రైల్వే శాఖ ‘స్వరైల్’ (SwaRail app) అనే కొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. పలు రకాల సేవలకు వన్-స్టాప్ సొల్యూషన్‌గా ఈ యాప్‌ను రూపొందించింది. స్వరైల్ యాప్ ప్రస్తుతానికి టెస్టింగ్ కోసం ప్లేస్టోర్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే (Railway) అధికారి ధ్రువీకరించారు.
“ఈ యాప్‌ను ప్రస్తుతానికికి 1,000 మంది వినియోగదారులు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోగలరు. వీరి నుంచి వచ్చే ప్రతిస్పందన, అభిప్రాయాలను పరిగణించి ఆ తర్వాత, తదుపరి సూచనలు, వ్యాఖ్యల కోసం మరో 10,000 డౌన్‌లోడ్‌లకు అందుబాటులో ఉంచుతాం” అని రైల్వే బోర్డు అధికారి ఒకరు తెలిపారు.
రిజర్వ్, అన్‌రిజర్వ్ టిక్కెట్ బుకింగ్‌లు, ప్లాట్‌ఫామ్, పార్శిల్ బుకింగ్‌లు, రైలు ఎంక్వయిరీలు, పీఎన్‌ఆర్ తనిఖీలు, రైల్‌మదాద్ ద్వారా అందించే సేవలు వంటివాటికి స్వరైల్ యాప్ సౌకర్యవంతమైన యాక్సెస్‌ను అందిస్తుంది.
“అతుకులు లేని క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్ ద్వారా వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడమే ఈ యాప్ ప్రధాన ప్రాధాన్యత. ఇది ఒకే చోట అన్ని సేవలను మిళితం చేయడమే కాకుండా, భారతీయ రైల్వే సేవల పూర్తి ప్యాకేజీని వినియోగదారులకు అందించడానికి అనేక సేవలను ఏకీకృతం చేస్తుంది” అని రైల్వే బోర్డులో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ పేర్కొన్నారు.
రైల్వే మంత్రిత్వ శాఖ తరపున సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (CRIS) తాజాగా బీటా పరీక్ష కోసం సూపర్ యాప్‌ను విడుదల చేసిందనని ఆయన తెలిపారు. వినియోగదారులు ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి స్వరైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment