క్విక్ కామర్స్ మార్కెట్‌లో జెప్టో దూకుడు ప్రదర్శిస్తోంది. జెప్టో కేఫ్‌ను ప్రత్యేక యాప్‌గా అందుబాటులోకి తీసుకు రానున్నట్టు క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో సహ వ్యవస్థాపకుడు ఆదిత్ పాలిచా తెలిపారు. కేఫ్ సేవలకు ఆదరణ పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
నెలకు 100కుపైగా కేఫ్‌లను ప్రారంభిస్తున్నామని, ఇప్పటికే రోజుకు 30,000 పైచిలుకు ఆర్డర్లను అందుకుంటున్నామని వివరించారు. జెప్టో వేదికగా 2022 ఏప్రిల్‌లో జెప్టో కేఫ్ ప్రారంభం అయింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో ఉన్న స్టోర్లలో 120 కంటే ఎక్కువ కేఫ్‌ల ద్వారా ప్రధాన నగరాలకు తన కేఫ్ సేవను విస్తరించనున్నట్లు గత నెలలో కంపెనీ ప్రకటించింది.
హైదరాబాద్, చెన్నై, పుణే సైతం విస్తరణ జాబితాలో ఉన్నాయని వివరించింది. వార్షిక ప్రాతిపదికన జెప్టో కేఫ్ వ్యాపారం ప్రస్తుతం రూ.160 కోట్ల స్థాయిలో నమోదవుతోందని వెల్లడించింది. కొత్త నగరాల్లో విస్తరణ కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల వార్షిక సగటు రేటు సాధిస్తామని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా సంస్థలో మరో కీలక పరిణామం జరిగింది. చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ మార్టిన్ దినేష్ గోమెజ్ తన పదవికి రాజీనామా చేశారు. కంపెనీలో చేరిన ఏడాదిలోపే ఆయన నిష్క్రమించడం గమనార్హం. జనవరిలో చీఫ్ బ్రాండ్ ఆఫీసర్‌గా చేరిన చందన్ మెండిరట్టా అక్టోబర్ నెలాఖరు నుండి చీఫ్ కల్చర్ ఆఫీసర్ బాధ్యతలతోపాటు హోచ్‌ఆర్ అధిపతిగానూ కొనసాగుతారని కంపెనీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment