preist
-
గూగుల్‌పై చిల్కూరు పూజారి రంగరాజన్ ఆగ్రహం
హైదరాబాద్, సాక్షి: చిల్కూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్‌పై మండిపడుతున్నారు. ఆలయానికి సంబంధించి గూగుల్‌లో చూపిస్తున్న తప్పుడు సమాచారంపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. మీడియాతో స్పందించారు.గూగుల్‌లో చిల్కూరు టెంపుల్ అని టైప్ చేస్తే.. కింద శనివారం, ఆదివారం రోజుల్లో గుడి క్లోజ్ అంటూ గూగుల్ సమాచారం చూపిస్తోంది. తిరిగి సోమవారం ఉదయం 8గం.కు తెరుచుకుంటుందని ఉంది. అయితే.. గూగుల్ చూపించే ఆ సమాచరం తప్పుడుదని రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని వేళలా ఆలయం యధావిధిగా తెరిచే ఉంటుంది. గూగుల్ మాత్రమే కాదు.. అలాంటి తప్పుడు ప్రచారం ఎక్కడ జరిగినా మేం ఖండిస్తాం అని అన్నారాయన.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరు బాలాజీ టెంపుల్ ఉంది. వీసా బాలాజీ టెంపుల్‌గా దీనికంటూ ఓ గుర్తింపు ఉంది. విదేశాలకు వెళ్లదల్చుకున్న వాళ్లు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. శనివారం, సెలవు రోజుల్లో, పండుగల ప్రత్యేక సందర్భాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. వారం రోజుల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు భక్తులు 108 ప్రదక్షిణలు చేస్తూ కనిపిస్తుంటారు. -
చెన్నై టూ హైదరాబాద్: అప్సర కేసులో సినిమా రేంజ్ ట్విస్ట్‌లు..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ పరిధిలో నర్కుడ వద్ద అప్సర అనే యువతిని పూజారి సాయికృష్ణ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా, హత్య కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈ సందర్బంగా వారి మధ్య శారీరక సంబంధమే హత్యకు కారణమని స్పష్టం చేశారు. కాగా, డీసీపీ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘తమిళనాడులోని చెన్నైకి చెందిన అప్సర హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అప్సర డిగ్రీ పూర్తి చేసింది. సినీ రంగంలో కొద్దిరోజులు పనిచేసింది. 2022లో ఆమె హైదరాబాద్‌కు వచ్చారు. అప్సర తండ్రి కాశీ ఆశ్రమంలో నివసిస్తున్నారు. కోనసీమ జిల్లా గన్నవరానికి చెందిన సాయికృష్ణ మార్కెటింగ్‌లో ఎంబీఏ చేశాడు. 2010లో సాయికి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలున్నారు. ప్రస్తుతం పూజారిగా ఉన్నాడు. బిల్డింగ్ కాంట్రాక్టర్‌గా కూడా పనిచేస్తున్నాడు. అయితే, ఇద్దరికీ బంధుత్వం లేదు, ఒక్కటే కమ్యూనిటీ. అప్సర సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయానికి వచ్చేది. అదే ఆలయంలో సాయి పూజరిగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆమెతో సాయి పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఇదే వారి మధ్య శారీరక సంబంధానికి దారి తీసింది. ఇటీవలే సాయికి వివాహం జరిగినట్టు అప్సరకు తెలిసింది. దీంతో, తనను పెళ్లి చేసుకోవాలని 2023 మార్చి నుంచి సాయిపై ఒత్తిడి చేసింది. ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశ్యంతోనే సాయి.. అప్సరను హత్య చేశాడు. ఈనెల 3వ తేదీన కోయంబత్తూరుకు వెళ్దామని చెప్పి అప్సరను సాయి తన కారులో ఎక్కించుకున్నాడు. ఆరోజు రాత్రి 8.15 గంటలకు సరూర్ నగర్ నుంచి కారులో స్టార్ట్ అయ్యారు. 11 గంటలకు శంషాబాద్ సరిహద్దుల్లోకి తీసుకెళ్లాడు. అప్పటికే అప్సర కారు ముందు సీటులో పడుకుని ఉంది. ఈ క్రమంలో సుల్తాన్‌పూర్‌వద్ద ఉన్న గోశాల వైపు కారును మళ్లించాడు. ముందు సీటులో ఉన్న అప్సర ముఖంపై కారు కవరింగ్ షీట్ సాయంలో బలవంతంగా నొక్కాడు. దీంతో, అప్సర ప్రతిఘటించింది. అయితే, సాయి అప్పటికే తన వద్ద ఉన్న రాయితో అప్సర తలపై కొట్టాడు. ఇలా అప్సర తలపై 10సార్లు కొట్టడంతో ఆమె చనిపోయింది’ అని తెలిపారు. మరోవైపు.. సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని మ్యాన్ హోల్లో నుండి అప్సర మృతదేహన్ని పోలీసులు వెలికితీశారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆమె రెండోసారి గర్భం దాల్చిందని అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇతరులతో చనువుగా ఉన్న అప్సర.. వాళ్ల ద్వారా గర్భం దాల్చి ఉంటుందని సాయికృష్ణ అనుమానించినట్టు తెలుస్తోంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే.. ఈ చిక్కుముడి వీడే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: హాయ్ డియర్.. హోటల్లో కలుద్దామా.. యువకులతో మాటలు కలిపి.. -
అప్సరను పూజారి సాయికృష్ణ అందుకే చంపాడు
