saibaba temple
-
పందులు కాస్తున్నారని గుడిలోకి అనుమతి నిరాకరణ?
ఇల్లెందు: గుడి నిర్మాణానికి స్థలం ఇచ్చిన తమను ఆలయంలోకి అనుమతించడం లేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన చోటాలాల్ పాసీ కొన్నేళ్ల కిందట సాయిబాబా ఆలయ నిర్మాణానికి స్థలం ఇచ్చాడు. అయితే, ఆయన కుమారుడు మోహన్‌లాల్ పాసీని కొంత కాలంగా గుడిలోకి కమిటీ సభ్యులు రానివ్వడం లేదని చెబుతున్నారు. పందులు కాస్తూ జీవిస్తున్నారనే అభియోగంతో అడ్డుకోవడమే కాక గుడి సమీప స్థలాన్ని కూడా స్వాదీనం చేసుకున్నారని ఆరోపిస్తూ మోహన్ ఆదివారం పురుగుల మందు తాగాడు. కాగా, ఆలయంలోకి రానివ్వని అంశంపై పోలీసులు, కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈవిషయమై ఆలయ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ను వివరణ కోరగా.. మోహన్‌లాల్ ఆరోపణలు అవాస్తవమని, ఏనాడు కూడా ఏమీ అనలేదన్నారు. -
Guru Purnima: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
సాక్షి, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామునుంచే భక్తులు సాయిబాబా ఆలయాలకు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబాకు అభిషేకాలు. అర్చనలు నిర్వహించారు. భజనలు చేశారు. హరతీ కార్యక్రమం నిర్వహించారు. స్వామికి ప్రత్యేకంగా దీపాలు వెలిగించారు. పల్లకీ సేవ నిర్వహించారు. పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోతున్న ఆలయాలు సాయినామస్మరణంతో మారుమ్రోగాయి. పల్నాడు జిల్లా : అమరావతి శ్రీ బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆషాడ గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారు శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చారు. విశాఖలో వైభవంగా గురు పౌర్ణమి పూజలు విశాఖ జిల్లాలో గురు పౌర్ణమి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. షిరిడి సాయి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక దర్శనాలు చేసుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి షిరిడి సాయినాథునికి పవిత్ర జలాలతో అభిషేకాలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా: గురు పౌర్ణమి సందర్భంగా భద్రకాళి అమ్మవారి ఆలయంలో వైభవంగా శాకాంబరి ఉత్సవాలు నిర్వహించారు. 1500 కిలోలు వివిద రకాల పూలు పండ్లు కూరగాయలతో అమ్మవారి అలంకరించారు. శాకాంబరి అవతారంలో భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. -
సవాళ్ల పర్వం: ముఖం చాటేసిన వెలగపూడి
సాక్షి, విశాఖపట్నం: సవాళ్ల పర్వం ముగిసిపోయిందని తాము చేసిన ఆరోపణలు నిజమని నిర్ధారణ అయ్యిందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. వెలగపూడికి ఇచ్చిన గడువు ముగియడంతో వెళ్లిపోయిన ఆయన ఆదివారం సాయిబాబా ఆలయం నుంచి వెళ్లిపోయారు. సాయిబాబా గుడిలో ప్రమాణానికి రావాలని అమర్నాథ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఆధారాలతో సత్య ప్రమాణానికి అమర్నాథ్ సిద్ధమయ్యారు. కానీ ఆలయానికి టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ రాలేదు. వెలగపూడి కోసం గంట పాటు అమర్నాథ్, పార్టీ నేతలు వేచి చూశారు. వెలగపూడి రాకపోవడంతో ఎమ్మెల్యే అమర్నాథ్ వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆరోపణలు వాస్తవం కాబట్టే వెలగపూడి మొహం చాటేశారని మండిపడ్డారు. సత్య ప్రమాణానికి గైర్హాజరైన వెలగపూడి తన తప్పులను ఒప్పుకున్నట్టే అన్నారు. రిషికొండలో వెలగపూడి రామకృష్ణ భూమి ఆక్రమించారని దుయ్యబట్టారు. ఇప్పటికే వెలగపూడి అక్రమాలపై సాక్ష్యాలు బయట పెట్టామని అన్నారు. భూ ఆక్రమణలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇకపై టీడీపీ నాయకులకు సవాలు విసిరే అర్హత లేదని తాము సవాళ్లకు రావాలంటే చంద్రబాబు, లోకేష్ రావాలని అమర్నాథ్ అన్నారు. ఇప్పటికైనా ఆక్రమణదారులు తమ భూములు వెనక్కి ఇస్తే మంచిదని, త్వరలో సిట్ నివేదికలో టీడీపీ బండారం బయటపడుతుందన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ బిచ్చగాడని, ఇతరులకు ఆయన రాజకీయ భిక్ష పెట్టింది ఏంటనీ సూటిగా ప్రశ్నించారు. తన పేరిట అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తిస్తే స్టాంప్ పేపర్‌పై అనాధ శరణాలయానికి రాసిస్తానని అన్నారు. ఆచూకీ లేని ఎమ్మెల్యే వెలగపూడి పెదవాల్తేరు(విశాఖ తూర్పు): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సవాల్‌కి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆచూకీ లేకుండా పోయారు. ఈస్ట్పాయింట్కాలనీలో గల ఈస్ట్ శిరిడీ సాయిబాబా ఆలయం వద్దకు శనివారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, వెంకటరావు తదితరులు బాబా చిత్రపటంతో ర్యాలీగా చేరుకున్నారు. అక్కడ వారిని పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అప్పటికే త్రీటౌన్ సీఐ కోరాడరామారావు పర్యవేక్షణలో ఎస్ఐ జె.ధర్మేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులు గంటకు పైగా నిరీక్షించారు. ఈ సందర్భంగా విజయనిర్మల మీడియాతో మాట్లాడు తూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కోసం ఆలయం వద్ద ఎదురుచూసినా రాలేదన్నారు. ఎమ్మెల్యేకు సంబంధించిన ఆక్రమణలు తొలగించడం హర్షణీయమన్నారు. వెలగపూడి ముమ్మాటికీ వంగవీటి రంగా హత్యకేసులో నిందితుడేనని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని విమర్శించే స్థాయి వెలగపూడికి లేదని పేర్కొన్నారు. అక్కరమాని ప్రతి సవాల్‌తో పోలీసుల హై అలర్ట్ వెలగపూడి రామకృష్ణబాబుకు వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల ప్రతి సవాల్ విసరడంపై ద్వారకా జోన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంపీ విజయసాయిరెడ్డిని వెలగపూడి విమర్శిస్తూ గురువారం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను భూ కబ్జాలు చేయలేదంటూ, దానికి నిదర్శనంగా ఈస్ట్‌పాయింట్ కాలనీ సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమంటూ వెలగపూడి పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను శుక్రవారం ఖండిస్తూ అక్కరమాని విజయనిర్మల ప్రతి సవాల్ విసిరారు. దీంతో శనివారం ఈస్ట్‌పాయింట్ కాలనీ సాయిబాబా గుడి వద్ద, ఎంవీపీ సెక్టార్–4లోని వెలగపూడి కార్యాలయం వద్ద నాటకీయ పరిణా మాలు చోటు చేసుకున్నాయి. బాబా ఆలయం వద్దకు వెలగపూడి రాకపోవడంతో ఎంవీపీ కాలనీలోని ఆయన కార్యాలయానికి వెళ్లేందుకు అక్కరమానితోపాటు పార్టీ నాయకులు యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎంవీపీ కాలనీలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేయడంతోపాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ద్వారకా ఏసీపీ ఆర్వీఎస్ఎన్ మూర్తి పర్యవేక్షణలో పోలీసులు సాయంత్రం వరకు వెలగపూడి కార్యాలయానికి, ఇల్లుకు భద్రత కల్పించారు. -
రూ. 8లక్షల విరాళం ఇచ్చిన బిచ్చగాడు
విజయవాడ: చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఏ గుడి ముందు అయిన కూడా బిచ్చగాళ్లు ఉంటారు. ఎక్కువగా బయటే ఉండే బిచ్చగాళ్లు లోపలకు వెళ్లే సందర్బాలు అరుదు. ఇక ఆ బిచ్చగాళ్లు హుండీలో డబ్బులు వేయడం మరీ అరుదు. కానీ నల్లగొండ జిల్లాకు చెందిన యాదిరెడ్డి అనే 75 సంవత్సరాల వ్యక్తి ఏ గుడి ముందు అయితే బిచ్చం ఎత్తుకున్నాడో ఆ గుడికి భారీ విరాళం ఇచ్చి అందరిని ఆశ్చర్యపర్చారు. విజయవాడలోని ముత్యాలంపాడులో ఉన్న సాయిబాబా ఆలయానికి కొన్నేళ్లలో 8 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. నిజానికి అతను ఒకప్పుడు రిక్షా లాగుతూ బతికేవాడు. మోకాలి చిప్పలు అరిగిపోయి, రిక్షా తొక్కలేని పరిస్థితి రావడంతో గుడుల ముందు భిక్షమెత్తుకోవడం మొదలుపెట్టాడు. విజయవాడలో ఆలయాల ముందు కూర్చుని బిచ్చమెత్తుకుంటాడు. అలా రోజూ వచ్చే డబ్బులన్నీ పోగేస్తూ.. మళ్లీ గుడులకే విరాళంగా ఇస్తున్నారు. మొదట్లో తాను లక్ష రూపాయలను గుడికి విరాళంగా ఇచ్చానని యాదిరెడ్డి చెప్పారు. కాలం గడుస్తున్న కొద్దీ తన ఆరోగ్యం దెబ్బతింటోందని, తనకు వచ్చిన డబ్బంతా గుడికే ఇచ్చేస్తున్నానని తెలిపారు. తాను గుడికి డబ్బులివ్వడం మొదలుపెట్టినప్పటి నుంచి అక్కడికి వచ్చే భక్తుల్లో తనకు గుర్తింపు వచ్చిందని.. తనకు వచ్చే డబ్బులు మరింతగా పెరిగాయని యాదిరెడ్డి వెల్లడించారు. ఒక్క సాయిబాబా గుడికే కాకుండా మరికొన్ని ఆలయాలకు కూడా తాను డబ్బులు విరాళంగా ఇచ్చానని చెప్పారు. తన జీవితమంతా దేవుడి సన్నిధిలోనే గడిపేస్తానంటూ యాదిరెడ్డి చెప్పుకొచ్చారు. -
నేటి నుంచి షిర్డీ బంద్
అహ్మద్‌నగర్/షిర్డీ: శ్రీ సాయి జన్మస్థలంపై తలెత్తిన వివాదం ముదిరింది. పత్రి గ్రామ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆదివారం పట్టణ బంద్ పాటించాలని షిర్డీ వాసులు పిలుపునిచ్చారు. అయితే, ఆదివారం ఆలయం తెరిచే ఉంటుందని, పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ పేర్కొంది. సంస్థాన్‌కు చెందిన ఆస్పత్రులు, ప్రసాద విక్రయ కేంద్రాలు, భక్తి నివాసాలు తదితరాలన్నింటిలో కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రకటించింది. ఇలా ఉండగా, ఈ వివాదం పరిష్కారానికి సంబంధిత వర్గాలతో సెక్రటేరియట్లో ఆదివారం సీఎం ఉద్ధవ్ ఠాక్రే సమావేశం నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. షిర్డీ వాసుల్లో ఆగ్రహం బాబా జన్మస్థలంగా భక్తులు భావించే పత్రి అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించడం వివాదమైంది. ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీల నేతలు, షిర్డీ వాసులు శనివారం సమావేశమయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రకటనకు నిరసనగా ఆదివారం నుంచి బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. బంద్‌లో దాదాపు 20 గ్రామాల ప్రజలు పాల్గొంటారన్నారు. గతంలోనూ ఇలా బాబా జన్మస్థలంపై వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న బాబా ఆలయాల్లో పత్రిలోనిది ఒకటనీ, బాబా జన్మస్థానం పత్రి అంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. హోటళ్లలో బుకింగ్ చేసుకున్న భక్తులకు, విమానాల్లో వచ్చే భక్తులకు బంద్‌తో ఎలాంటి అసౌకర్యం ఉండదని, దుకాణాలు మాత్రమే మూతబడి ఉంటాయన్నారు. ఆధారాలున్నాయి: ఎన్సీపీ నేత దుర్రానీ పత్రిలోనే బాబా జన్మించారనేందుకు చారిత్రక ఆధారాలున్నాయని ఎన్సీపీ నేత దుర్రానీ అబ్దుల్లా చెప్పారు. పత్రి జన్మభూమి కాగా, షిర్డీ సాయి కర్మభూమి అని, రెండు ప్రాంతాలూ భక్తులకు ముఖ్యమైనవేనన్నారు. పత్రి ప్రాధాన్యం పెరిగితే షిర్డీకి భక్తుల రాక తగ్గిపోతుందేమోనని షిర్డీ ప్రజల్లో ఆందోళన ఉందన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అశోక్ చవాన్ మాట్లాడుతూ..బాబా జన్మస్థలంపై వివాదం కారణంగా పత్రిలో భక్తులకు సౌకర్యాల కల్పనను అడ్డుకోవడం సరికాదన్నారు. -
భద్రాద్రి కొత్తగూడెం: దోపిడి దొంగల బీభత్సం
-
షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, ముంబై : ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. షిర్డీ ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కేసీఆర్ ప్రత్యేక పూజలు చేసి.. మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. షిర్డీ సాయిబాబాను దర్శించుకునేందుకు సీఎం కేసీఆర్ కుటుంబం శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి షిర్డీకి బయల్దేరిన విషయం విదితమే. కేసీఆర్ తిరిగి ఈరోజు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోనున్నారు. -
షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న సీఎం కేసీఆర్
-
నంద్యాల సాయిబాబ గుడిలో చోరీ
-
అల్లం వినాయకుడు
యాదగిరిగుట్ట : నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని సాయిబాబా మందిరంలో వినాయకుడి రూపంలో అల్లం దర్శనమివ్వడంతో.. స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలకు ముందు ఇలా జరగడం శుభ పరిణామమని భక్తులు భావిస్తున్నారు. స్థానిక సాయి ఆలయంలో అన్నదానం కోసం కొనుగోలు చేసిన అల్లంలో పార్వతి పుత్రుడి ప్రతిమ రూపంలో ఉన్న అల్లం లభించిందని ఆలయ సిబ్బంది తెలిపారు. ఈ వార్త తెలిసిన ప్రజులు పెద్ద ఎత్తున అల్లం వినాయకుడిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. -
కూకట్ పల్లి సాయిబాబా గుడిలో అక్రమాలు
హైదరాబాద్: కూకట్ పల్లి నిజాం పేట సాయిబాబా దేవాలయంలో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దేవాలయానికి చందాల రూపంలో వచ్చిన డబ్బును ఆలయ ట్రస్ట్ మెంబర్లు వాడుకుంటున్నట్లు సినీనటి చల్లా జయలలిత ఆరోపించారు. ఆలయట్రస్ట్ బోర్డు మెంబర్లలో ఒకరైన లతా చౌదరి లక్షలు కాజేశారని జయలలిత తెలిపారు. ఆలయంలో బాబాకు పూజలు నిర్వహిస్తున్న పూజారులు సైతం నిష్టగా ఉండటం లేదని, గుట్కాలు తింటూ అసభ్యంగా మాట్లాడుతున్నారని భక్తులు ఆరోపించారు. -
మార్మోగిన సాయిస్మరణ
సాయిపూజలు, గురుపౌర్ణమి, ప్రత్యేక పూజలు, gurupournami, saibaba temple, sperate poojalu జగిత్యాల అర్బన్ : గురుపౌర్ణమిని పురస్కరించుకుని పట్టణంలోని సాయిబాబా ఆలయంలో భక్తులు వేలాది మంది హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాతలు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సాయిసన్నిధిలో అన్నదానం నిర్వహించారు. పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో వేద పండితులు వేణుగోపాలాచార్య కౌశిక ఆధ్వర్యంలో శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి, విష్ణు సహస్రనామాలు, హైందవ సంప్రదాయం తదితర వాటిపై ప్రవచనం చేశారు. రాజాగౌడ్, సత్యనారాయణ, పూజారి మధుశర్మ, తిగుళ్ల విశుశర్మ, చంద్రశేఖర్, రవీందర్, రాంచంద్రం, వెంకన్న, శ్రవణ్ పాల్గొన్నారు. పౌలస్తేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి జగిత్యాల రూరల్ : మండలంలోని పొలాస గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పౌలస్తేశ్వరస్వామి దేవాలయంలో మంగళవారం ఘనంగా గురుపౌర్ణమి ఉత్సవాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఈవో ధనుంజయ్, అర్చకులు గోవర్ధనశర్మ, గోపాల్‌శర్మ, సిబ్బంది కోండ్ర రవి తదితరులు పాల్గొన్నారు. -
యాదాద్రిలో పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట (యాదాద్రి) : నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. గురుపూర్ణిమ సందర్భంగా స్థానిక సాయిబాబా దేవాలయానికి భక్తులు బారులు తీరారు. మంగళవారం వేకువజాము నుంచే భక్తుల పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. -
భక్తురాలిపై పూజారి అత్యాచారం
-
భక్తురాలిపై పూజారి అత్యాచారం
హిమాయత్‌నగర్: భక్తురాలికి మాయ మాటలు చెప్పి అత్యాచారం చేశాడు ఓ పూజారి. నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు ఎదురుగానే ఈ వైనం జరగడం పట్ల అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా దౌల్తాబాద్‌కు చెందిన కరణం రాము(26) నారాయణగూడలోని అభిశ్రాయ్ హాస్టల్లో నివాసం ఉంటూ గత నాలుగు నెలలుగా నారాయణగూడలోని పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా ఉన్న సాయిబాబ గుడిలో పూజారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీలో నివాసం ఉండే 45సంవత్సరాల మహిళ ఆర్థిక తదితర ఇబ్బందులతో సతమతం అవుతుంది. ఈ నేపథ్యంలో పూజారి రామును కలసి ఆమె సమస్యలను విన్నవించుకుంది. దీంతో బుధవారం మధ్యాహ్నాం 12.30గంటల ప్రాంతంలో పసుపు, కుంకుమ తదితర సామాగ్రి తీసుకుని గుడికి రమ్మన్నాడు. వాచ్‌మెన్‌కు ఓ మహిళ వస్తుందనీ, గుడికి తాళాలు వేయోద్దని చెప్పాడు. మధ్యాహ్నానానికి ఆమె అవన్ని తీసుకుని వచ్చింది. ఆలయంలోని ఓ రూమ్‌లోకి ఆమెను తీసుకెళ్లి వస్త్రాలు తీయించి శరీరానికి పసుపు, కుంకుమలను పూసి ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో పూజారి నిర్వాకాన్ని ఎదురుగానే ఉన్న పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ భీమ్‌రెడ్డి తెలిపారు. -
సాయిబాబా ఆలయంలో హుండీ చోరీ
శ్రీకాకుళం : శ్రీకాకుళంలోని కిమ్స్ ఆసుపత్రి సమీపంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలోని హుండీని గురువారం ఆర్థరాత్రి దుండగులు అపహరించుకుని పోయారు. ఆ విషయాన్ని శుక్రవారం ఉదయం గుర్తించిన ఆలయ సిబ్బంది.... వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దేవాలయానికి చేరుకుని... దోపిడి జరిగిన తీరును పరిశీలించారు. -
సాయిబాబా ఆలయంలో హుండీ చోరీ
అశ్వాపురం: ఖమ్మం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయంలో ఉన్న హుండీని ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం విషయం తెలుసుకున్న ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎమ్మెల్యే చెప్పులు చోరీ?
హైదరాబాద్: గుడి వద్ద ఓ ఎమ్మెల్యే చెప్పులు చోరీకి గురైనట్టు తెలిసింది. గడ్డి అన్నారం డివిజన్ టీఆర్ఎస్ సమావేశానికి వచ్చిన మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయానికి వచ్చారు. దర్శనం అనంతరం బయటకు వచ్చి చూసే సరికి ఎమ్మెల్యే చెప్పులు కనిపించలేదని తెలిసింది. దీంతో ఆలయంలోని సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించగా ఓ యువకుడు పాదరక్షలు తీసుకెళ్లినట్టు సమాచారం. చోరీకి గురైన పాదరక్షల విలువ సుమారు రూ. 50 వేలు ఉండవచ్చని తెలిసింది. ఈ విషయాన్ని స్థానికి టీఆర్ఎస్ నాయకుడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించి లిఖిత పూర్వకంగా ఎటువంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. -
ఆలయంలో చోరీకి యత్నం
పాలెం(గుంటూరు): గుంటూరు జిల్లా పాలెం మండలం కాజీపాలెం గ్రామంలో పలు దేవాలయాల్లో గుర్తుతెలియని దుండగులు చోరీలకు యత్నించారు. స్థానికులు గుర్తించడంతో.. అక్కడినుంచి ఉడాయించారు. స్థానికంగా ఉన్న అమ్మవారి ఆలయం, శివాలయం, సాయిబాబా ఆలయాలలో గుర్తుతెలియని దుండగులు చోరీకి విఫలయత్నం చేసి ఆలయ తలుపులు పగలగొట్టారు. ఆ సమయంలో శబ్ధం రావడంతో.. గమనించిన స్థానికులు అప్రమత్తమవడంతో.. దుండగులు పరారయ్యారు. -
సాయిబాబా ఆలయంలో చోరీ
కట్టంగూరు(నల్లగొండ): దుండగులు సాయిబాబా గుడిలోని హుండీ పగలగొట్టి సొత్తు ఎత్తుకెళ్లిన సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. బుధవారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి హుండీ తలుపులు పగలగొట్టి ఉండటాన్నిగమనించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రాధమిక విచారణ చేపట్టారు. ఎత్తుకెళ్లిన నగదు రూ. 30 వేలు ఉంటుందని అంచనా వేశారు. కేసు నమోదే చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
గాంధీనగర్ సాయిబాబా గుడిలో చోరీ
గాంధీనగర్ : నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆలయంలో చోరి జరిగింది. లోయర్ ట్యాంక్‌బండ్ సమీపంలోని సాయిబాబ ఆలయంలో సోమవారం అర్ధరాత్రి ఈ చోరీ జరిగింది. ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు నాలుగు హుండీలను బద్దలు కొట్టి వాటి నుంచి సుమారు రూ.60 వేల నగదు తస్కరించారు. మంగళవారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలిని పరిశీలించిని పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది. -
ఇది కాదా ‘వైకల్యం’..?
ఇతని పేరు కడమంచి రాజు(30). వందశాతం వైకల్యం తో నేలపై పాకుతున్న రాజు మెదక్ జిల్లా వాసి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సూరారం సాయిబాబా ఆలయం వద్ద ఉంటు న్నాడు. వికలాంగుల పింఛన్ రాకపోవడంతో భిక్షాటన చేస్తున్నాడు. హైదరాబాద్‌లో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఎన్నిసార్లు తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లినా పింఛన్ ఇవ్వడం లేదని వాపోయాడు. రాజు చిన్నాన్న శివయ్యతో కలసి గురువారం సిరిసిల్ల లో భిక్షాటన చేశాడు. రోడ్డుపై తల ను నేలపై ఉంచుతూ ముందుకు కదులుతున్న రాజు దైన్యస్థితి అందరినీ కదిలించింది. - సిరిసిల్ల -
షిర్డీ సాయిబాబాకు విరాళాల వెల్లువ
షిర్డీ: షిర్డీ సాయిబాబా దేవాలయానికి గత మూడు రోజుల్లో విరాళాలు పెద్ద ఎత్తున వచ్చాయి. సాయిబాబా భక్తులు నగదు, చెక్‌లు, డీడీలు, బంగారు, వెండి ఆభరణాల రూపంలో దాదాపు 4.10 కోట్ల విలువైన విరాళాలు అందజేశారు. దసరా పండుగ సందర్భంగా మూడు రోజుల్లో దాదాపు 1.70 లక్షల మంది భక్తులు బాబాను దర్శించుకున్నట్టు ట్రస్ట్ అధికారులు చెప్పారు. -
బాబా గుడిలో చోరీ: 4.5 కిలోల వెండి అపహరణ
అనంతపురం: అనంతపురం జిల్లా పెనుకొండలోని షిర్డి సాయిబాబా దేవాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సాయిబాబాకు చెందిన వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ విషయాన్ని శనివారం ఉదయం దేవాలయానికి వచ్చిన ఆలయ పూజారీ గమనించి వెంటనే ఆలయ నిర్వహకులకు సమాచారం అందించాడు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 4.5 కేజీల వెండి ఆభరణాలు చోరీ అయ్యాయని, అలాగే రూ. 15 వేల నగదు అపహరించుకుని పోయారని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు దేవాలయానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సాయిబాబా ఆలయంలో తుపాకీ