రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల చెక్ అందించిన మంత్రి | Minister 25 Lakh Help To Revathi Family | Sakshi
Sakshi News home page

రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల చెక్ అందించిన మంత్రి

Published Sat, Dec 21 2024 6:29 PM | Last Updated on Sat, Dec 21 2024 7:44 PM

Minister 25 Lakh Help To Revathi Family

తెలంగాణ అసెంబ్లీ వేదికగా తెలుగు నటీనటుల గురించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. 'పుష్ప2' సినిమా విడుదలరోజు సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో ఇప్పటికే రేవతి మరణించిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు శ్రేతేజ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

డిసెంబర్‌ 4న పుష్ప2 ప్రీమియర్స్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. వారి కుటుంబానికి తెలంగాణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందించారు. శ్రీ తేజ్ తండ్రికి తన ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా     కోమటిరెడ్డి చెక్‌ అందించారు. శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్లు పెంపు అనేది ఉండదని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 

తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. రేవతి కుటుంబానికి అల్లు అర్జున్‌ ఇస్తామని చెప్పిన రూ. 25 లక్షలు ఇప్పటికీ అప్పగించలేదని మంత్రి అన్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్‌ మాట నిలబెట్టుకోలేదని అన్నారు. రేవతి కుమారుడు శ్రీతేజ వైద్యం కోసం ప్రభుత్వం ఖర్చు పెడుతుందని ఆయన అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement