హరీశ్‌రావుకు కోమటిరెడ్డి లేఖ
నల్గొండ: జిల్లాలోని పానగల్ రిజర్వాయర్‌కు తక్షణమే నీటిని విడుదల చేయాలంటూ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. రిజర్వాయర్ సామర్ధ్యం 1.528 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.330 టీయంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న తాగునీరు మరో 15 రోజుల్లో మాత్రమే వస్తుందని చెప్పారు. నీటి ఎద్దడి కారణంగా జిల్లాలోని 700 గ్రామాలకు తాగునీరు సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. తక్షణమే నీటి విడుదల చేసి అధికారులకు తగిన సూచనలు ఇవ్వాలని కోరారు.