హామీల అమలులో కేసీఆర్ విఫలం
సంస్థాన్ నారాయణపురం : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
సంస్థాన్ నారాయణపురం : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సంస్థాన్ నారాయణపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఉద్యోగాలు, రుణమాఫీ ఇప్పటికీ నెరవేరలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డితో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి అమలు చేసిందన్నారు. కేసీఆర్ కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తానంటున్నారు కానీ, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 555 జిలాల్లో ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో చేపట్టినవే అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగుతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ గడ్డం మురళీధర్‌రెడ్డి, ఎంపీపీ వాంకుడోతు బుజ్జి తదితరులు ఉన్నారు.