సాక్షి, క్రైమ్: శంషాబాద్ పరిధిలో నర్కుడ వద్ద జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు చేధించారు. పక్కా క్రిమినల్ ఆలోచనతోనే అప్సర(30)ను పూజారి సాయికృష్ణ(36) చంపాడని పోలీసులు వెల్లడించారు. అప్సరను గాఢంగా ప్రేమించానని చెప్పుకుని తిరిగిన సాయికృష్ణ ఎందుకు చంపాల్సి వచ్చింది?, చంపి ఆపై సాక్ష్యాలను మాయం చేసేందుకు ఏం చేశాడనే వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. నిందితుడు సాయికృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు.. సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయానికి సమీపంలో ఉన్న గుడిలో సాయికృష్ణ పెద్దపూజారి. ఆ దగ్గర్లోనే శ్రీ వెంకటేశ్వరకాలనీలో అతను ఉంటున్నాడు. ఇక ఈ గుడి పక్కనే ఉండే ఇంటిలో అప్సర ఉంటోంది. గుడికి వచ్చే క్రమంలో అప్సరతో సాయికృష్ణకు పరిచయం ఏర్పడింది. శంషాబాద్ గోశాలకు ఇద్దరూ కలిసి వెళ్లేవారు. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. నిందితుడు సాయికృష్ణకు ఇదివరకే వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా అప్సర సాయికృష్ణను ఇష్టపడింది. గతంలో అప్సర గర్భం దాల్చడంతో.. అబార్షన్ చేయించినట్లు సాయికృష్ణ చెప్పాడు. ఇతరులతో చనువుగా ఉండడం, పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి చేయడంతోనే ఘాతుకానికి పాల్పడ్డాడని ఇప్పుడు అంటున్నాడు. శంషాబాద్ సీఐ శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 5వ తేదీన తన అక్క కూతురు కనిపించకుండాపోయిందని సాయికృష్ణ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. అయితే.. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఈ కేసును ఛేదించాం. జూన్ 3వ తేదీన నర్కుడ దగ్గర్లో చంపేశాడు. ఆపై మృతదేహాన్ని ఓ కవర్లో చుట్టి కారులో వేసుకుని.. సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వెనకాల ఉన్న డ్రైనేజీలో పడేశాడు. ఈ విషయం అప్సర కుటుంబ సభ్యులెవరికీ తెలియదు. అప్సర మిస్సింగ్ కేసులో అనుమానం రావడంతోనే సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నాం. విచారణలో.. నిజం ఒప్పుకున్నాడు. రెండోసారి గర్భం? సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని మ్యాన్ హోల్ లో నుండి అప్సర మృతదేహన్ని పోలీసులు శుక్రవారంనాడు వెలికితీశారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆమె రెండోసారి గర్భం దాల్చిందని అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు. ఇతరులతో చనువుగా ఉన్న అప్సర.. వాళ్ల ద్వారా గర్భం దాల్చి ఉంటుందని సాయికృష్ణ అనుమానించి ఉంటాడని, దీనికి తోడు ఆమె పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో చంపేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే.. ఈ చిక్కుముడి వీడే అవకాశం ఉంది. సాయికృష్ణ అలా చెప్పాడు: అప్సర తల్లి పూజారి ఘాతుకంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పూజారి అయ్యి ఉండి ఇలా చేస్తాడని ఊహించలేదని అప్సర తల్లి వాపోతోంది. అప్సర గతంలో తమిళ చిత్రంలో నటించింది. అయితే ఆవైపు వద్దని చెప్పి చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చేశాం. ఆ తర్వాత గుడిలో అప్సర-సాయికృష్ణకు పరిచయం ఏర్పడింది. సాయికృష్ణ తరచూ మా ఇంటికి వస్తుండేవాడు. మా అమ్మాయితో సాయికృష్ణకు ఉన్న సంబంధం ఏంటో నాకు తెలియదు. అయితే.. జూన్ 3వ తేదీన మా అమ్మాయి కోయంబత్తూరు వెళ్తున్నట్లుగా చెప్పి వెళ్లింది. సాయి తనను శంషాబాద్‌లో దించుతాడని చెప్పింది. కానీ, మరుసటి రోజున మా అమ్మాయి నుంచి ఎలాంటి సమాచారం లేదు. సాయి కృష్ణని అడిగితే.. తన స్నేహితులతో అప్సర భద్రాచలం వెళ్లిందని చెప్పాడు. అంబేద్కర్ స్టాచ్యూ వద్ద దించానని అన్నాడు. కానీ, ఆమె భద్రాచలం వెళ్లిన ఆనవాలు లభించలేదు. మా అమ్మాయిని ఎవరితో భద్రాచలం పంపావని నిలదీశాను. కానీ, అతని దగ్గరి నుంచి బదులు రాలేదు. సాయికృష్ణని పోలీసులు గట్టిగా నిలదీస్తే.. అప్పుడు అప్సరను చంపానని చెప్పాడు. వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే అప్సరను చంపానని సాయి కృష్ణ అంటున్నాడు. అందులో వాస్తవం ఉండకపోవచ్చు. సాయికృష్ణకు ఉరి శిక్ష పడాల్సిందే అని అప్సర తల్లి డిమాండ్ చేస్తోంది. అప్సర మంచిది ఈ ఏరియాలోనే సాయికృష్ణ పెద్ద పూజారి. అప్సరతో అతనికి మంచి స్నేహం ఉంది. సాయికృష్ణ రాత్రి 11 గంటల వరకు అప్సర ఇంట్లోనే ఉండేవాడు. ఒక్కోసారి ఇద్దరూ కలిసి రాత్రి 12 తర్వాత కూడా బైక్ మీద బయటకు వెళ్లేవాళ్లు. కానీ, అప్సర చాలా మంచిది. పూజారి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడంటే నమ్మలేకపోతున్నాం అని అప్సర ఉంటున్న ఇంటి యజమాని చెప్తున్నాడు. వెలుగులోకి కీలక విషయాలు కోయంబత్తూరు వెళ్తున్నానని, సాయికృష్ణ తనను డ్రాప్ చేస్తాడని తల్లికి చెప్పి ఇంట్లో చెప్పి బయల్దేరింది అప్సర. ఇద్దరూ కలిసి ఫోర్డ్ కారులో శంషాబాద్ రాళ్ల గూడ వైపు వెళ్లారు. అక్కడ భోజనం చేశారు. ఆపై కారులో ఫ్రంట్ సీట్లో రిలాక్స్ మోడ్‌లో పడుకుంది అప్సర. ఇదే అదనుగా హత్య కోసమే తెచ్చిన బెల్లం దంచే దుడ్డుకర్రను బయటకు తీశాడు సాయికృష్ణ. ఆ కర్రతోనే ఆమె తలపై బాది చంపేశాడు. ఆపై కవర్లో ఆమె డెడ్‌బాడీని ఉంచి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ కారు రోజంతా ఇంటి ముందే పార్క్ చేశాడు. ఆ మరుసటి రోజు మ్యాన్‌హోల్‌లో అప్సర మృతదేహాన్ని పడేసి.. పైన మట్టి కప్పి వెళ్లిపోయాడు. హత్యకు ఉపయోగించిన కారును పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. -
వంద అడుగుల కొండపై నుంచి జారిపడి...
-
‘‘దేవుడి ఆధార్ కార్డ్ తెస్తేనే.. పంట కొంటాం’’
లక్నో: మన భారతదేశ పౌరులం అని చెప్పుకోవాలన్నా.. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మనకు దక్కాలన్నా.. అంతేందుకు ఈ దేశ జనాభాలో మన పేరు ఉండాలన్నా.. ఆధార్ కార్డ్ తప్పనిసరి అయ్యింది. మనుషులం కాబట్టి మనకు ఏదో ఓ గుర్తింపు కార్డు అవసరం.. కానీ దేవుడికి కూడా ఆధార్ కావాలంటే.. ఏం చేయాలి.. ఎక్కడికి వెళ్లాలి. అసలు దేవుడి ఆధార్ కార్డ్ అడిగిన వారిని ఏమనుకోవాలి.. అయితే ఇది చదవండి. ఉత్తరప్రదేశ్ బండాలోని అత్తారా తహసీల్‌లోని కుర్హారా గ్రామానికి చెందిన మహంత్ రామ్‌కుమార్ దాస్ స్థానికంగా ఉన్న సీతారామచంద్ర ఆలయంలో ప్రధాన పూజారిగా మాత్రమే కాకా ఆలయ బాగోగులు చూసుకుంటుండేవాడు. ఆలయానికి సంబంధించిన భూమిలో గోధుమ పంట వేశాడు. 100 క్వింటాళ్లకు పైనే పండింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం దాస్ తమ పంటను అమ్మడానికి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని.. పంట తీసుకుని ప్రభుత్వ మార్కెట్ యార్డ్‌కి వెళ్లాడు. అక్కడ అధికారులు పెట్టిన కండీషన్‌కు దాస్‌కు పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఇంతకు ఆ షరతు ఏంటంటే పంట కొనాలంటే.. భూమి ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉందో వారి ఆధార్ కార్డు తీసుకురావాలి అన్నారు అధికారులు. దానికి ఆ పూజారి ఎందుకంత షాక్ అయ్యాడంటే.. ఆ భూమి దేవుడి పేరు మీద అంటే జానకిరాముల పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. అంటే ఇప్పుడు దాస్ తన పంట అమ్మాలంటే శ్రీరాముడు, సీతా దేవిల ఆధార్‌కార్డ్స్ తీసుకురావాలి. చేసేదేంలేక దాస్ సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) సౌరభ్ శుక్లాతో తన గోడు వెళ్లబోసుకున్నాడు. అయితే ఆధార్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయలేమని.. పంట కొనలేమని ఆ అధికారి తేల్చి చెప్పాడు. ఈ సందర్భంగా పూజారి దాస్ గత ఏడాది 150 క్వింటాళ్ల ఉత్పత్తులను ప్రభుత్వ మండీలో విక్రయించానన్నాడు. గత కొన్నేళ్లుగా తాను దేవుడి మాన్యంలో పండిన పంటను విక్రయిస్తున్నానని, అయితే ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదని వాపోయాడు. ఇప్పుడు పంట అమ్మకపోతే తన కుటుంబం పస్తులతో చావడం తప్ప వేరే మార్గం లేదని కంట తడి పెట్టకున్నాడు. ఈ సందర్భంగా జిల్లాల సరఫరా అధికారి గోవింద్ ఉపాధ్యాయ మాట్లాడుతూ మఠాలు, ఆలయాల నుంచి వచ్చే పంట ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. కొనుగోలు విధానంలో అలాంటి నిబంధనలు ఏవీ లేవు, గతంలో “ఖటౌని” (భూ రికార్డులు) ఆమోదయోగ్యమైనవని, అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయిందని గోవింద్ తెలిపారు. చదవండి: ఆధార్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లో అడగొద్దు 2నిముషాల్లో ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి! -
షాకింగ్: పురుషుడనుకుంటే.. గర్భవతని తెలిసింది
వార్సా: ఇన్నాళ్లు తాము పురుషుడిగా భావించిన ఓ ఈజిప్ట్ మమ్మీ గురించి ఆశ్చర్యకరమైన అంశాలు తెలిసి.. పురావస్తు శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. వారిని అంత ఆశ్చర్యానికి గురి చేసిన ఆ విషయం ఏంటంటే.. దాదాపు శతాబ్దానికి పైగా తాము పురుషుడిగా భావిస్తున్న మమ్మీ మహిళదని.. అందునా గర్భవతి అని తెలిసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఆ వివరాలు.. 19వ శతాబ్దంలో పోలాండ్లోని నాసెంట్ యూనివర్శిటీ ఆఫ్ వార్సా పురాతన వస్తువులను సేకరించడం ప్రారంభించింది. ఆ సమయంలో పూజారిదిగా భావిస్తున్న ఓ మమ్మీని ఇక్కడకు తీసుకువచ్చారు. దాదాపు శతాబ్దానికి పైగా ఆ మమ్మీని హోర్-దేహుతి అనే పురాతన ఈజిప్టు పూజారికి చెందినదని భావించారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలో వార్సా మమ్మీ ప్రాజెక్ట్‌లోని శాస్త్రవేత్త మార్జెనా ఓజారెక్-స్జిల్కే నేషనల్ మ్యూజియంలో ఉన్న మమ్మీకి గురువారం సీటీ స్కాన్ నిర్వహిస్తుండగా ఓ అంశం ఆమెను ఆశ్యర్యానికి గురి చేసింది. ఈ సందర్భంగా ఓజారెక్-స్జిల్కే మాట్లాడుతూ.. ‘‘నేను సదరు మమ్మీ జననేంద్రియాలను పరిశీలిస్తుండగా.. లోపల నాకు చిన్న పాదం లాంటి ఆకారం కనిపించింది. దీని గురించి స్పష్టత కోసం శాస్త్రవేత్త అయిన నా భర్తను పిలిచి.. నేను గమనించని విషయం తనకు తెలిపాను. ఆయన దాన్ని పరిశీలనగా చూసి.. ‘‘అవును నీకు కనిపించింది పాదమే. ఈ మమ్మీ గర్భవతి. తన కడుపులో బిడ్డ ఉంది. ఆ పిండం వయసు 26-28 వారాల మధ్య ఉంటుంది’’ అని తెలిపారు’’ అన్నారు ఓజారెక్. ‘‘‘‘ఇన్నాళ్లు మనం పురుషుడుగా భావిస్తున్న ఈ మమ్మీ మహిళ. తన వయసు 28 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుంది’’ అని నా భర్త తెలిపారు. ఆయన చెప్పిన విషయం నన్ను షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే దాదాపు 100 ఏళ్లకు పైగా సదరు మమ్మీని పురుషుడిగా భావిస్తున్నాం. తను ఇప్పుడు మహిళ అని.. అందునా గర్భవతి అని తెలిసి చాలా షాకయ్యాం’’ అన్నారు ఓజారెక్. ఓజారెక్ మాట్లాడుతూ.. ‘‘సదరు మహిళ మృతికి కారణం సరిగా తెలియలేయడం లేదు. కాకపోతే గర్భం వల్లనే ఆమె మరణించి ఉంటుందని భావిస్తున్నాం. ఈ కాలంలో అయితే మన దగ్గర ఆధునిక వైద్యం అందుబాటులో ఉంది. గర్భవతిగా ఉన్నప్పుడు ఏ సమస్యనైనా ముందుగా తెలుసుకునే వాళ్లం. కానీ అప్పట్లో అలా కాదు. పైగా మూఢనమ్మకాలు ప్రబలంగా ఉండేవి. ఇక ఈ మమ్మీ స్త్రీ అని.. అందునా గర్భవతి అని తెలిసిన నాటి నుంచి అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. పురాతన ఈజిప్టు సమాజంలో మహిళల జీవిన విధానం ఎలా ఉండేది.. ఈజిప్టు మతాచారాల ప్రకారం పిల్లలను ఎలా చూసేవారు.. గర్భంలోని పిండానికి కూడా పునర్జన్మ, ఆత్మ వంటివి వర్తిస్తాయని భావించేవారా వంటి తదితర విషయాల గురించి అధ్యాయనం చేయాల్సి ఉంది’’ అని ఓజారెక్ తెలిపారు. చదవండి: 3 వేల ఏళ్ల తర్వాత బయటపడిన ‘బంగారు నగరం’ -
‘అక్కడేందుకు కూర్చున్నావ్?’
