ఇండియన్ రైల్వే కేటరింగ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికుల కోసం ఈ - వ్యాలెట్ పేరుతో అధునాతనమైన సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవల్ని వినియోగించుకోవడం ద్వారా ప్రయాణికులు ఎలాంటి సందర్భాలలోనైనా సులభంగా రైల్వే టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
త్వరలో స్కూల్స్, కాలేజీలకు సమ్మర్ హాలిడేస్. పండగలు.. పబ్బాలు..పెళ్లిళ్లు.. శుభకార్యాలకు ఊరెళ్లాల్సి వస్తుంది. లేదంటే ఇతర అత్యవసర సమయాల్లో ట్రైన్‌లలో దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇందుకోసం రోజులు .. నెలల ముందే నుంచే ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలి. తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే తలకు మించిన భారం.
ఒక్కోసారి టికెట్ బుక్ చేసుకొని పేమెంట్ చేసే సమయంలో సర్వర్ డౌన్ అవుతుంది. బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే.. ఆ డబ్బులు తిరిగి మన అకౌంట్‌కు ఎప్పుడు డిపాజిట్ అవుతాయో? లేదో తెలియదు. ఈలోగా ఇంకో టికెట్ బుక్ చేసుకోవాలంటే.. మళ్లీ కొంత మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. ఇదిగో..! ఈ తరహా సమస్యల పరిష్కార మార్గంగా ఐఆర్‌సీటీసీ ఈ - వ్యాలెట్ సేవల్ని ప్రయాణికులకు అందిస్తుంది.
ఐఆర్‌సీటీసీ ఈ-వ్యాలెట్ సేవల వినియోగం ద్వారా రద్దీ సమయాల్లో ట్రైన్ టికెట్‌ను సులభంగా బుక్ చేసుకోవచ్చు. బ్యాంకుల సర్వర్, రైల్వే సేవల్లో అంతరాయం వంటి సందర్భాల్లో ట్రైన్ టికెట్ బుకింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రయాణం రద్దుతో.. టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ డబ్బులు మరుసటి రోజు ఈ వ్యాలెట్‌లో డిపాజిట్ అవుతాయి. ఇందుకోసం ప్రయాణికులు చేయాల్సిందల్లా ఈ-వ్యాలెట్‌లో లాగిన్ అవ్వడమే. ఈ లాగిన్ సేవలు మూడేళ్ల పాటు ఉచితంగా వినియోగించుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకున్న ప్రతిసారి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన పనిలేదు.
ఐఆర్‌సీటీసీ ఈ వ్యాలెట్‌లో (Irctc E-wallet) ఇలా లాగిన్ అవ్వాలి
♦ఐఆర్‌సీటీసీ వెబ్ పోర్టల్ ఓపెన్ చేయాలి.
♦అందులో ఐఆర్‌సీటీసీ ఈ-వ్యాలెట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
♦రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి పాన్ - ఆధార్ నెంబర్‌తో వెరిఫై చేసుకోవాలి
♦మీ ప్రొఫైల్ వెరిఫికేషన్ విజయవంతం అయితే మీరు డైరెక్ట్‌గా ఐఆర్‌సీటీసీ ఈ-వ్యాలెట్ రిజిస్ట్రేషన్‌లోకి వెళతారు.
♦ఐఆర్‌సీటీసీ వ్యాలెట్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.50 చెల్లించాలి
♦ఈ ప్రాసెస్ పూర్తయితే వ్యాలెట్ రిజిస్ట్రేషన్ లాగ్ అవుట్ అవుతుంది.
ఐఆర్‌సీటీసీ ఈ-వ్యాలెట్‌లోకి డబ్బుల్ని ఎలా డిపాజిట్ చేయాలి
♦ఐఆర్‌సీటీసీ అకౌంట్‌లో లాగిన్ అవ్వాలి
♦లాగిన్ అనంతరం మీరు ఐఆర్‌సీటీసీ ఈ-వ్యాలెట్ డిపాజిట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
♦అక్కడ రూ.100 నుంచి రూ.10 వేల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.
♦మీకు కావాల్సిన మనీని రూ.100, రూ.500 ఇలా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ మోడ్ నెట్ బ్యాంకింగ్‌పై క్లిక్ చేసి మీ అకౌంట్ ఏ బ్యాంక్‌లో ఉందో సదరు బ్యాంక్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ్ సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
♦ఆ మని కేవలం ఐఆర్‌సీటీసీ ఈ - వ్యాలెట్‌లో ఉంటాయి. విత్ డ్రా చేసుకొని వినియోగించుకునేందుకు వీలు లేదు. కేవలం ట్రైన్ టికెట్‌లను బుక్ చేసుకునేందుకు మాత్రమే ఆ డబ్బుల్ని వాడుకోవాల్సి ఉంటుంది.
♦విజయవంతంగా డిపాజిట్ చేయడం పూర్తయితే ఐఆర్‌సీటీసీ ఈ - వాలెట్‌లో మీరు ఎంత డిపాజిట్ చేశారో డిపాజిట్ హిస్టరీలో కనిపిస్తుంది.
♦ఇక ఈ- వ్యాలెట్‌లో డబ్బుల్ని డిపాజిట్ చేసిన తర్వాత ట్రైన్ టికెట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ క్యాన్సిల్ అయితే ఆ మరుసటి రోజే మీ డబ్బులు మీ ఈ - వ్యాలెట్ అకౌంట్‌లో డిపాజిట్ అవుతాయి.
చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. పాన్ - ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్!
Comments
Please login to add a commentAdd a comment