అనంతపురం: అనంతపురం జిల్లా పెనుకొండలోని షిర్డి సాయిబాబా దేవాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సాయిబాబాకు చెందిన వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ విషయాన్ని శనివారం ఉదయం దేవాలయానికి వచ్చిన ఆలయ పూజారీ గమనించి వెంటనే ఆలయ నిర్వహకులకు సమాచారం అందించాడు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాదాపు 4.5 కేజీల వెండి ఆభరణాలు చోరీ అయ్యాయని, అలాగే రూ. 15 వేల నగదు అపహరించుకుని పోయారని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు దేవాలయానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.