ప్రభువులు, ప్రబోధకులైనా సరే పిల్లలొచ్చి ఎదురుగా నిలబడితే ఎక్కువసేపు తమ పీఠాలపై కూర్చోలేరు. వాళ్లేదో మామూలు మనుషులు అయినట్లు పిల్లలు క్వశ్చన్ చేస్తుంటారు. ‘అక్కడెందుకు కూర్చున్నావు?’ అని అడిగితే ప్రభువు మంత్రి వైపు చూడాలి సమాధానం కోసం. ప్రబోధకుడికి మంత్రి ఉండడు. పైనున్న వాడిని అడగాలి. పైనున్నవాడినైనా కనిపిస్తే పిల్లలు వదిలి పెడతారనా? ‘నీ పేరేంటి?’ అని అడుగుతారు. ‘నేను వేంకటేశ్వరస్వామిని’ అని చెబితే, ‘పైనెందుకు ఉన్నావ్? కింద నీకు ఇల్లు లేదా?’ అని ఆరా తీస్తారు. పిల్లల లోకంలో ఎవరూ ఎంతోసేపు పెద్దలుగా స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండలేరు. పోలీస్ డ్రెస్‌లో ఉన్నా, ప్రీస్ట్ దుస్తుల్లో ఉన్నా సరెండర్ అయిపోవలసిందే. వీళ్లతో కలిసి మట్టిలో ఆడవలసిందే. ‘డ్యూటీ లో ఉన్నాను’ అంటే కుదరదు. ‘డ్యూటీలో ఉంటే ఆడకూడదా?’ అని అడుగుతారు. సమాధానం చెప్పడం కన్నా వెళ్లి వాళ్లతో కలిసి ఆడి యూనిఫారాలకు కాస్త మట్టి పూసుకోవడం, మరకలు అంటించుకోవడం సుఖం. రెండు రోజులుగా ఒక వీడియో నెట్ లో తిరుగుతోంది. ఇప్పటికి ఎన్నో లక్షల మంది చూశారు. తల్లీ, చిన్నపాప చర్చిలో ఉంటారు. ఏ దేశంలోనిదో క్రైస్తవాలయం. పాప తల్లి పక్కన నిలుచుని ఉంటుంది. ప్రీస్ట్ ప్రేయర్ చేస్తూ ఆ పాపను బ్లెస్ చెయ్యడానికి చెయ్యి పైకి లేపుతారు. వెంటనే పాప కూడా తన చెయ్యి పైకి లేపి ప్రీస్ట్ చేతిని తాకుతుంది. ప్లేయర్స్ గాలిలో చేతులు తాకించుకుంటారు కదా గోల్ కొట్టినప్పుడో, క్యాచ్ పట్టినప్పుడో.. అలా ‘హై ఫైవ్’ ఇస్తుంది! ప్రీస్ట్ గారు నవ్వు ఆపుకోలేక, నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. తల్లి మళ్లీ నవ్వకుండా ఉండగలిగింది. ప్రీస్ట్ అంటే ఉండే భయ భక్తి గౌరవ భావాల వలన కావచ్చు! ఎదురుగా ఉన్నది ప్రీస్ట్ అనే గ్రహింపు తల్లుల్లా చిన్నారులకు కలిగే వరకు ప్రీస్టులు, ప్రభువులు పీఠాలు దిగి పిల్లలతో కలిసి నవ్వుతూ ఉండాల్సిందే, చేతులు కలుపుతూ ఉండాల్సిందే. పిల్లలిక్కడ!! ఇంకో చిన్నారి ఉంది లండన్‌లో. వాళ్ల మదర్ పెద్ద పోస్టులో ఉన్నారు, సోషల్ వర్క్‌లో కావచ్చు. ఆమెతో ఇంట్లో నుంచి లైవ్ లో మాట్లాడుతున్నారు బి.బి.సి. న్యూస్ యాంకర్ క్రిస్టియన్ ఫ్రేజర్. మధ్యలో వచ్చి ఇంటర్వ్యూని క్రాష్ చేసేసింది! ‘మమ్మీ ఈ బొమ్మలు ఎక్కడ పెట్టమంటావ్?‘ అని అడిగింది. ‘ష్..’ అని తల్లి సైగ చేసి స్క్రీన్ మీద యాంకర్ని చూపించింది. యాంకర్ కల్పించుకుని ‘కింది షెల్ఫ్‌లో పెడితే బాగుంటుంది కదా చూడు..’ అన్నారు నవ్వుతూ. తల్లి ఇబ్బంది పడింది కానీ కూతురు అదేమీ పట్టించుకోలేదు. ‘వాట్ ఈజ్ హిస్ నేమ్.. వ్వాటీస్ హిస్ నేమ్ మమ్మీ?’ అని అడిగింది స్క్రీన్‌లో యాంకర్ వైపు చూడకుండానే. పాపం ఆయనే చెప్పుకున్నారు.. ‘మై నేమ్ ఈజ్ క్రిస్టియన్ ఫ్రేజర్’ అని. ఇదంతా లైవ్ లో వస్తూనే ఉంది. -
ప్రత్యర్థిని ఇరికించేందుకు పూజారి స్కెచ్
లక్నో : రాజకీయ ప్రత్యర్థిపై పగ తీర్చుకునేందుకు గ్రామ పెద్ద ఆలయ పూజారి ఇతరులతో కలిసి నకిలీ దాడి ఘటనను సృష్టించిన ఉదంతం యూపీలోని గోండా జిల్లాలో వెలుగుచూసింది. దీనికోసం ఆయన ప్రొఫెషనల్ కిల్లర్‌ను నియమించుకున్నారు. ఈ ఘటనలో ఆలయ ప్రధాన పూజారి, గ్రామ పెద్ద సహా ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ దాడి ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పూజారిని కూడా డిశ్చార్జి అనంతరం అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. గత వారం జరిగిన ఈ దాడిలో గాయపడిన పూజారి అతుల్ త్రిపాఠి అలియాస్ సామ్రాట్ దాస్ లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి ఆలయ ప్రధాన పూజారి మహంత్ సీతారామ్‌దాస్, గ్రామపెద్ద, గాయపడిన పూజారి కుట్ర పన్నారని పోలీసులు వివరించారు. ఈ దాడి ఘటన రాష్ట్రలో కలకలం రేపడం గమనార్హం. అయోధ్య నుంచి సాధుసంతులు సైతం జిల్లాకు చేరుకుని దాడి ఘటనలో బాధ్యులపై చర్యలు చేపట్టాలని డిమాండ చేశారు. గ్రామంలోని శ్రీరాం జానకి ఆలయంలో ఈనెల 10న పూజారి దాస్ కాల్పుల ఘటనలో గాయపడ్డారని జిల్లా మేజిస్ర్టేట్ నితిన్ బన్సల్, ఎస్పీ శైలేష్ కుమార్ పాండే వెల్లడించారు. ఈ ఘటనపై ఆలయ ప్రధాన పూజారి మహంత్ సీతారామ్‌దాస్ మాజీ గ్రామ పెద్ద అమర్ సింగ్ ఆయన అనుచరులపై ఫిర్యాదు చేశారని అమర్ సింగ్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో మరో నిందితుడిని మరుసటి రోజు అరెస్ట్ చేశామని చెప్పారు. అయితే ఆలయానికి చెందిన భూవివాదంలో పూజారికి ప్రస్తుత గ్రామ పెద్ద వినయ్ సింగ్‌కు అమర్ సింగ్‌తో ఉన్న విభేదాల కారణంగా పూజారిపై బూటకపు దాడికి స్కెచ్ వేశారని దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు చెప్పారు. పథకం ప్రకారం ఈ ఘటన జరగడంతో పూజారికి ప్రాణాపాయం లేకుడా గాయపడేలా రక్తికట్టించారని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. చదవండి : ఏనుగుపై యోగా : ట్రెండింగ్‌లో రాందేవ్ -
మొదటిసారి ఒక దళితుడితో..
కిచెరైవల్(కేరళ): మనుషుల మధ్య కులమతాల బేధాలు తొలగిపోవడానికి ఇది ఒక ఉదాహరణంగా చెప్పవచ్చు. నాటి రోజుల్లో దళితులకు దేవాలయాల్లోకి ప్రవేశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు శివుడి గర్భగుడిని కృష్ణా అనే దళిత పూజారితో తెరిపించారు. ఈ సంఘటన కేరళలోని కిచెరైవల్లో చోటుచేసుకుంది. వివరాలివి.. ట్రావెన్కోర్ దేవస్థాన్ రిక్రూట్మెంట్ బోర్డు ఆరుగురు దళిత పూజారులను ఎంపిక చేసింది. వీరిలో ఎస్సీ పులియా కమ్యూనిటికి చెందిన కృష్ణా అనే వ్యక్తి కూడా ఉన్నాడు. కేరళలో దళితులను పూజరులుగా నియమించడం ఇదే మొదటిసారి. కొంతమంది దళిత పూజారులను రిజర్వేషన్ కింద గవర్నమెంట్ ఉద్యోగులుగా నియమించడం ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఈ సందర్భంగా కృష్ణా మాట్లాడుతూ.. ‘మాది త్రిసూర్‌లోని చాలక్కుడి అనే ప్రాంతం. దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఎర్నాకుళంలోని దేవి ఆలయంలో పూజరిగా పని చేశాను. అక్కడి నుంచి నేను వస్తుంటే చాలా మంది భక్తులు భావోద్వేగానికి గురయ్యారు. కృష్ణా సంస్కృతంలో పీజీ చేశాడు. ఇతని తల్లిదండ్రులు రవి, లీలా. 12 సంవత్సరాల వయసులోనే ఎర్నాకుళం తంత్రాయ పీఠంలో చేరనని కృష్ణా చెప్పాడు.‘నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచే మా ఊరిలో పూజారిగా పనిచేశానని తెలిపాడు.’ ట్రావెన్కోర్ దేవస్థాన్ బోర్డ్ కమిషనర్ సీపీ రామ రాజా ప్రేమ ప్రసాద్ మాట్లాడుతూ.. కొత్తగా ఎంపికైనా పూజారులు 15 రోజుల్లో వారికి కేటాయించిన దేవాలయాల్లో విధులకు హజరుకావాలని తెలిపారు. కేరళ హిందూ ఐక్యా వేదిక జనరల్ సెక్రటరీ ఈ ఎస్ బిజు మాట్లాడుతూ.. గతంలో మాదిరి పరిస్థితులు ప్రస్తుతం లేవు. ప్రజల ఆలోచన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. దళిత పూజారులను ప్రజలు సంతోషంగా స్వాగతిస్తున్నారని ఆయన అన్నారు. -
భక్తురాలిపై పూజారి అత్యాచారం
-
భక్తురాలిపై పూజారి అత్యాచారం
హిమాయత్‌నగర్: భక్తురాలికి మాయ మాటలు చెప్పి అత్యాచారం చేశాడు ఓ పూజారి. నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు ఎదురుగానే ఈ వైనం జరగడం పట్ల అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా దౌల్తాబాద్‌కు చెందిన కరణం రాము(26) నారాయణగూడలోని అభిశ్రాయ్ హాస్టల్లో నివాసం ఉంటూ గత నాలుగు నెలలుగా నారాయణగూడలోని పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న సాయిబాబ గుడిలో పూజారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీలో నివాసం ఉండే 45సంవత్సరాల మహిళ ఆర్థిక తదితర ఇబ్బందులతో సతమతం అవుతుంది. ఈ నేపథ్యంలో పూజారి రామును కలసి ఆమె సమస్యలను విన్నవించుకుంది. దీంతో బుధవారం మధ్యాహ్నాం 12.30గంటల ప్రాంతంలో పసుపు, కుంకుమ తదితర సామాగ్రి తీసుకుని గుడికి రమ్మన్నాడు. వాచ్‌మెన్‌కు ఓ మహిళ వస్తుందనీ, గుడికి తాళాలు వేయోద్దని చెప్పాడు. మధ్యాహ్నానానికి ఆమె అవన్ని తీసుకుని వచ్చింది. ఆలయంలోని ఓ రూమ్‌లోకి ఆమెను తీసుకెళ్లి వస్త్రాలు తీయించి శరీరానికి పసుపు, కుంకుమలను పూసి ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో పూజారి నిర్వాకాన్ని ఎదురుగానే ఉన్న పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ భీమ్‌రెడ్డి తెలిపారు. -
అద్దంలో చూసుకుని మురిసే స్వామి
శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల కింద దేదీప్యమైన దివ్యకాంతులతో వెలిగే భుజములు (కోణాలు) ఉన్న చిత్రం ఉన్నదని ... నమ్మాళ్వారు తన పాశురం ‘తిరుమాల్ - ఇరబ్- సోలై’ ద్వారా తెలియజేశారు. స్వామి రోజూ అద్దంలో చూసుకుంటారా? అంటే అవుననే చెబుతోంది వైఖానస ఆగమ శాస్త్రం. ప్రత్యూష కాల పూజల్లో గర్భాలయ మూలమూర్తికి ఆదర్శము (అద్దం), గోవు, సలక్షణమైనటువంటి కన్య, గజం, అశ్వం, గాయకుడు... ఇలా వరుసగా దర్శింప చేయాలని వైఖానస ఆగమం చెబుతోంది. ఇదే సంప్రదాయం ఆధునిక కాలంలోనూ స్పల్పమార్పులతో నేటికీ కొనసాగుతుండటం విశేషం. 8వ శతాబ్దంలో వైఖానస మహా పండితుడు శ్రీమాన్ నృసింహ వాజపేయ యాజులవారు తన ‘భగవదర్చాప్రకరణమ్’ అనే గ్రంథంలో తిరుమల ఆలయంలో నిత్యం వైఖానస ఆగమోక్తంగా జరిగే ఆరాధన గురించి తెలియజేశారు. శ్రీవారికి కైంకర్యాలు, ఆగమ సంప్రదాయాల అమలు కోసం పూర్వం వైఖానస అర్చకులు దూరదృష్టితో కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రత్యూష కాలంలో అర్చకులు ఆలయ ప్రవేశం చేసి కుంచెకోల (తాళాలు)తో మంత్ర పూర్వకంగా బంగారు వాకిలి ద్వారాలు తెరిచి వేదపఠనంతో అంతరాళంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలోని స్వామి మూర్తికి కుడివైపున దక్షిణ దిశలో దర్పణం ఏర్పాటు చేసి ఉంది. అర్చకులు ఆ అద్దంలోగుండానే స్వామిని చూస్తూ ప్రాచీన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆగమ సంప్రదాయానికి లోబడే మూలమూర్తికి ఎదురుగా బంగారు వాకిలిలోని గరుడాళ్వారు సన్నిధికి పైభాగంలో టీటీడీ పెద్ద అద్దం ఏర్పాటు చేసింది. లేగదూడతో సహా గోవును స్వామి వారి ప్రథమ వీక్షణకై అంతరాళంగా పరిగణించే శయన మండపంలో నిలిపి ఉంచాలి. పూర్వం శ్రీవారికి ప్రత్యూష కాల కైంకర్యాల నిర్వహణ కోసం సన్నిధి గొల్ల ముందుగా ఆవు, దూడతో వెళుతుండగా, ఆయనను అనుసరించి అర్చకులు ఆలయ ప్రవేశం చేసేవారు. ఆవు, లేగదూడలను గర్భాలయ మూలమూర్తికి అభిముఖంగా నిలిపి, ప్రథమ వీక్షణ కైంకర్యాన్ని పూర్తి చేయించాలి. తర్వాత సన్నిధి గొల్ల గోవు పొదుగు నుండి పాలు పితికి అర్చకులకు అందించేవాడు. ఆగమంలో చెప్పినట్టు ఆ పాలు ‘ధారోష్ణం’ అంటే ఆవు పొదుగు నుండి పాలు పితికినపుడు పాత్రలో పడిన పాల ధార వల్ల కొంత ఉష్ణం పుడుతుంది... అటువంటి ధారోష్ణం కలిగిన పాలను నివేదనగా సమర్పించేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో గోవు, లేగదూడను ఆలయంలోనికి ప్రవేశించే సంప్రదాయం లేదు. వైఖానస ఆగమంలో చెప్పబడిన ‘గో సూక్తం’ అనే వేద మంత్ర పఠనం ద్వారా పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఆగమ సంప్రదాయంకోసం స్వామివారే యాదవ వంశస్థుడైన సన్నిధి గొల్లకు ప్రథమ దర్శనం చేసుకునే వరమిచ్చారు. అదే సంప్రదాయం నేటికి కొనసాగుతోంది. గజముఖాన్ని దర్శించే స్వామి స్వామివారు ప్రథమ వీక్షణ (తొలి చూపు)కై గజాన్ని దర్శించేందుకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. గర్భాలయ మూలమూర్తికి ప్రతినిధిగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తి సమస్త పూజలను మూలమూర్తికి సమానంగానే నిర్వహిస్తారు. రాత్రి ఏకాంత సేవ కూడా శ్రీ భోగ శ్రీనివాసమూర్తికే నిర్వహిస్తారు. ఇదే చివరగా నిర్వహించే పవళింపు పూజ. గర్భాలయానికి ముందున్న శయనమండపంలో వేలాడదీసిన నవారు మంచంపై దక్షిణ దిక్కుగా శిరస్సు ఉంచి భోగ శ్రీనివాసుడిని శయనింప చేస్తారు. మరుసటి రోజు ప్రత్యూషకాల సుప్రభాత సేవలో భాగంగా, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని మేల్కొలుపుతారు. శయన మండపంలో స్వామివారికి ఉత్తర, దక్షిణ దిశల్లో రెండేసి శిలాస్తంభాలు ఉన్నాయి. ఇందులో ఉత్తర దిశలో ఉన్న ఓ శిలా స్తంభం అగ్రభాగాన గజ శిర స్సు చెక్కబడి ఉంది. శ్రీ భోగ శ్రీనివాసమూర్తి సుప్రభాత సేవలో మేల్కొలుపు తర్వాత ప్రథమంగా శిలాస్తంభంపై ఉన్న గజ ముఖాన్ని దర్శింప చేస్తారు. ఆ తర్వాతే భోగ శ్రీనివాసుడిని శయనమండపం నుంచి గర్భాలయంలో మూలవిరాట్టు పాదాల వద్ద ఉన్న సింహాసనంపై జీవస్థాపంలో వేంచేపు చేస్తారు. శ్రీవారి పద్మపీఠం: దివ్యతేజో రహస్య యంత్రం శ్రీవేంకటేశ్వర స్వామి వారు గర్భాలయంలోని ఉపద్యక పవిత్ర స్థానంలో స్వయంవ్యక్త సాలగ్రామ అర్చావతారంగా స్థానిక మూర్తి/ ధృవమూర్తిగా పద్మపీఠంపై కొలువయ్యారు. స్వామి పాద పద్మాల కింద రహస్య యంత్రం ఉంది. సాక్షాత్తు మూలమూర్తి అంశగా భావించే శ్రీ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహ పరిశీలనలో ఈ విషయం తేలింది. క్రీ.శ.614 వ సంవత్సరంలో పల్లవ రాణి సామవై పెరుందేవి మహారాణి ఈ రజిత మూర్తిని ఆలయానికి సమర్పించారు. శంఖచక్రాలు ధరించి, అడుగున్నర పొడవు కలిగిన ఈ రజితమూర్తి పూర్తిగా మూలమూర్తిని పోలి ఉంటుంది. ఈ విగ్రహం కింద యంత్రం ఉన్నట్టు అర్చకులు గుర్తించారు. అందువల్ల కచ్చితంగా మూలవిరాట్టు పాద పద్మాల కింద యంత్రస్థాపన ఉండి ఉంటుందనీ అర్చకుల వాదన. వైష్ణవ పరంపరలో గొప్ప ఆచార్యుడైనటువంటి నమ్మాళ్వారు ఈ రహస్యాన్ని గురించి వివరణ ఇచ్చి ఉండటం అర్చకుల వాదనకు బలం చేకూరింది. మా చిరునామా: ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com -
దైవలీల
వారు వచ్చి అయం ముహూర్తః సుముహూర్తోస్తు.. అంటేనే ఏ పనైనా మొదలవుతుంది. మూడు ముళ్ల వేడుకైనా.. కొత్త ఇంట కాలు పెట్టినా.. అయ్యవార్లు తథాస్తు అనాల్సిందే. అయితే పురహితం కోరే పురోహితులకు ఎన్నో సమస్యలున్నాయి. వందల పెళ్లిళ్లు చేసిన పంతుళ్లు కొందరు బ్రహ్మచారులుగానే మిగిలిపోతుంటే.. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అని దీవెనలిడుతున్న పూజార్లు అష్టదరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధిరస్తు అని దీవిస్తున్న అర్చకుడి పరిస్థితి దయనీయంగా ఉంది. వేదపండితులుగా వేనోళ్ల గౌర వం పొందుతున్న పూజార్లు ఇదంతా దైవలీల అంటూ తమ అంతరంగాన్ని.. స్టార్ రిపోర్టర్ అలీ ముందు ఆవిష్కరించారు. అలీ: మామూలుగా మీరు లేకుండా పెళ్లిళ్లు జరగవు. అలాంటిది మీకు పెళ్లిళ్లు అవడంలేదు. ఎందుకని? నెలరాజ శర్మ : ఈ కాలంలో పూజారి అనే పదమే పెళ్లికి అడ్డుపడిపోతోంది. చదువులు, ఉద్యోగాల్లో మునిగి తేలుతున్న అమ్మాయిలు.. పంచె, పిలకతో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోడానికి ముందుకు రావడం లేదు. చంద్రశేఖర్ శర్మ: మా అవతరాలొక్కటే కాదు.. చేతినిండా సంపాదన ఉండదు, తెల్లవారుజామునే లేవాలి, మడి ఆచారాలు.. వేళకు ఇంటికిరారు.. వీళ్లని కట్టుకుని ఎందుకిన్ని తిప్పలు పడాలి అనుకుంటున్నారండి. అలీ: ఈ పరిస్థితి వచ్చి ఎన్నాళ్లయింది? ఫణికుమార్ శర్మ: ఓ ఆరేడేళ్లయింది. ఎమ్.శ్రీనివాసు: పూర్వం ఫలానా ఇంటిపేరు గల అబ్బాయి అనగానే ఆడపెళ్లివారు సంబంధం ఖాయం చేసేసేవారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నెలరాజ శర్మ: ఇప్పుడు అర్చకుడైనా, పురోహితుడైనా ఒక అలంకారంగా ఉండాల్సి వస్తోంది. దీనికి తప్ప మేం ఇక దేనికీ అర్హులు కాదన్నట్టు తయారయ్యాయి పరిస్థితులు. చంద్రశేఖర శర్మ: ఏవో తిప్పలు పడి పెళ్లిచేసుకున్నవారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ వేషధారణతో భార్యాబిడ్డల్ని తీసుకుని ఏ సినిమాకో, షాపిం గ్కో వెళితే జూలో జంతువుని చూసినట్టు వింతగా చూస్తారు. ‘పూజారులు ఇలాగే ఉంటారు కదా.. ఇందులో వింత, విడ్డూరం ఏముందిలే’ అనుకోరు. అలీ: ఎవరితో పోల్చినా నాకు మీకన్నా ఉత్తములుండరనిపిస్తుంది. ఉదాహరణకు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరుని, ఓ పూజారిని హాస్పటల్‌కి తీసుకెళ్లి చెకప్ చేయిస్తే మీకు ఒకటో, రెండో ఆరోగ్య సమస్యలుంటే, అతనికి ఒంటినిండా జబ్బులే ఉంటాయి. ఇంతకంటే ఉత్తమమైన లక్షణం ఏముంది చెప్పండి. నెలరాజశర్మ: మీరన్నది నూటికి నూరుపాళ్లు నిజమండీ. మేం చేసే పనులు, ఆహారపు అలవాట్ల వల్ల మేం చాలావరకూ అనారోగ్యాలకు, జబ్బులకు దూరంగా ఉంటామనే చెప్పాలి. అలీ: అంతేకదా! చలికాలమైనా తెల్లవారుజామునే చన్నీళ్లు స్నానం చేస్తారు. చాలావరకు ఇంటి భోజనమే ఉంటుంది. వెయ్యికోట్లు పెడితే మాత్రం ఇలాంటి డెయిలీరొటీన్ దొరుకుతుందా చెప్పండి. మిగతావాళ్ల పరిస్థితి ఇలా లేదు. మాట్లాడితే.. క్యాన్సర్లు, గుండె జబ్బులొస్తున్నాయి. ఉద్యోగాల గోలలో పడి ఏం తింటున్నారో, ఏం తాగుతున్నారో కూడా స్పృహ లేకుండా రకరకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఏసీ గదుల్లో కూర్చుని పనిచేసేవారంతా విటమిన్ డి లోపంతో ఇబ్బంది పడుతుంటారు. ఈ విషయంలో మీరు లక్కీ. ఓకే.. షాపింగ్‌లకు వెళుతుంటారా! ఎమ్. శ్రీనివాసు: మిగతా ఉద్యోగస్తులెవరికైనా బండి కావాలంటే.. బ్యాంకులో లోన్ తీసుకుని నిమిషాల్లో బండి కొనుక్కుంటారు. మా సంపాదనలకు రుజువేముంది చెప్పండి. తిరుమలాచారి: లోన్లు గట్రా సంగతి పక్కన పెట్టండి. పూర్వం బ్రాహ్మణుడు డాక్టర్ దగ్గరికి వెళితే..‘అయ్యవారి దగ్గర డబ్బులు తీసుకోవడం ఏమిటి’ అనేవాడు. ఇప్పుడలా కాదు.. మీకేమిటండీ అంటున్నారు. అలీ: పూజారైనా, పురోహితుడైనా పంచె కట్టుకుంటేనే కదా గుర్తింపు. పెళ్లికి పంచె అడ్డనుకుంటే ఎలా. వాస్తవం మాట్లాడు కోవాలంటే భగవంతుడు నిద్రలేవకముందే మీరు నిద్రలేచి స్వామిని అలంకరించి భక్తులొచ్చే వేళకు సిద్ధంగా ఉంటారు. మీరు చేసేది చాలా పవిత్రమైన పని. మీలాంటి పురుషుడ్ని పెళ్లి చేసుకోడానికి ఎంతో ఆనందంగా ముందుకు రావాలి. మరి అలాంటిది.. ఎందుకు మీ పట్ల అలా ఫీలవుతున్నారో అర్థం కాని విషయం. ఎమ్. శ్రీనివాసు: అర్థం కాకపోవడానికి ఏముందండీ...చదువులు, లక్షల్లో జీతాలొచ్చే ఉద్యోగాలు. ఉదాహరణకి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మా పక్కన నిలబెడితే.. ఓ చదువుకున్న అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది చెప్పండి! అలీ: అవునూ.. మీ వృత్తిలో కూడా బాగా సంపాదించేవారున్నారు కదా! ఫణికుమార్ శర్మ: ఎక్కడో ఒకరిద్దరిని చూపించి అందరూ అలాగే ఉంటారంటే ఎలాగండి? అలీ: లేదు.. లేదు అలా అనడం లేదు. ఆస్తులున్న అర్చకులు కూడా ఉన్నారు కదా. నెలరాజ శర్మ: ఆస్తులున్న బ్రాహ్మణులున్నారు. పురోహితులు, అర్చకులు కాదు. ఆస్తులు సంపాదించడం ఇప్పుడున్న ఖర్చులతో అయ్యేపని కాదు. మా దృష్టిలో ఆస్తులంటే.. పౌరోహిత్యం, అర్చకత్వం, ఆచారవ్యవహారాలే. సంపాదించే నాలుగు రూకలు ఏ మూలకూ సరిపోవడం లేదు. ఇంటి అద్దె, పిల్లల చదువులు.. అన్నీ కనాకష్టంగా మారాయి. చంద్రశేఖర శర్మ: చాలామందికి తెలియదు.. మన నగరంలో చిక్కడపల్లి, మల్కాజిగిరి వంటి చోట్ల అడ్డా పూజారులు పొద్దున ఆరింటికి వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ పని కోసం ఎదురుచూస్తుంటారు. వట్టి చేతులతో ఇంటికెళ్లలేక వంద రూపాయలకు కూడా పూజకు ఒప్పుకుని బండెక్కే సన్నివేశాలను చూశాను. ఎమ్. శ్రీనివాసు: ఇక్కడంటే మా పరిస్థితి బాగుంది. బయట చాలామంది పురోహితులు, అర్చకులు చాలారకాలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ సాధారణ పూజారి సంపాదన నెలకు రెండువేలకు మించి ఉండదంటే మీరు నమ్ముతారా! * 12,500 తెలంగాణలో మొత్తం గుర్తింపు పొందిన దేవాలయాలు * 3,000 గ్రేటర్ హైదరాబాద్‌లోని మందిరాలు * కేటగిరీలతో సంబంధం లేకుండా అన్ని ఆలయాల్లో పనిచేసేవారికి ఒకేరకమైన వేతన స్కేలును అమలు చేయాలని 2007లో దేవాదాయ శాఖ చట్ట సవరణ చేసింది.ఇందుకోసం అన్ని ఆలయాల నుంచి నిధిని సేకరించి, ఆ నిధి నుంచే జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికీ అమలు కాలేదు. చంద్రశేఖరశర్మ: అంటే అన్నామంటారు.. నగరంలో జరిగే పెద్ద పెద్ద పెళ్లిళ్లకు కార్డులకు పెట్టే ఖర్చులో సగం పురోహితుడికి ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. ‘పంతులుగారూ.. మీరు మరీ ఎక్కువ ఆశ పడుతున్నారు’ అంటున్నారు. మేం అంతలా ఆశపడిపోవడానికి అవకాశాలే తక్కువ కదండీ. ఈ ఏడాది కార్తీకమాసంలో మూడే మూడు పెళ్లిళ్ల ముహుర్తాలు ఉన్నాయి. ఒక పురోహితుడు ఒక ముహూర్తానికి ఒక పెళ్లే జరిపించగలడు. ఆ నెలలో పురోహితులంతా ఆ మూడు ముహూర్తాలనే నమ్ముకుని బతకాలంటే ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. అలీ: నిజమే.. అదొక్కటే కాదు, ఈ మధ్యన ఆన్లైన్ పూజలు, స్కైప్ పూజలంటూ ఏవో వినపడుతున్నాయి. వాటి సంగతేంటి?తిరుమలాచారి: మా పొట్టకొట్టడానికి వచ్చినవండీ అవన్నీ. ఏమన్నా అంటే టెక్నాలజీ అంటున్నారు. పూజారి ఎదురుగా కూర్చుని విఘ్నేశ్వరుడికి పూజ చేసి దగ్గరుండి భక్తుడితో పూజ చేయిస్తేనే ఫలితం ఉంటుంది. చంద్రశేఖర శర్మ: అసలే.. భక్తుల పిలుపులు తక్కువగా ఉంటున్నాయని బాధపడుతుంటే మధ్యలో ఆన్లైన్ పూజా వ్యాపారుల దోపిడీ ఒకటి. అలీ: ఆ పని చేస్తున్నది కూడా మీ వాళ్లే కదా(నవ్వుతూ...) ఎమ్. శ్రీనివాసు: అవునండీ(నవ్వుతూ...) అలీ: మన హైదరాబాద్‌లో మీరు ఎంతమంది ఉంటారు? నెలరాజ శర్మ: ఉంటారండీ.. లక్షకు పైగానే. అలీ: నా ఉద్దేశం ఏంటంటే.. పొద్దున లేస్తే ఏదో ఒక వర్గం వారు మాకు ఈ విషయంలో న్యాయం చేయండి, ఆ విషయంలో న్యాయం చేయండీ అంటూ ప్రభుత్వాలతో పోరాడి పనులు చేయించుకుంటున్నారు. ఆ పని మీరెందుకు చేయడం లేదు? తిరుమలాచారి: పోరాడ్డాలు, పోట్లాడటాల గురించి మాకు తెలియదండి. మాకు చేతకాదు కూడా. అలీ : అలా అంటే ఎలా.. అడిగితే గాని అమ్మ కూడా పెట్టదు. ఇప్పుడు పరిస్థితి చూస్తే పైసా మే పరమాత్మా. చంద్రశేఖర శర్మ: ఏమని అడగాలి? ఎవర్ని అడగాలి? అలీ : ప్రభుత్వ ఆలయాల్లో ఉద్యోగాలు అడగాలి. పేద పుజారులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే కదా! చంద్రశేఖర శర్మ: మాకు సరైన సపోర్ట్ లేదండి. అలీ : చివరి ప్రశ్న.. పన్నెండేళ్లపాటు వేదాన్ని అవపోశన పట్టిన వారు మీరు. సంస్కృతం నేర్చుకున్నవారు. మా చిన్నప్పుడు స్కూల్లో మాస్టార్లు చెప్పేవారు సంస్కృతం నేర్చుకున్నవాడికి ఇతర భాషలు చాలా సులువుగా వస్తాయని. మీకెప్పుడైనా ఇతర భాషలు నేర్చుకోవాలని అనిపిస్తుందా? చంద్రశేఖర శర్మ: ఎందుకుండదండీ! ఇంగ్లిష్ బాగా మాట్లాడాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉంది. ఏం లాభం.. ఓ గంట ఏదైనా క్లాస్‌కి వెళ్లి నేర్చుకుందామంటే తీరికేదీ? తిరుమలాచారి: జీవితమంతా ఆ భగవంతుడికే అప్పజెప్పుకున్నట్టు సార్. నిజానికి మా వృత్తి లక్షణం అదే. కానీ, మారుతున్న పరిస్థితులు దానికి అనుకూలంగా ఉండటం లేదు. చంద్రశేఖర శర్మ: మా పనివేళలు దాదాపు పదిగంటలండీ. ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండింటి వరకు, సాయంత్రం ఐదింటి నుంచి రాత్రి తొమ్మిదివరకూ. మధ్యలో పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడం. ఫణికుమార్ శర్మ: కార్తీక మాసంలో పన్నెండు నుంచి పద్నాలుగు గంటలవరకూ పనిచేయాల్సి వస్తుందండి. అలీ : చివరాఖరి ప్రశ్న.. మీరు సినిమాలకు వెళ్తుంటారా? తిరుమాలాచారి: వెళతామండీ. భార్యా పిల్లలకోసం... బలవంతంగా. మార్నింగ్ షోకి వెళ్లాలంటే పొద్దున గుడికి డుమ్మా కొట్టాలి. మ్యాట్నీకి వెళదామంటే.. సాయంత్రం పూజకు డుమ్మా. అలీ : గ్రహణం పట్టినపుడు మాత్రమే ప్రశాంతంగా సినిమాకి వెళ్లొచ్చన్నమాట(నవ్వుతూ..). ఓకే... థ్యాంక్యూ! రిపోర్టర్ - అలీ