
సాక్షి, ముంబై : ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. షిర్డీ ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కేసీఆర్ ప్రత్యేక పూజలు చేసి.. మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
షిర్డీ సాయిబాబాను దర్శించుకునేందుకు సీఎం కేసీఆర్ కుటుంబం శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి షిర్డీకి బయల్దేరిన విషయం విదితమే. కేసీఆర్ తిరిగి ఈరోజు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment