సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వరుసగా రెండో ఏడాది కూడా జలకళ సంతరించుకున్న నేపథ్యంలో రైతుల కళ్లలో ఆనందం వెల్లువిరిస్తోంది. భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగు పెట్టిన వేళా విశేషంతో ప్రాజెక్టులన్నీ నిండుతున్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో 12 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందని, శనివారం పులిచింతల నుంచి నీరు విడుదల చేస్తామని తెలిపారు. గత నెల 27 నుంచి పోతిరెడ్డి పాడు ద్వారా నీటిని విడుదల చేస్తున్నామని, రాయలసీమలోని అన్ని ప్రాజెక్టుల్లో నీటిని నింపుతామని మంత్రి స్పష్టం చేశారు.
శుక్రవారం మంత్రి అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ... ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా కరువుకి శాశ్వత పరిష్కారం చూపుతాం. రాయలసీమ లిఫ్ట్ టెండర్లు పూర్తి చేశాం. ఎన్ని అడ్డంకులు సృష్టించిన సీఎం జగన్ పూర్తి చేసి చూపిస్తారు. నీటి పంపకాల్లో మాకు వివాదాలు అవసరం లేదు. ఏపీకి రావాల్సిన వాటా నీటిని మాత్రమే వినియోగించుకుంటాం. గోదావరి వరద వలన ఎక్కడా గండి పడలేదు. వరదను సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. సీఎం జగన్ వస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రుజువైంది. గోదావరి వరదపై ప్రతిపక్ష టీడీపీ చౌకబారు ఆరోపణలు చేస్తోంది. క్లిష్ల సమయంలోనూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు హైదరాబాద్ వెళ్లి దాక్కున్నారు.
Comments
Please login to add a commentAdd a comment