
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తారు. శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామిని దర్శించుకోవడానికి ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. ప్రస్తుతం స్వామివారి సర్వ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా గుట్టపైకి వాహనాలను అనుమతించడం లేదు.