gurupournami
-
గురుభ్యోనమః
హిందూ సమాజంలో గురువుకు అత్యున్నత స్థానం ఉంది. ప్రతి మనిషికీ వివేకం, విచక్షణ, వితరణ ఈ మూడింటినీ అందించగలిగే వారే గురువు. ఒక అంశాన్ని మనకు బోధించి, ఆ రంగంలో జ్ఞానాన్ని ప్రసాదించేవారందరూ గురువులే. గురు అంటే మాయను నిర్మూలించి, జ్ఞాన మార్గాన్ని నడిపించేవారని అర్థం. ఇది కేవలం ఆధ్యాత్మిక భావనతోనే చెప్పినదికాదు. ఏ రంగానికైనా ఇది వర్తిస్తుంది. ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమి రోజును హిందువులు గురుపౌర్ణమి రోజుగా పాటిస్తారు. ఈ పర్వదినాన గురువును ప్రతి ఒక్కరూ ఆరాధిస్తే శుభాలు కలుగుతాయని ప్రతీతి. జిల్లా వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, సాయి సత్యవ్రతాలు జరిగాయి. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ కమిటీలు, దాతలు భక్తులకు అన్నదానం నిర్వహించారు. -
సాయి మహారాజ్‌కీ జై
-
మార్మోగిన సాయిస్మరణ
సాయిపూజలు, గురుపౌర్ణమి, ప్రత్యేక పూజలు, gurupournami, saibaba temple, sperate poojalu జగిత్యాల అర్బన్ : గురుపౌర్ణమిని పురస్కరించుకుని పట్టణంలోని సాయిబాబా ఆలయంలో భక్తులు వేలాది మంది హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాతలు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సాయిసన్నిధిలో అన్నదానం నిర్వహించారు. పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో వేద పండితులు వేణుగోపాలాచార్య కౌశిక ఆధ్వర్యంలో శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి, విష్ణు సహస్రనామాలు, హైందవ సంప్రదాయం తదితర వాటిపై ప్రవచనం చేశారు. రాజాగౌడ్, సత్యనారాయణ, పూజారి మధుశర్మ, తిగుళ్ల విశుశర్మ, చంద్రశేఖర్, రవీందర్, రాంచంద్రం, వెంకన్న, శ్రవణ్ పాల్గొన్నారు. పౌలస్తేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి జగిత్యాల రూరల్ : మండలంలోని పొలాస గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పౌలస్తేశ్వరస్వామి దేవాలయంలో మంగళవారం ఘనంగా గురుపౌర్ణమి ఉత్సవాలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఈవో ధనుంజయ్, అర్చకులు గోవర్ధనశర్మ, గోపాల్‌శర్మ, సిబ్బంది కోండ్ర రవి తదితరులు పాల్గొన్నారు. -
మదిమదినా మధుర స్మరణ
గురు బ్రహ్మ,గురు విష్ణు..గురు దేవోమహేశ్వరహ..గురు సాక్షాత్ పరబ్రహ్మ..తస్మై శ్రీ గురవే నమః’. తల్లిదండ్రుల తర్వాత గురువే ప్రధానం. ఆ తర్వాతే దైవం. అలాంటి గురువే ప్రత్యక్ష దైవమని చెప్పే గొప్ప వేడుగ గురుపౌర్ణమి. వ్యాస మహార్షి జన్మతిథిని పురస్కరించుకుని ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆ సాయినాథుడ్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. జిల్లాలో షిరిడీ సాయిబాబా ఆలయాలు భక్తులతో కిక్కిరిసాయి. -
బాసరలో గురుపౌర్ణమి వేడుకలు
జ్ఞాన ప్రదాత.. సరస్వతీ మాత ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య వేద పండితులు, కళాకారులు, సాహితీ వేత్తలకు సన్మానం బాసర : సకల జనులకూ జ్ఞానాన్ని అందించే ప్రదాత.. సరస్వతీ మాత అని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ అక్షర భ్యాస మండపంలో మంగళవారం గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ప్రధాన ఆలయాలకు చెందిన సుమారు 140 మంది వేద పండితులు, అర్చకులు, కళాకారులను ఘనంగా సన్మానించారు. వీరికి ఒక్కొక్కరికి రూ.1000 నుంచి రూ.5,100 వరకు నగదు పురస్కారాన్ని దేవాదాయ, «దర్మాదాయ ఆధ్వర్యంలో అందజేశారు. అంతకుముందు ముథోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, డీఆర్డీ అరుణకుమారి హాజరై పండితులకు సన్మానం చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువుల సేవలు మరిపోలేనివి గురుపౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెందిన వేద పండితులు, అర్చకులు ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని అన్నారు. గురువుల సేవలను ఏ శిష్యుడూ మరచిపోలేరని పేర్కొన్నారు. ముగిసిన యజ్ఞం ఉత్సవాల ప్రారంభం రోజు నుంచి జరుగుతున్న మహాచండీ యాగం మంగళవారం ముగిసింది. పూర్ణాహుతితో వేద పండితులు యజ్ఞాన్ని ముగింపు పలికారు. ముగింపు ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డితోపాటు ప్రముఖ విద్యావేత్త, చుక్కా రామయ్య పాల్గొన్నారు. కళాకారులకు సన్మానం గురుపౌర్ణమిని పురస్కరించుకొని సన్మానం పొందిన వారిలో పలువురు ప్రముఖ కళాకారులు ఉన్నారు. 800కు పైగా సినిమాల్లో, సీరియల్స్‌లో వివిధ పాత్రల్లో నటించిన మహంకాళి బాలగంగాధర్ తిలక్, కర్ణాటక సంగీత విద్వాంసులు రామకష్ణ సన్మానం పొందారు. వీరితోపాటు ్రప్రముఖ రచయిత, తెలంగాణ విశ్వవిద్యాలయ తెలుగు అధ్యయన శాఖ అధ్యక్షులు, ప్రిన్సిపాల్ ఆచార్య పి.కనకయ్య, ఇదే శాఖ సహాయ ఆచార్యులు, తెలంగాణ సాహిత్య పరిశోధకులు డాక్టర్ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి, బాసరకు చెందిన రిౖటñ ర్ట్ ఉపాధ్యాయుడు నరసింహాచారి, వేదపండితులు నాగేశ్వర శర్మ, నటేశ్వర శర్మ తదితరులను శాలువాతో సత్కరించారు. నగదు పురస్కారాలు అందజేశారు. ఈ ముంగిపు ఉత్సవ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ అనూషాసాయిబాబా, జెడ్పీటీసీ లక్ష్మీనర్సాగౌడ్, సర్పంచ్ శైలజ సతీశ్వర్‌రావు, ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యులు గెంటెల శ్యాంసుందర్, భూదేవి, ముథోల్ పీఏసీఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, డైరెక్టర్ హన్మంతరావు, వైస్ చైర్మన్ రమేశ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నూకం రామారావు, ముథోల్ సీఐ రఘుపతి, ట్రైనీ ఎస్సై టి.మహేశ్, టీఆర్ఎస్ నాయకులు బాల్గం దేవేందర్, జగ్గం మల్కన్న, బాల మల్కన్న తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా గురుపౌర్ణమి ఉత్సవాలు
-
మంత్రాలయంలో ప్రత్యేక పూజలు
మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సన్నిధిలో గురుపౌర్ణమి వేడుకలు వైభవం జరుగుతున్నాయి. ఉదయం తులసివనం వరకు బంగారు పల్లకితో ఊరేగింపుగా వెళ్లి మృత్తికను తీసుకువచ్చారు. శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.