shirdi tour
-
విజయవాడ–షిర్డీ విమాన సర్వీసులు ప్రారంభం
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి ఇండిగో సంస్థ ఆదివారం నుంచి విమాన సర్వీసులను ప్రారంభించింది. మధ్యాహ్నం 12.25 గంటలకు సుమారు 70 మంది ప్రయాణికులతో విమానం షిర్డీకి బయల్దేరి వెళ్లింది. అక్కడి నుంచి 66 మంది ప్రయాణికులతో విమానం తిరిగి సాయంత్రం 4.35 గంటలకు గన్నవరం చేరుకుంది. రోజూ అందుబాటులో ఉండే ఈ విమాన సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఇండిగో ప్రతినిధులు కోరారు. -
షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, ముంబై : ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. షిర్డీ ఆలయానికి చేరుకున్న కేసీఆర్కు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. కేసీఆర్ ప్రత్యేక పూజలు చేసి.. మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. షిర్డీ సాయిబాబాను దర్శించుకునేందుకు సీఎం కేసీఆర్ కుటుంబం శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టు నుంచి షిర్డీకి బయల్దేరిన విషయం విదితమే. కేసీఆర్ తిరిగి ఈరోజు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోనున్నారు. -
షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న సీఎం కేసీఆర్
-
సింహపురి సాయిభక్తుల షిరిడీ యాత్ర
నెల్లూరు(బృందావనం): బాలాజీనగర్ శివారు పద్మావతినగర్లోని సాయిదర్బార్ అద్దాల మందిరం నుంచి నెల్లూరుకు చెందిన 200 మంది సాయినాథుని భక్తులు ఇరుముడి ధరించి ఆదివారం షిరిడీ యాత్రకు బయల్దేరారు. మందిరంలో ప్రత్యేక భజనలు చేశారు. తదుపరి అన్నసంతర్పణ జరిగింది. ఈ సందర్భంగా మందిర మేనేజింగ్ ట్రస్టీ మధుసాయి మాట్లాడారు. పదేళ్లుగా నెల్లూరు నుంచి వందలాది మంది భక్తులతో ఇరుముడి ధరించి షిరిడీ యాత్రను చేపడుతున్నామని వివరించారు. బాబా దర్శనం అనంతరం 25వ తేదీన నెల్లూరు చేరుకోనున్నారని చెప్పారు.