యాగాల మీద ఉన్న ప్రేమ రైతులపై లేదు
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కోమటిరెడ్డి ధ్వజం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు యాగాల మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేకుండా పోయిందని, అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వ పరంగా పలకరించే నాథుడే కరువయ్యాడని సీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. గురువారం మహబూబ్‌నగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన స్తంభించిందన్నారు.
కొంత మంది స్థానిక ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేసినంత మాత్రాన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఆపడం టీఆర్‌ఎస్ తరం కాదన్నారు. పోటీ జరుగుతున్న ఆరు స్థానాల్లో కనీసం మూడు స్థానాలను గెలిచి తీరుతామని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తోందని మండిపడ్డారు.