
యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదాద్రి (నల్లగొండ) : యాదగిరిగుట్టలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవదడానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి ఎక్కువైంది. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.