షిర్డీ సాయిబాబా దేవాలయానికి గత మూడు రోజుల్లో విరాళాలు పెద్ద ఎత్తున వచ్చాయి.
షిర్డీ: షిర్డీ సాయిబాబా దేవాలయానికి గత మూడు రోజుల్లో విరాళాలు పెద్ద ఎత్తున వచ్చాయి. సాయిబాబా భక్తులు నగదు, చెక్లు, డీడీలు, బంగారు, వెండి ఆభరణాల రూపంలో దాదాపు 4.10 కోట్ల విలువైన విరాళాలు అందజేశారు. దసరా పండుగ సందర్భంగా మూడు రోజుల్లో దాదాపు 1.70 లక్షల మంది భక్తులు బాబాను దర్శించుకున్నట్టు ట్రస్ట్ అధికారులు చెప్పారు.