ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి | Efforts to solve aasha worker's problems | Sakshi
Sakshi News home page

ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి

Published Thu, Jul 28 2016 7:51 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి - Sakshi

ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి

నల్లగొండ టౌన్‌ : జిల్లాలో ఆశ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, వేతనాల పెంపు కోసం తనవంతు కృషి చేస్తానని నల్లగొండ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో నల్లగొండ క్లస్టర్‌ ఆశ వర్కర్ల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కనీస వేతనాలు లేకుండా కేవలం పారితోషికాలతో మాత్రమే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశ వర్కర్లను అభినందిస్తున్నానన్నారు. ఆశ వర్కర్ల వేతనాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రకటన కోసం కృషి చేస్తానన్నారు. రెండవ ఏఎన్‌ఎంల వేతనాలను ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆశ వర్కర్లకు నిర్వహించిన పాటలు, ఉపన్యాస, గ్రూప్‌ డిస్కషన్‌ పోటీల్లో ప్రతిభను కనబర్చిన వారికి ప్రశంసా పత్రాలు, షీల్డ్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మీ, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ భానుప్రసాద్‌ నాయక్, డీఐఓ, నల్లగొండ క్లస్టర్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ ఎ.బి.నరేంద్ర, డీసీసీబీ డైరెక్టర్‌ పాశం సంపత్‌రెడ్డి, కనగల్‌ జెడ్పీటీసీ శ్రీనివాస్‌గౌడ్, అంజయ్య, బైరగోని భిక్షం తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement