
యాదాద్రిలో పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట (యాదాద్రి) : నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి భక్తులు పోటెత్తారు. గురుపూర్ణిమ సందర్భంగా స్థానిక సాయిబాబా దేవాలయానికి భక్తులు బారులు తీరారు. మంగళవారం వేకువజాము నుంచే భక్తుల పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.