సీబీఐ విచారిస్తే ఆధారాలిస్తాం
భూకుంభకోణంలో తలసాని: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపిస్తే మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాత్రకు సంబంధిం చిన ఆధారాలు ఇస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి చెప్పారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ.. తలసాని పిట్ట బెది రింపులకు భయపడేది లేదన్నారు. భూకుంభకోణంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ కూడా ఇదే చెప్పారన్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణమైన దీన్ని సీబీఐకి కాకుండా సీఐడీకి అప్పగించడంలో రహస్యమేంట ని ప్రశ్నించారు.
తలసాని బాగోతం బయటపడుతుందనే భయంతోనే సీబీఐకి ఇవ్వడం లేదన్నారు. పెద్ద పెద్ద రాజకీయ, పోలీసు అధికారుల హస్తముందనే నయీం కేసును ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. కేసీఆర్‌కు నైతిక విలువలుంటే తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని మర్చి పోవద్దని మల్లు సూచించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు గాంధీభవన్‌లో శనివారం జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సోనియా ఫొటో లేకుండా, రాజకీయ స్వార్థంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. ఈ సంద ర్భంగా పలువురు ఉద్యమకారులను సన్మానించారు.