భక్తురాలిపై పూజారి అత్యాచారం | Preist raped a devotee in Himayat nagar temple | Sakshi
Sakshi News home page

భక్తురాలిపై పూజారి అత్యాచారం

Published Wed, Jul 13 2016 10:23 PM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM

భక్తురాలిపై పూజారి అత్యాచారం

భక్తురాలిపై పూజారి అత్యాచారం

హిమాయత్‌నగర్: భక్తురాలికి మాయ మాటలు చెప్పి అత్యాచారం చేశాడు ఓ పూజారి. నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు ఎదురుగానే ఈ వైనం జరగడం పట్ల అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా దౌల్తాబాద్‌కు చెందిన కరణం రాము(26) నారాయణగూడలోని అభిశ్రాయ్ హాస్టల్‌లో నివాసం ఉంటూ గత నాలుగు నెలలుగా నారాయణగూడలోని పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న సాయిబాబ గుడిలో పూజారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీలో నివాసం ఉండే 45సంవత్సరాల మహిళ ఆర్థిక తదితర ఇబ్బందులతో సతమతం అవుతుంది. ఈ నేపథ్యంలో పూజారి రామును కలసి ఆమె సమస్యలను విన్నవించుకుంది.

దీంతో బుధవారం మధ్యాహ్నాం 12.30గంటల ప్రాంతంలో పసుపు, కుంకుమ తదితర సామాగ్రి తీసుకుని గుడికి రమ్మన్నాడు. వాచ్‌మెన్‌కు ఓ మహిళ వస్తుందనీ, గుడికి తాళాలు వేయోద్దని చెప్పాడు. మధ్యాహ్నానానికి ఆమె అవన్ని తీసుకుని వచ్చింది. ఆలయంలోని ఓ రూమ్‌లోకి ఆమెను తీసుకెళ్లి వస్త్రాలు తీయించి శరీరానికి పసుపు, కుంకుమలను పూసి ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో పూజారి నిర్వాకాన్ని ఎదురుగానే ఉన్న పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ భీమ్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement