కేవలం మూడు రోజుల్లోనే 4.47 కోట్లు విరాళాలు!
కేవలం మూడు రోజుల్లోనే 4.47 కోట్లు విరాళాలు!
Published Wed, Jul 16 2014 2:55 PM | Last Updated on Mon, Oct 8 2018 6:18 PM
షిర్డి: గురు పూర్ణిమ పర్వదినం నేపథ్యంలో షిర్డిలోని సాయిబాబ ఆలయానికి భారీగా విరాళాల్ని భక్తులు సమర్పించుకున్నారు. గురు పూర్ణిమ సందర్భంగా జరిగిన మూడు రోజుల ఉత్సవాల్లో 4.47 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
గత సంవత్సరంతో పోల్చుకుంటే విరాళాలు గణనీయంగా పెరిగాయని నిర్వహకులు వెల్లడించారు. గత సంవత్సరం కార్యక్రమాలకు కేవలం 38 లక్షలు మాత్రమే వచ్చాయన్నారు. డొనేషన్ బాక్సులో నగదు, బంగారం, వెండి రూపంలో 3.10 కోట్ల రూపాయలు, ఆన్ లైన్ లో 1.46 కోట్లు వచ్చాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
Advertisement
Advertisement