కోమటిరెడ్డివి పగటి కలలు: పాల్వాయి | Palvayi govardhanreddi comments on Komatireddy | Sakshi
Sakshi News home page

కోమటిరెడ్డివి పగటి కలలు: పాల్వాయి

Published Thu, Dec 22 2016 1:25 AM | Last Updated on Fri, Mar 22 2019 6:13 PM

కోమటిరెడ్డివి పగటి కలలు: పాల్వాయి - Sakshi

కోమటిరెడ్డివి పగటి కలలు: పాల్వాయి

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి అవుతానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పగటి కలలు కంటున్నాడని  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘కోమటిరెడ్డికి పిచ్చిలేచి ఉండాలి, లేదా సీఎం అవుతానని పగటికలలైనా వచ్చి ఉండాలి. డబ్బులు పెట్టి పదవులను కొనుక్కోవాలని చూస్తున్నాడు. డబ్బులకు హైకమాండ్‌ అమ్ముడుపోదు. 2019 ఎన్నికల్లోనూ పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమారే ఉంటారు’ అని అన్నారు.

‘పాదయాత్ర చేయడానికి కోమటిరెడ్డి ఏమైనా వైఎస్‌ రాజశేఖరరెడ్డినా? పాదయాత్ర చేసినంత మాత్రాన వైఎస్‌ స్థాయి నాయకుడు కోమటిరెడ్డి కాలేడు. పాదయాత్ర చేస్తానని అనుకుంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఉంటది’ అనిఎద్దేవా చేశారు. మునుగోడు నుంచి అసెంబ్లీకి పోటీచేయాలని రాజగోపాల్‌రెడ్డి ఆలోచిస్తే మంచిదికాదని, అది ఆయన తాత జాగీరు కాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement