One Stop Solutions
-
చాక్లెట్లు కాదు.. రాకెట్లు
కె.జి.రాఘవేంద్రారెడ్డి (సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం) : రండి బాబూ రండి.. కోరుకున్న డిజైన్‌లో రాకెట్ తయారు చేయబడును! వినటానికి ఇది వింతగానే అనిపించినా నిజమే మరి! స్పేస్ స్టార్టప్స్‌లో అగ్రదేశాలు పోటీ పడుతున్నాయి. స్కాట్లాండ్కు చెందిన స్కైరోరా సంస్థ కావాల్సిన రీతిలో రాకెట్లు తయారు చేస్తోంది. ప్రైవేట్ సంస్థలు స మాచారాన్ని పొందేందుకు శ్రమ పడాల్సిన అవసరం లే కుండా తాము చేసి పెడతామని చెబుతోంది. వన్‌స్టాప్ సొల్యూషన్ తరహాలో సేవలందిస్తామని భరోసా ఇస్తోంది. రాకెట్లండీ.. రాకెట్లు! ప్రైవేట్ కంపెనీలు తమ కమ్యూనికేషన్స్, పర్యవేక్షణల సామర్థ్యాలు పెంచుకునేందుకు సొంతంగా రాకెట్లను అంతరిక్ష కక్ష్యలోకి పంపిస్తున్నాయి. గతంలో కేవలం ప్రభుత్వ రంగంలోనే అనుమతించిన మనదేశం ప్రైవేట్ రాకెట్ల ప్రయోగానికి కూడా అవకాశం కల్పిస్తూ ముందుకు వెళుతోంది. స్పేస్ ఎక్స్‌తో ప్రైవేట్ రాకెట్ల రేసును ఎలన్ మస్క్ ప్రారంభించారు. ఆయనకు చెందిన ఉపగ్రహ ఇంటర్నెట్ నెట్వర్క్ 42 వేల శాటిలైట్స్‌తో, జెఫ్ బెజోస్‌కు చెందిన కూపర్ నెట్వర్క్ 3,200 శాటిలైట్స్‌తో, యూకే ప్రభుత్వానికి చెందిన వన్‌వెబ్ నెట్వర్క్ 650 శాటిలైట్స్‌తో ఏర్పాటు చేసేలా పనులు సాగుతున్నాయి. పెద్ద ఎత్తున స్పేస్ స్టార్టప్స్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పేస్ స్టార్టప్స్ పుట్టుకొస్తున్నాయి. అమెరికా, చైనా, భారత్‌తోపాటు ఐరోపా అంతరిక్ష అంకుర పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నాయి. 2030 నా టికి గ్లోబల్ స్పేస్ మార్కెట్లో 10 శాతం వాటాను సొంతం చేసుకునేలా బ్రిటన్ సిద్ధమైంది. దీనికి సంబంధించి యూకే మార్కెట్ విలువ 483 బిలియన్ డాలర్లుగా అంచ నా వేస్తున్నారు. స్కాట్లాండ్కు చెందిన అంతరిక్ష శాస్త్రవేత్త వోలోడిమిర్ లెవికిన్ 2017లో స్కైరోరాని ప్రారంభించా రు. లానార్క్‌షైర్ కంబర్నాల్డ్లోని ఫ్యాక్టరీలో స్కైరో రా తన రాకెట్లని డిజైన్ చేస్తోంది. ఎడిన్బర్గ్ శివార్లలోని టెస్ట్‌బ్లాస్ట్ ఏరియాలో వాటిని ఉంచుతోంది. ప్యాసింజర్ రాకె ట్స్ కాకుండా పేలోడ్ రాకెట్లను తయారు చేస్తోందీ సంస్థ. స్కైరోరా ఫ్లాగ్షిప్ రాకెట్ తొమ్మిది ఇంజన్లు, 50 వేల లీటర్ల ఇంధన సామర్థ్యం, 7 మెట్రిక్ టన్నుల్ని మోసుకెళ్లే సత్తాతో సెకనుకు 8 కి.మీ. వేగంతో దూసుకెళ్లగల ఫ్లాగ్షిప్ రాకెట్‌ని స్కైరోరా సిద్ధం చేసింది. స్కైరోరా ఎక్స్ఎల్ పేరుతో 315 కిలోగ్రాముల పేలోడ్ తీసుకెళ్లగల ఫ్లాగ్షిప్ రాకెట్‌ని ఈ ఏడాది షెట్‌ల్యాండ్ దీవుల నుంచి ప్రయోగించేందుకు సిద్ధమైంది. వ్యవసాయ పరిశ్రమలు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్, బీమా సంస్థలు.. ఇలా భిన్న రంగాలకు సంబంధించి అంతరిక్షం నుంచి ఆప్టికల్, టెంపరేచర్ సెన్సార్స్ లాంటి వాటితో సమాచారం సేకరించి రియల్‌టైమ్‌లో డేటా రూపొందించేందుకు రాకెట్లను తయారు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే మొదటి దశ ప్రాజెక్టును పూర్తి చేసింది. 22.7 మీటర్ల పొడవైన రాకెట్ మొదటి దశ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. స్పేస్ ఎక్స్‌కు భిన్నంగా స్కైరోరా.. రాకెట్ల తయారీలో ఎలన్మస్్కకు చెందిన స్పేస్ఎక్స్ సంస్థకు, స్కైరోరాకు గట్టి పోటీ నడుస్తోంది. స్పేస్ఎక్స్ అనేది బస్సు ప్రయాణంలాంటిదని, ఇతర ప్రయాణికులతో కలసి నిర్దేశించిన ప్రాంతం నుంచే వినియోగించుకునే అవకాశం ఉందని స్కైరోరా సీఈవో లెవికిన్ చెబుతున్నారు. స్కైరో రా మాత్రం ట్యాక్సీ ప్రయాణం లాంటిదని, ప్ర యాణికులు నచ్చిన ప్రాంతానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు బయలుదేరేలా రూపొందించా మని తెలిపారు. స్పేస్ఎక్స్లో రాకెట్ కోసం రెండేళ్ల పాటు నిరీక్షించాల్సి ఉండగా స్కైరోరాలో మా త్రం ఆర్నెల్లు చాలని స్పష్టం చేస్తున్నారు. యూకే అంతరిక్ష పరిశ్రమలో స్కైరోరా సరికొత్త విప్లవాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇదే తరహాలో భారత్, చైనా సొంత రాకెట్లను తయారు చేసే స్పేస్ స్టార్టప్స్‌ని ప్రోత్సహిస్తూ అంతరిక్ష రంగంలో దూసుకెళ్లే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. -
రిలయన్స్, ఫేస్బుక్: వన్ స్టాప్ సూపర్ యాప్
సాక్షి, న్యూఢిల్లీ : ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ బహుళార్ధసాధకంగా వన్‌స్టాప్ సూపర్ యాప్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. వీచాట్ మాదిరిగానే ఈ కొత్త యాప్ ద్వారా, సోషల్ మీడియా, డిజిటల్ చెల్లింపులు, గేమింగ్‌తో పాటు హోటల్ బుకింగ్, తదితర సేవలతో వన్-స్టాప్ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్నాయి. ఇందుకు మోర్గాన్ స్టాన్లీని కూడా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్‌గా నియమించుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురానున్న ఈ యాప్ తుది రూపు ఎలా వుంటుందనే దానిపై పూర్తి స్పష్టత రానప్పటికీ ప్రధానంగా వాట్సాప్ వినియోగదారులే లక్ష్యంగా దీన్ని రూపొందించనుంది. ఈ యాప్ లో అన్ని అంశాలను మిళితం చేసేలా అమెరికాకు చెందిన టాప్ కన్సల్టెంట్లను నియమించుకుందిట. (యాపిల్ ఐఫోన్ ఎస్ఈ వచ్చేసింది..) కాగా రిలయన్స్ జియోలో 10 శాతం వాటాను కొనుగోలుకు ఫేస్బుక్ రంగం సిద్దం చేసుకున్న సంగతి విదితమే. ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధపడుతున్న తరుణంలో కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా విధించిన ప్రయాణ నిషేధంతో చర్చలు ఆగిపోయాయి. ఈ సవాళ్ల నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రాజెక్టు ఆలస్యం కావచ్చని భావిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా ఫేస్బుక్ భారతదేశంలో తన డిజిటల్ పరిధిని విస్తరించుకోవాలని భావిస్తోంది. చదవండి: (ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త) 76.80 స్థాయికి పడిపోయిన రూపాయి -
హర్యానాలో ‘విశాక’ కొత్త ప్లాంటు!
♦ మార్చికల్లా కార్యకలాపాలు ప్రారంభం ♦ భారత్‌లో టాప్–1గా నిలిచిన వి–నెక్ట్స్ ♦ నిర్మాణాలకు వన్‌స్టాప్ సొల్యూషన్స్ ♦ విశాక ఇండస్ట్రీస్ జేఎండీ వంశీ కృష్ణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డైవర్సిఫైడ్ కంపెనీ విశాక ఇండస్ట్రీస్... పూర్తిస్థాయి నిర్మాణ రంగ కంపెనీగా రూపాంతరం చెందుతోంది. ఫైబర్ సిమెంట్ ఆకృతులు, వి–బోర్డ్స్‌తో నిర్మాణ రంగానికి ఒన్‌స్టాప్ సొల్యూషన్స్ అందించే సంస్థగా మారుతున్న విశాక.. తమ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని... నెలకు 6వేల టన్నుల ఫైబర్ సిమెంటు బోర్డులు, ప్యానెళ్ల ఉత్పత్తి సామర్థ్యంతో హర్యానాలో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం జజ్జర్ జిల్లాలో 30 ఎకరాలను కొనుగోలు చేసింది. రూ.80 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంటులో 2018 మార్చికల్లా ఉత్పత్తి ప్రారంభమవుతుందని సంస్థ జాయింట్ ఎండీ జి.వంశీ కృష్ణ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. ఇది అందుబాటులోకి వస్తే సామర్థ్యం పరంగా దేశంలో ఫైబర్ సిమెంటు బోర్డుల ఉత్పత్తిలో నెంబర్ వన్‌గా నిలుస్తామన్నారు. ప్లాంటుకు కావాల్సిన నిధులను అంతర్గత వనరుల ద్వారా సమకూరుస్తున్నామని చెప్పారాయన. కంపెనీకి ఇప్పటికే తెలంగాణలోని మిర్యాలగూడతో పాటు మహారాష్ట్రలోని పుణేలో ఫైబర్ సిమెంటు బోర్డుల తయారీ ప్లాంట్లున్నాయి. వీటి సామర్థ్యం నెలకు 10,000 టన్నులు. గణనీయ స్థాయికి వి–నెక్ట్స్ వాటా... దేశంలో ఫైబర్ సిమెంటు బోర్డులు, ప్యానెళ్ల మార్కెట్ ప్రస్తుతం రూ.600 కోట్లుంది. ఇది ఏటా 15–20 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో విశాకకు చెందిన వి–నెక్ట్స్ బ్రాండ్ అగ్రస్థాయిలో ఉండి 25 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. ‘‘2016–17లో రూ.1,007 కోట్ల మొత్తం టర్నోవర్‌లో వి–నెక్ట్స్ ద్వారా రూ.150 కోట్లు సమకూరింది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 25 శాతం అధికం’’ అని వంశీకృష్ణ తెలియజేశారు. 2019–20 నాటికి రూ.1,400–1,500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నామని, దాన్లో వి–నెక్ట్స్ వాటా 20 శాతం దాటుతుందని ఆయన అంచనా వేశారు. బెంగళూరులోని నియో మాల్, కేరళ మెట్రో కార్యాలయం, ముంబై ఎయిర్‌పోర్టు వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో వి–నెక్ట్స్ ఉత్పత్తులు వాడారు. ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, మంత్రి డెవలపర్స్, మై హోమ్, టీసీఎస్, రిలయన్స్ తదితర సంస్థలు క్లయింట్లుగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ప్రాజెక్టుకు అతి తక్కువ సమయంలో వి–బోర్డ్‌లతో మోడల్ హౌజ్‌ను నిర్మించింది కూడా. భవనాలను నిర్మించి ఇస్తాం.. పర్యావరణానికి అనుకూలం కావటంతో పాటు మన్నిక కూడా ఎక్కువ కావటంతో అత్యాధునిక, అందమైన భవనాల నిర్మాణంలో ఫైబర్ సిమెంటు బోర్డుల వాడకం పెరుగుతోంది. ‘‘ఫైబర్ సిమెంట్ బోర్డులతో ఇంటిని నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చు. పూర్తిస్థాయిలో ఇంటిని నిర్మించి ఇచ్చే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం. ఇటుకలు, కలపకు బదులు పూర్తిగా ఫైబర్ సిమెంటు బోర్డులు వాడతాం. ఇవి మంటలకు అంటుకోవు. అలాగే తడవవు కూడా. విభిన్న రంగుల్లో చిత్రాలతో తయారు చేయొచ్చు. తక్కువ సమయంలో నిర్మాణం పూర్తవుతుంది. పిల్లర్లు, స్లాబ్ మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్లా ఫైబర్ సిమెంటు బోర్డులతో గోడలు, కిచెన్ క్యాబినెట్లు, షెల్ఫ్‌లు, వార్డ్రోబ్లు, వాల్ ప్యానె ల్స్, ఫాల్స్ సీలింగ్, పార్టీషన్స్, మెజ్జనైన్ ఫ్లోరింగ్, క్లాడింగ్ వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. బయటి వాతావరణంతో పోలిస్తే లోపల 6 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. నిర్వహణ వ్యయం అసలే లేదు. కార్పెట్ ఏరియా ఎక్కువగా వస్తుంది’’ అని వంశీకృష్ణ వివరించారు. 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అందమైన ఇంటి నిర్మాణానికి సుమారు రూ.18 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. పెరుగుతున్న షేరు ధర విశాక ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటల్ ప్రస్తుతం రూ.806 కోట్లు. ఏడాది కనిష్ఠ ధర రూ.138తో పోలిస్తే ఈ 12 నెలల్లో షేరు ఏకంగా 400% పైగా పెరిగింది. బుధవారంనాడు రూ.560కి చేరిన ఈ షేరు ధర... గడిచిన కొన్ని నెలల తరవాత గురువారం తొలిసారి కరెక్షన్కు గురై రూ.510 వద్దకు చేరింది. గడిచిన నెలరోజుల్లోనే కంపెనీ షేరు ధర ఏకంగా 60 శాతం వరకూ పెరగటం గమనార్హం.