మార్మోగిన సాయిస్మరణ | grand celbration guru pournami | Sakshi
Sakshi News home page

మార్మోగిన సాయిస్మరణ

Published Tue, Jul 19 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

grand celbration guru pournami

సాయిపూజలు, గురుపౌర్ణమి, ప్రత్యేక పూజలు, gurupournami, saibaba temple, sperate poojalu
 
జగిత్యాల అర్బన్‌ : గురుపౌర్ణమిని పురస్కరించుకుని పట్టణంలోని సాయిబాబా ఆలయంలో భక్తులు వేలాది మంది హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాతలు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సాయిసన్నిధిలో అన్నదానం నిర్వహించారు. పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో వేద పండితులు వేణుగోపాలాచార్య కౌశిక ఆధ్వర్యంలో శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి, విష్ణు సహస్రనామాలు, హైందవ సంప్రదాయం తదితర వాటిపై ప్రవచనం చేశారు. రాజాగౌడ్, సత్యనారాయణ, పూజారి మధుశర్మ, తిగుళ్ల విశుశర్మ, చంద్రశేఖర్, రవీందర్, రాంచంద్రం, వెంకన్న, శ్రవణ్‌ పాల్గొన్నారు.
 
పౌలస్తేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి
జగిత్యాల రూరల్‌ : మండలంలోని పొలాస గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పౌలస్తేశ్వరస్వామి దేవాలయంలో మంగళవారం ఘనంగా గురుపౌర్ణమి ఉత్సవాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఈవో ధనుంజయ్, అర్చకులు గోవర్ధనశర్మ, గోపాల్‌శర్మ, సిబ్బంది కోండ్ర రవి తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement