
సిరిసిల్ల రోడ్డు వెంట భిక్షాటన చేస్తున్న వికలాంగుడు
ఇతని పేరు కడమంచి రాజు(30). వందశాతం వైకల్యం తో నేలపై పాకుతున్న రాజు మెదక్ జిల్లా వాసి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సూరారం సాయిబాబా ఆలయం వద్ద ఉంటు న్నాడు. వికలాంగుల పింఛన్ రాకపోవడంతో భిక్షాటన చేస్తున్నాడు. హైదరాబాద్‌లో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నానని, ఎన్నిసార్లు తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లినా పింఛన్ ఇవ్వడం లేదని వాపోయాడు. రాజు చిన్నాన్న శివయ్యతో కలసి గురువారం సిరిసిల్ల లో భిక్షాటన చేశాడు. రోడ్డుపై తల ను నేలపై ఉంచుతూ ముందుకు కదులుతున్న రాజు దైన్యస్థితి అందరినీ కదిలించింది.
- సిరిసిల్ల