కృష్ణా బోర్డును కూడా సీఎం ఒప్పించలేకకపోతున్నారని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు వచ్చే కేంద్ర నిధులను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని, సర్పంచులు తిరగబడకముందే ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్కారు కులాల వారీగా రాష్ట్రాన్ని విడగొడుతోందని ఆరోపించారు. నల్గొండ జిల్లాకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్నా లేనట్లేనని ఎద్దేవా చేశారు. -
బత్తాయి మార్కెట్ హింసకు కాంగ్రెస్సే కారణం
హైదరాబాద్: నల్గొండలో బత్తాయి మార్కెట్ ప్రారంభం సందర్భంగా జరిగిన హింసకు కాంగ్రెస్సే కారణమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. విలేకరులతో మాట్లాడుతూ..కాంగ్రెస్ తీరు దొంగే దొంగ అన్నట్టుగా ఉందన్నారు. తనను గెలిపిస్తే బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేయిస్తానని కోమటి రెడ్డి ప్రతి ఎన్నికలో చెప్పేవాడని, అధికారంలోకి వచ్చాక ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారని వాపోయారు. మూడేళ్లు తిరగకుండానే నల్గొండలో బత్తాయి మార్కెట్ ఏర్పాటు చేసిన ఘనత మా ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతుల్లో ప్రభుత్వం పట్ల కనిపిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే కోమటి రెడ్డి కొత్త డ్రామాకు తెర లేపారని తెలిపారు. మేం బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటే దాంట్లో చొరబడి స్వయంగా విధ్వంసం చేసింది కోమటి రెడ్డే కదా అని పేర్కొన్నారు. మా పార్టీ నేతలే ఈ దాడుల్లో టార్గెట్ అయ్యారని, మా వాళ్ల కార్లే ధ్వంసం అయ్యాయని వివరించారు. విచారణలో అన్నీ విషయాలు బయటికి వస్తాయన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే జానారెడ్డి, ఉత్తమ్, షబ్బీర్ అలీ, కోమటి రెడ్డి కి ఎలా వంత పాడుతారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నరరూప రాక్షసుల పార్టీ కాదు..కాంగ్రెస్సే నరరూప రాక్షసుల పార్టీ అని అనేక ఉదంతాలు తెలిపాయన్నారు. మీరు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు..ప్రతీకారం తీసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ వైఖరి మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ఉందని చమత్కరించారు. -
కోమటిరెడ్డిపై దాడి అమానుషం
టీఆర్ఎస్పై ధ్వజమెత్తిన జానా సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం అమానుషమని సీఎల్పీ నేత కె.జానారెడ్డి అన్నారు. నల్లగొండ బత్తాయి మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఆధిపత్య ధోరణితో వ్యవహరించిందని, కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు దిగిందన్నారు. పోలీసుల లాఠీచార్జీలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని, ప్రభుత్వ దుందుడుకు చర్యలను తిప్పికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నల్లగొండ జిల్లా నాయకులతోపాటు కోమటిరెడ్డితో త్వరలో సమావేశమై ఒక కార్యాచరణ చేపడతానన్నారు. ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం అమానుషం: షబ్బీర్ తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమంలో ఎమ్మెల్యేను పాల్గొననీయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని మండలి కాంగ్రెస్ విపక్ష నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ప్రతిచోటా అధికార కార్యక్రమాల్లో విపక్ష ప్రజాప్రతినిధులను పాల్గొననీయకుండా చేయడం అమానుషమని పేర్కొన్నారు. మంత్రులు ఈ వైఖరిని విడనాడకుంటే, ఇకపై జరిగే పర్యవసానాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని షబ్బీర్ అలీ హెచ్చరించారు. హోంమంత్రి రాజీనామా చేయాలి: మల్లు రవి స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డికి ప్రొటోకాల్ ఇవ్వకపోవడం సిగ్గుచేటని పీసీసీ ఉపాధ్యక్షుడు, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జి మల్లు రవి విమర్శించారు. ప్రభుత్వ చెప్పుచేతల్లో పోలీసురాజ్యం నడుస్తోందన్నారు. రాష్ట్రంలో పోలీసుల వైఫల్యాలకు నైతిక బాధ్యతగా హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
ఉప ఎన్నికల్లో ధర్మానిదే గెలుపు
కనగల్ : మండల కేంద్రంలోని సర్పంచ్ స్థానంతోపాటు రేగట్టె, పగిడిమర్రి ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించే ఉప ఎన్నికల్లో ధర్మమే గెలుస్తుందని నల్లగొండ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన రేగట్టె, పగిడిమర్రి ఎంపీటీసీలు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిన తరుణంలో హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం వారిని అనర్హులుగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. స్వలాభం కోసం ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసం చేస్తూ నీతిమాలిన రాజకీయాలకు పాల్పడే వారిని ఉప ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా నాలుగు పర్యాయాల తన ఎమ్మెల్యే పదవీ కాలంలో మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు వివరించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతూ రంగుల ప్రపంచంలో విహరింపజేస్తుందే తప్ప పేదలకు ఒరిగిందేమీలేదన్నారు. ఉప ఎన్నికల్లో ఓటర్లు విజ్ఞత ప్రదర్శించి సేవ చేసే వారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. రైతులకు లోఓల్టేజీ సమస్య లేకుండా మండలంలో ఏడు సబ్ స్టేషన్ల నిర్మాణంతోపాటు ఒక మదర్ సబ్ స్టేషన్‌ను నిర్మించినట్లు తెలిపారు. అనంతరం రేగట్టె, పగిడిమర్రి ఎంపీటీసీ స్థానాలకు కాంగ్రేస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న భారత వెంకటేశం, కదిరె యాదమ్మలకు పార్టీ బీ ఫామ్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కనగల్ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, సర్పంచ్ జగాల్‌రెడ్డి, నాయకులు రవీందర్‌రెడ్డి, వెంకటేశం, వెంకట్‌రెడ్డి, నర్సిరెడ్డి, సత్తయ్య, శ్రీశైలం, రామచంద్రు, సైదులు తదితరులు పాల్గొన్నారు.