కిచెరైవల్(కేరళ): మనుషుల మధ్య కులమతాల బేధాలు తొలగిపోవడానికి ఇది ఒక ఉదాహరణంగా చెప్పవచ్చు. నాటి రోజుల్లో దళితులకు దేవాలయాల్లోకి ప్రవేశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు శివుడి గర్భగుడిని కృష్ణా అనే దళిత పూజారితో తెరిపించారు. ఈ సంఘటన కేరళలోని కిచెరైవల్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. ట్రావెన్కోర్ దేవస్థాన్ రిక్రూట్మెంట్ బోర్డు ఆరుగురు దళిత పూజారులను ఎంపిక చేసింది. వీరిలో ఎస్సీ పులియా కమ్యూనిటికి చెందిన కృష్ణా అనే వ్యక్తి కూడా ఉన్నాడు.
కేరళలో దళితులను పూజరులుగా నియమించడం ఇదే మొదటిసారి. కొంతమంది దళిత పూజారులను రిజర్వేషన్ కింద గవర్నమెంట్ ఉద్యోగులుగా నియమించడం ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఈ సందర్భంగా కృష్ణా మాట్లాడుతూ.. ‘మాది త్రిసూర్‌లోని చాలక్కుడి అనే ప్రాంతం. దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఎర్నాకుళంలోని దేవి ఆలయంలో పూజరిగా పని చేశాను. అక్కడి నుంచి నేను వస్తుంటే చాలా మంది భక్తులు భావోద్వేగానికి గురయ్యారు.
కృష్ణా సంస్కృతంలో పీజీ చేశాడు. ఇతని తల్లిదండ్రులు రవి, లీలా. 12 సంవత్సరాల వయసులోనే ఎర్నాకుళం తంత్రాయ పీఠంలో చేరనని కృష్ణా చెప్పాడు.‘నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే మా ఊరిలో పూజారిగా పనిచేశానని తెలిపాడు.’ ట్రావెన్‌కోర్ దేవస్థాన్ బోర్డ్ కమిషనర్ సీపీ రామ రాజా ప్రేమ ప్రసాద్ మాట్లాడుతూ.. కొత్తగా ఎంపికైనా పూజారులు 15 రోజుల్లో వారికి కేటాయించిన దేవాలయాల్లో విధులకు హజరుకావాలని తెలిపారు. కేరళ హిందూ ఐక్యా వేదిక జనరల్ సెక్రటరీ ఈ ఎస్ బిజు మాట్లాడుతూ.. గతంలో మాదిరి పరిస్థితులు ప్రస్తుతం లేవు. ప్రజల ఆలోచన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. దళిత పూజారులను ప్రజలు సంతోషంగా స్వాగతిస్తున్నారని ఆయన అన్నారు.
దళితుడితో గర్భగుడి తెరిపించారు..
Published Tue, Oct 10 2017 12:03 PM | Last Updated on Tue, Oct 10 2017 1:16 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment